Begin typing your search above and press return to search.

గుస్సా బాలయ్య...ఏం సాధించారయ్యా ?

బాలయ్య అంటేనే ఆవేశానికి మారు పేరుగా చెబుతారు. అయితే ఆయన ఆవేశానికి కూడా అర్థం ఉంటుందని సన్నిహితులు అంటారు.

By:  Satya P   |   30 Sept 2025 9:28 AM IST
గుస్సా బాలయ్య...ఏం సాధించారయ్యా ?
X

బాలయ్య అంటేనే ఆవేశానికి మారు పేరుగా చెబుతారు. అయితే ఆయన ఆవేశానికి కూడా అర్థం ఉంటుందని సన్నిహితులు అంటారు. ఇక తరువాత జరిగే పరిణామాలు పర్యవసానాలు ఏవీ బాలయ్య అయితే పట్టించుకోరు అని అంటారు. అలాంటిదే ఇపుడు జరిగింది. అసెంబ్లీలో భాలయ్య ఆగ్రహం చెందారు. అయితే ఆయన యాక్షన్ కి రియాక్షన్ మాత్రమే ఇచ్చారు అని సన్నిహితులు అంటున్నారు. ఆయన గతంలో చాలా మంది పదే పదే చెప్పిన దానినే చెప్పారు తప్ప తాను సొంతంగా ఒక్క మాట అనలేదని అంటున్నారు.

కట్టుబడినట్లేనా :

ఇదిలా ఉంటే బాలయ్య వ్యాఖ్యల మీద మెగాస్టార్ చిరంజీవి మనస్తాపం చెంది ఆ వెంటనే విదేశాల నుంచే ఒక లేఖను విడుదల చేయడం అందులో ఫుల్ క్లారిటీ ఇవ్వడం జరిగిపోయాయి. దాంతో డ్యామేజ్ జరిగిందని గుర్తించిన కూటమి పెద్దలు దీని మీద మల్లగుల్లాలు పడ్డారని అంటున్నారు. బాలయ్య చేసిన వ్యాఖ్యల మీద ఆయననే స్వయంగా సభకు వచ్చి తొలగించమని స్పీకర్ ని కోరాలని కూడా సూచించారు అని అంటున్నారు. అయితే తాను ఏమీ తప్పు మాట్లాడలేదని అందరూ చెప్పిందే అన్నాను అని బాలయ్య చెప్పారని అంటున్నారు. దాంతో కామినేని శ్రీనివాసరావు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లుగా చెప్పడంతో మొత్తం మీద ఆయనవీ బాలయ్యవీ కలిపి తొలగించారు అని అంటున్నారు.

ఆగ్రహం అలాగేనా :

అయితే తాను పెద్దగా ఏమీ అనకపోయినా అర్ధాలు పెడర్ధాలు తీసి తనను కార్నర్ చేయడమేంటి అని బాలయ్య ఆగ్రహం మీద ఉన్నారని అంటున్నారు. అంతే కాదు తామేదే తప్పు చేసినట్లుగా టీడీపీ అధినాయకత్వం వ్యవహరించడం మీద కూడా ఆయన ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. మరో వైపు చూస్తే బాలయ్య ఒక విషయంతో అధినాయకత్వం వద్ద డిమాండ్ పెట్టారు అని అంటున్నారు. అదే ఎఫ్డీసీ చైర్మన్ పదవికి తన మనిషికి ఇప్పించుకోవడం కోసం.

పట్టుబడితేనే :

స్వతహాగా బాలయ్య పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఏమీ కోరరని అంటున్నారు. అయితే ఆయన అప్పుడప్పుడు ఏదైనా కోరారు అంటే తీర్చాలని పట్టుదలగా ఉంటారని అంటున్నారు. ఇపుడు అలాంటిదే వచ్చిందని అంటున్నారు. ఎఫ్డీసీ చైర్మన్ పదవి విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఒక బలమైన సిఫార్స్ ఉందని చెబుతున్నారు. ఆయన హరిహర వీరమల్లు సినిమా తీసిన నిర్మాత ఏఎం రత్నం ని ఆ పదవిలో కూర్చోబెట్టాలని అనుకుంటున్నారని అంటున్నారు. దాంతో అటు బాలయ్య ఇటు పవన్ ఇద్దరి విషయంలో ఏమీ నిర్ణయం ఇంకా తీసుకోలేదని అంటున్నారు.

ఎఫ్డీసీ చైర్మన్ పదవి :

ఈ నేపథ్యంలో టీడీపీకి ఇబ్బంది కలిగించేలా బాలయ్య వ్యవహరించారు అని ఆయన మీద కాసింత కోపంతోనే హైకమాండ్ ఉందని అంటున్నారు. అదే సమయంలో పవన్ తో చంద్రబాబు భేటీ కావడంతో ఎఫ్డీసీ చైర్మన్ పదవి కచ్చితంగా జనసేన సూచించిన వారికే దక్కుతుందని ప్రచారం సాగుతోంది. తనకు ప్రాధాన్యత తగ్గుతోందని కొంతకాలంగా అసంతృప్తిగా బాలయ్య ఉన్నారని అదే అసెంబ్లీలో ఆయన ఆగ్రహానికి కారణం అయిందని అంటున్నారు ఇపుడు ఎఫ్డీసీ పదవి కనుక ఆయన చెప్పిన వారికి ఇవ్వకపోతే ఎలా రియాక్ట్ అవుతారు అన్నది ఒక చర్చగా నడుస్తోంది అదే సమయంలో అసెంబ్లీ ఎపిసోడ్ తో బాలయ్య ఏమి సాధించారు అన్నది కూడా ఒక చర్చగా ఉంది అంటున్నారు.