Begin typing your search above and press return to search.

బాలయ్య సైలెంట్ మోడ్ లోకి ?

గత ఏడాది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో ఒక రోజు సభకు హాజరైన బాలయ్య అప్పట్లో ఒక అంశలో సభలో మాట్లాడారు.

By:  Satya P   |   7 Feb 2026 8:00 AM IST
బాలయ్య సైలెంట్ మోడ్ లోకి ?
X

నందమూరి బాలక్రిష్ణ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ గా చెప్పాలి, ఏజ్ తో సంబంధం లేకుండా ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉంటారు. సినిమాలు సామాజిక సేవ రాజకీయాలు ఇలా అన్ని రంగాలలో సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తూ వస్తున్నరు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పాలిటిక్స్ లో రికార్డు క్రియేట్ చేశారు. పద్మ భూషణుడుగా సినీ సీమలో ఉన్నత స్థానం అధిరోహించారు. బసవతారకం ఆస్పత్రి చైర్మన్ గా ఉదాత్తమైన సేవ అందిస్తున్నారు.

హిందూపురంలోనూ :

ఇలా టాలీవుడ్ లో నట సింహంగా ఉంటూ వరుస సినిమాలు చేస్తూ వస్తున్నారు. అదే సమయంలో తన సొంత నియోజకవర్గం హిందూపురాన్ని ఆయన విస్మరించడం లేదు. అక్కడ అభివృద్ధి పనులను శరవేగంతో జరిపిస్తున్నారు. మంత్రులతో నేరుగా మాట్లాడుతూ తన నియోజకవర్గానికి అవసరమైన వాటిని సాధిస్తున్నారు. ఇదిలా ఉంటే బాలయ్య ఇటీవల పూర్తిగా మీడియాకు చిక్కడం లేదు, పైగా ఆయన రాజకీయ వేదికల మీద పెద్దగా కనిపించడం లేదు, ఎంతసేపూ తన నియోజకవర్గానికి పరిమితం అయి అక్కడితోనే ఆగిపోతున్నారు.

అమరావతికి దూరంగా :

దీని వెనక ఏమి జరిగింది, ఎందుకు బాలయ్య అమరావతికి దూరం పాటిస్తున్నారు అన్న చర్చ సాగుతోంది. ఈ మధ్యలో ఆయన అనేక పార్టీ సమావేశాలకు కానీ ప్రభుత్వ కార్యక్రమాలకు కానీ దూరంగా ఉంటున్నారు అని టాక్ అయితే ఉంది. ఇలా ఎందుకు జరుగుతోంది అన్నది కూడా అంతా ఆరా తీస్తున్నారు. బాలయ్య అయితే పెద్దగా రాజధాని పరిసర ప్రాంతాలలో కానీ సచివాలయంలో కానీ కనిపించడం లేదు అని అంటున్నారు.

అసెంబ్లీలో అలా :

గత ఏడాది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరిగాయి. ఆ సమయంలో ఒక రోజు సభకు హాజరైన బాలయ్య అప్పట్లో ఒక అంశలో సభలో మాట్లాడారు. జగన్ సీఎం గా ఉన్నపుడు సినీ వర్గాన్ని ఇబ్బంది పెట్టారు అన్న అంశం మీద ఆయన సభలో రియాక్ట్ అయి చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాన్ని సృష్టించాయి. దాంతో ఆ తర్వాత అది అతి పెద్ద వివాదానికే దారి తీసింది. బాలయ్య చిరంజీవిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు అని ప్రచారం సాగింది. అయితే బాలయ్య నాటి వైసీపీ ప్రభుత్వం తీరునే విమర్శించారు తప్పించి ఎవరినీ వ్యక్తిగతంగా అనలేదని కూడా ఆయన వైపు నుంచి మద్దతుగా మాట్లాడిన వారు ఉన్నారు.

కేరాఫ్ హిందూపురం :

అయితే అది జరిగిన తరువాత మాత్రం బాలయ్య ఎందుకో ఫుల్ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఈ మధ్యలో ఆయన నటించిన అఖండ-2 మూవీ రిలీజ్ అయింది. ఆ ప్రమోషన్స్ తో బిజీ అయ్యారు. ఆ తరువాత బాలయ్య పెద్దగా కనిపించింది లేదు, ఇక ఆయన నోటి వెంట రాజకీయ ప్రకటనలు కూడా లేవు, ఈ మధ్యలో అనేకం జరిగాయి. కానీ బాలయ్య మాత్రం ప్రభుత్వ వ్యవహారాలలో పెద్దగా కనిపించింది లేదు అని గుర్తు చేస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది బాలయ్య అసంతృప్తిగా ఉన్నారా అంటే అదేమీ లేదని కూడా మరో వైపు చెబుతున్నారు. అయితే బాలయ్య తానుగానే తన పనులలో బిజీ అవుతున్నారు, తన నియోజకవర్గానికి న్యాయం చేస్తూ వస్తున్నారు అని అంటున్నారు.

అసెంబ్లీలో మెరిసేనా :

ఇక చూస్తే ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి మొదలవుతున్నాయి. మరి ఈసారి అసెంబ్లీ సమావేశాలు కీలకంగా ఉన్నాయి. బడ్జెట్ సెషన్ గా కూడా వీటిని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలు నెల రోజుల పాటు సుదీర్ఘంగా నిర్వహించనున్నారు. మరి ఈ సమావేశాలకు బాలయ్య అటెండ్ అవుతారా ఆయన సభలో ఏమైనా అంశాలను ప్రస్తావిస్తారా అన్న ఆసక్తి అయితే అందరిలో ఉంది. ఎందుకంటే గత అసెంబ్లీ సెషన్ లో బాలయ్య మాట్లాడిన మాటలు ఇంకా అందరికీ గుర్తు ఉన్నాయి కాబట్టి ఈసారి ఆయన వైఖరి ఎలా ఉంటుంది అన్నది కూడా చర్చగా ఉంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.