Begin typing your search above and press return to search.

బాలయ్యకు రాజయోగం...అంతా దైవేచ్చ

బాలయ్యకు జాతకాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ముహూర్తం చూసుకునే ఏ పని అయినా చేస్తారు. స్వయంగా ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలోనూ ప్రవేశం ఉంది.

By:  Satya P   |   15 Oct 2025 6:00 AM IST
బాలయ్యకు రాజయోగం...అంతా దైవేచ్చ
X

ప్రముఖ టాలీవుడ్ నటుడు నందమూరి బాలక్రిష్ణకు సినీ రాజకీయ రంగాలు రెండు కళ్ళు. ఆయన ఒక వైపు నాటౌట్ అన్నట్లుగా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. అదే సమయంలో రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఈ రెండు రంగాలను బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన వరసబెట్టి సినిమాలు చేసే సీనియర్ హీరో. ఒక సినిమా తరువాత మరో సినిమాను లైన్ లో పెట్టి అలా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటారు. వయసు ఆరున్నర పదులు దాటినా ఆయనలో సినీ జోష్ ఏ మాత్రం తగ్గలేదు, ఈ మధ్యనే ఆయన యాభై ఏళ్ళ సినీ కెరీర్ ని పూర్తి చేసుకున్నారు. ఇంకా ఎన్నో పాత్రలలో నటిస్తాను అని ఆయన ప్రతీ సారీ చెబుతూ వస్తూంటారు.

ఎక్కడిదీ డిమాండ్ :

బాలయ్య ఎమ్మెల్యేగా అసెంబ్లీకి చాలా తక్కువగా వస్తూంటారు. ఆయన మాట్లాడిన సందర్భాలు కూడా అరుదుగా ఉంటాయి. అటువంటిది ఆయన మంత్రి పదవిని కోరుకుంటారా అన్నది ఒక పెద్ద పజిల్ లాంటి ప్రశ్న. ఆయన తన మటుకు తాను అన్నట్లుగా ఉంటారు. తన వారు ముఖ్య పదవులలో ఉన్నారు ఇంక తనకేంటి అన్నది ఆయన ఆలోచనగా చెబుతారు. అలాంటిది బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడం ఇపుడు ఏపీలో అతి పెద్ద చర్చగా సాతుతోంది. నిజంగా ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది అన్నది రాజకీయ సర్కిల్స్ లో చర్చగా ఉంది. అంతే కాదు దీని మీద టీడీపీ వర్గాలు సైతం ఒకింత ఆసక్తితో కూడిన ఆశ్చర్యంతో ఆరా తీసే పనిలో పడ్డాయని అంటున్నారు.

జాతకం సూపర్ గా :

బాలయ్యకు జాతకాల మీద పూర్తి నమ్మకం ఉంది. ఆయన ముహూర్తం చూసుకునే ఏ పని అయినా చేస్తారు. స్వయంగా ఆయనకు జ్యోతిష్య శాస్త్రంలోనూ ప్రవేశం ఉంది. ఆయన చాలా వాటికి తానుగా ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఇక చూస్తే గత కొన్నాళ్ళుగా బాలయ్య జాతకంలో మహా రాజయోగం నడుస్తోంది అని పండితులు అప్పట్లో చెప్పారు. వారు చెప్పారని కాదు కానీ ఆయన సినీ కెరీర్ కానీ ఆయనకు దక్కుతున్న వరస విజయాలు కానీ ఆయనకు అందుతున్న బిరుదులు కానీ పౌర పురస్కారాలు కానీ ఇవన్నీ కూడా బాలయ్య మహర్జాతకం గురించి చెప్పకనే చెబుతున్నాయి రాజకీయంగా చూసినా ఆయన మంచి పొజిషన్ లో ఉన్నారు అనే చెప్పాలి. ఆయన మాట బాగా చెల్లుతోంది. ఈ నేపథ్యంలో ఇపుడు మంత్రి పదవి డిమాండ్ వచ్చింది అంటే ఏమి జరుగుతుంది అన్నది కూడా అంతా చర్చిస్తున్నారు.

దైవేచ్చ అంటూ :

బాలయ్య తనను కలసిన మంత్రి పదవి బాలయ్య చేపట్టాలి అన్న డిమాండ్ ని వినిపించినపుడు చాలా కూల్ గా రెస్పాండ్ కావడమే కాకుండా కాదు అని మాత్రం అనలేదని గుర్తు చేస్తున్నారు పైగా అంతా దైవేచ్చ అని కూడా ఆయన అన్నారని టాక్ నడుస్తోంది. దైవేచ్చ అంటే జాతకంలో ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్న అర్ధం కూడా ఉంది. మరి మహారాజ యోగం నడుస్తోంది బాలయ్యకు అని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మినిస్టర్ పదవిని చేపడతారా అన్నది కూడా బిగ్ డిస్కషన్ గా మారింది.

ఊరిస్తున్న ఒక్క సీటు :

ఏపీ కేబినెట్ లో ఒకే ఒక్క ఖాళీ ఉంది. అది అందరినీ ఊరిస్తోంది. అటు టీడీపీ నుంచి ఇటు జనసేన మరో వైపు బీజేపీ నుంచి కూడా చాలా మంది ఆశలు పెట్టుకున్నారు ఇక ఆ సీటుని జనసేన ఎమ్మెల్సీ మెగా బ్రదర్ నాగబాబుకు ఇస్తారని కూడా ఒక దశలో ప్రచారం సాగింది. మరి ఇపుడు చూస్తే బాలయ్య మంత్రి అంటున్నారు మొత్తానికి చూస్తే బాలయ్య అసెంబ్లీ ఎపిసోడ్ ఇంకా ముగియలేదు కానీ ఇపుడు కొత్త చర్చతో మరోసారి పొలిటికల్ గా హీట్ పెంచుతున్నారు అని అంటున్నారు చూడాలి మరి ఏమి జరుగుతుందో.