'ఏలియన్స్ వస్తున్నారు'.. 2026కి బాబా వంగా చెప్పిన అంచనాలివే!
అవును... బాబా వంగ 2026 సంవత్సరానికి సంబంధించి ఆశ్చర్యకరమైన అంచనాలు వేశారు.
By: Raja Ch | 26 Nov 2025 4:35 PM ISTఅంధురాలైన బల్గేరియన్ బాబా వంగ.. ఆధ్యాత్మికవేత్తగా ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఫ్యూచర్ పై ఆమె అంచనాలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. 1911లో ఉత్తర మాసిడోనియాలో జన్మించిన బాబా వంగ.. 12 సంవత్సరాల వయస్సులో తీవ్రమైన తుపానులో చిక్కుకుని చూపు కోల్పోయారు. ఆ సంఘటనే ఆమెలోని దివ్యదృష్టి సామర్థ్యాలను అన్ లాక్ చేసిందని చాలామంది నమ్ముతుంటారు.
ఈ క్రమంలో ఆమె అంచనాలు చాలా ఏళ్లుగా నిజమని నిరూపించబడ్డాయని చెబుతారు. ప్రధానంగా... 9/11 దాడులు, యువరాణి డయానా మరణం, పలు భూకంపాలు, ఐరోపాలో ఆర్థిక పతనం, మయన్మార్ ని తాకిన భారీ భూకంపం, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం మొదలైన ఆమె అంచనాలు నిజమయ్యాయని చెబుతారు. ఈ క్రమంలో 2026 గురించి ఆమె వెసిన అంచనాలు తెరపైకి వచ్చాయి.
అవును... బాబా వంగ 2026 సంవత్సరానికి సంబంధించి ఆశ్చర్యకరమైన అంచనాలు వేశారు. ఇందులో భాగంగా... గ్రహాంతర జీవులతో మొదటి ప్రత్యక్ష పరిచయం నుంచి నగదు క్రాష్ వరకూ.. మూడో ప్రపంచ యుద్ధం నుంచి ఏఐ ఆధిపత్యం వరకూ చాలా విషయాలపై అంచనాలు వేశారు. ఈ సందర్భంగా టాప్ - 10 అంచనాలేమిటో ఇప్పుడు చూద్దామ్...!
1. ఒక పెద్ద ప్రపంచ సంఘర్షణ (మూడో ప్రపంచ యుద్ధం!):
ఇప్పటికే ప్రపంచం మొత్తం మూడు యుద్ధాలు, ఆరు ఘర్షణలుగా మారిన పరిస్థితుల్లో ఉంది. ఈ నేపథ్యంలో.. 2026లో పెద్ద యుద్ధం ప్రారంభమవుతుందని.. బహుశా ఇందులో ప్రధాన శక్తులు పాల్గొనవచ్చని.. ఇది ఖండాలు దాటిపోతుందని బాబా వంగా అంచనా వేసినత్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. కచ్చింతా ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, భద్రతపై తీవ్ర ప్రభావం ఉంటుందనే చెప్పొచ్చు.
2. మానవులపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధిపత్యం!:
ఇదే క్రమంలో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచంలో మానవాళిపై ఏ స్థాయిలో ప్రభావం చూపిస్తుందనేది తెలిసిన విషయమే. ఈ సమయంలో 2026లో బహుశా మానవ జీవితాలను ఆధిపత్యం చేసే స్థాయిలో ఏఐ, పరిశ్రమలు చేరుకుంటాయని అంచనా వేశారని అంటున్నారు.
3. భారీ ప్రకృతి వైపరిత్యాలు!:
అదే విధంగా... 2026లో భారీ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు తీవ్రమైన వాతావరణ వైపరిత్యాలు జరుగుతాయని బాగా వంగా అంచనా వేశారు! ఇవి గ్రహం భూభాగంలో సుమారు 7 నుంచి 8 శాతాన్ని ప్రభావితం చెస్తాయి. దీంతో... ఈ లెక్కలు మరింత ఆందోళనగా ఉన్నాయని అంటున్నారు.
4. గ్రహాంతర జీవులతో తొలి ప్రత్యక్ష పరిచయం!:
ఇక మరో అంచనా ప్రకారం... 2026లో గ్రహాంతరవాసులతో మానవులు సంబంధాలు ఏర్పరచుకుంటారని.. ఆ ఏడాది నవంబర్ లో ఓ పెద్ద అంతరిక్ష నౌక భూ వాతావరణంలోకి ప్రవేశిస్తుందని చెబుతున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని పలు మీడియా సంస్థలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.
5. రష్యా నుంచి ప్రపంచ నాయకుడు!:
అదే విధంగా ఆమె అంచనాలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం.. 2026లో రష్యా లేదా రష్యా ప్రభావితం చేసే ప్రదేశం నుంచి ఒక శక్తివంతమైన నాయకుడు ఉద్భవిస్తాడని సూచిస్తుండటం. ఆయనను ప్రపంచ ప్రభువు లేదా ప్రపంచ వ్యవహారాల అధిపతి అని అభివర్ణించొచ్చని అంటున్నారు.
6. ప్రపంచ ఆర్ధిక సంక్షోభం లేదా నగదు క్రాష్!:
ఇదే క్రమంలో... ప్రపంచ కరెన్సీ వ్యవస్థలలో పతనం లేదా బ్యాంకింగ్ వైఫల్యాలతో 2026లో అధిక ద్రవ్యోల్బణం సంభవించవచ్చని బాబా వంగ వేసిన మరో అంచనాగా చెబుతున్నారు.
7. బంగారం విషయంలో నాటకీయ మార్పులు!:
2025లో బంగారం ధరలు ఏ స్థాయిలో పేరిగాయనేది తెలిసిన విషయమే. అయితే... 2026లో బంగారం ధరలు ఊహించని విధంగా ప్రవర్తిస్తాయని బాబా వంగ అంచనా వేసినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో భాగంగా బంగారం దాని సురక్షిత స్వర్గధామ హోదాను కోల్పోవచ్చని కొందరు అంటుంటే.. మరికొంతమంది దాని విలువ మరింత పెరుగుతుందని చెబుతున్నారు.
8. వాతావరణ మార్పులు, పర్యావరణ హెచ్చుతగ్గులు!:
ముందుగా చెప్పినట్లుగా ప్రకృతి విపత్తులకు మించి 2026లో వాతావరణ మార్పు, పర్యావరణ సంబంధిత విపత్తులలో ఒక మలుపును సూచిస్తుందని బాబా వంగా అంచనా వేసినట్లు నివేదించబడింది. ఇందులో భాగంగా... కరువులు, వరదలు, తీవ్రమైన వాతావరణం, పర్యావరణ వ్యవస్థలో పెను మార్పులు ఉంటాయని చెబుతున్నారు.
9. ప్రపంచ శక్తిగా ఆసియా!:
ఇదే క్రమంలో మరో ఆపాదన ప్రకారం... 2025లో ఒక ఆసియా శక్తి (చైనా అని అంటున్నారు) దక్షిణ చైనా సముద్రంలో విస్తరణతో సహా ప్రధాన ఆధిపత్యాన్ని పొందే సంవత్సరంగా 2026 నిలుస్తుందట.
10. సామూహిక వలసలు, సామాజిక తిరుగుబాట్లు!:
అదే విధంగా బాబా వంగ.. పర్యావరణ, రాజకీయ, ఆర్థిక సంక్షోభాలతో కలిపి 2026లో వలసలు, పెద్ద ఎత్తున సామాజిక అశాంతి, సమాజాల పరివర్తనకు దారితీస్తుందని అంచనా వేసినట్లు చెబుతున్నారు.
