2025: ఈ ఏడాది బాబా వంగా జోష్యం ఫలించిందా?
బాబా వంగా తన ప్రవచనాత్మక దర్శనాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. సంఘటనలను ముందే ఊహించగల ఆమె అసాధారణ సామర్థ్యాన్ని ఎంతోమంది గౌరవించారు.
By: Madhu Reddy | 8 Dec 2025 3:34 PM IST1911 బల్గేరియాలో జన్మించిన బాబావంగా బాల్యంలోనే తన దృష్టిని కోల్పోయింది. కానీ అసాధారణమైన మానసిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకొని ప్రకృతి వైపరీత్యాల నుండి మొదలు.. రాజకీయ మైలురాళ్ల వరకు ఇలా ఎన్నో ముఖ్యమైన సంఘటనలను ముందుగానే ఊహించి చెప్పింది.చాలా సంవత్సరాలుగా బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం నిజమవ్వడంతో అందరూ బాబా వంగా జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు. 2011లో దాడుల నుండి మొదలు బరాక్ ఒబామా ఎన్నిక వరకు ఆమె చెప్పిన ప్రతి ఒక్కటి నిజమైంది.ఆధ్యాత్మికత, జోష్యం, పారానార్మల్ అధ్యయనాల ప్రపంచంలో ఆమె పట్ల అందరూ నమ్మకంతో ఉన్నారు.
బాబా వంగా తన ప్రవచనాత్మక దర్శనాలతో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. సంఘటనలను ముందే ఊహించగల ఆమె అసాధారణ సామర్థ్యాన్ని ఎంతోమంది గౌరవించారు. అయితే అలాంటి బాబావంగా చెప్పిన జ్యోతిష్యంలో 2025 గురించి చెప్పినవి చాలావరకు నిజమయ్యాయని కొంతమంది భావిస్తున్నారు.దానికి నిదర్శనంగా 2025లో మయన్మార్ లో సంభవించిన విపత్కర భూకంపాన్ని చెబుతున్నారు. మయన్మార్ లో ఈ ఏడాది సంభవించిన భూకంపం కారణంగా దాదాపు 1700 మంది చనిపోయారు. అలాగే 2025వ సంవత్సరంలో ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు మరియు సామాజిక తిరుగుబాట్లు వంటివి ఎన్నో జరిగాయి.అయితే వీటన్నింటినీ బాబావంగా ముందుగానే తెలిపారు.
2025లో ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదురయ్యాయి. ఫ్లైట్స్ కూలిపోవడం, తుఫానులు, భూకంపాలు ఇలా ఎన్నో సంభవించాయి. వరదలు, తుఫాన్లు, భూకంపాల కారణంగా ఎంతో మంది ప్రాణాలు పోయాయి. 2025లో వరదలు, తుఫానులు ప్రపంచాన్ని అల్లో కల్లోలం చేస్తాయని బాబావంగా ముందుగానే తెలిపారు. ఇక రీసెంట్ గా వచ్చిన దిత్వా తుఫాను కారణంగా ఒక్క శ్రీలంకలోనే 153 కి పైగా ప్రజలు చనిపోయారు. దీంతో చాలామంది బాబా వంగా చెప్పింది చెప్పినట్లుగా జరుగుతుందని మాట్లాడుకుంటున్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది బాబావంగా చెప్పిన జోష్యం దాదాపు ఫలించింది అని వార్తలు వినిపిస్తున్నాయి.
అంతేకాకుండా 2026కి సంబంధించి ఎన్నో విషయాలు కూడా బాబా వంగా తెలిపారు. 2026 మొదట్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా భయంకరమైన విధ్వంసం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. 2025లో ప్రపంచం మొత్తంలో ఎన్నో యుద్ధాలు, ప్రకృతి వైపరీత్యాలు జరిగాయి. 2026 లో కూడా భయంకరమైన విధ్వంసాలు జరగబోతున్నాయని తెలిపారు. అంతేకాకుండా 2025లో మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంకలో భారీ వరదలు వచ్చి ప్రజల జీవితాలు అస్తవ్యస్తమయ్యాయి.
