బంగారం ధరలపై బాబా వంగా ప్రిడిక్షన్.. భవిష్యత్తులో?
అటు సామాన్యులు ఎప్పుడో బంగారం కొనడం మానేశారు కానీ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. తప్పని పరిస్థితుల్లో ఉన్న బంగారాన్ని మార్పించి కొత్త బంగారు నగలు చేయిస్తూ తమ పిల్లలకు వివాహాలు చేస్తున్నారు తల్లిదండ్రులు.
By: Madhu Reddy | 28 Oct 2025 12:51 PM ISTబంగారం.. బంగారం.. సామాన్య ప్రజలను మొదలుకొని ప్రపంచ దేశాల వరకు ప్రతి ఒక్కరూ చర్చిస్తున్న ఏకైక అంశం.. ప్రస్తుతం ఎవరు చూసినా సరే బంగారు కొనుగోలు చేయాలని ఆశపడుతున్నా.. ధరల కారణంగా వెనకడుగు వేస్తున్నారు. అటు సామాన్యులు ఎప్పుడో బంగారం కొనడం మానేశారు కానీ ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. తప్పని పరిస్థితుల్లో ఉన్న బంగారాన్ని మార్పించి కొత్త బంగారు నగలు చేయిస్తూ తమ పిల్లలకు వివాహాలు చేస్తున్నారు తల్లిదండ్రులు.
ఇంకొంతమంది అప్పుచేసి మరీ బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో బాబా వంగ జ్యోతిష్యం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అసలు 2026లో ఏం జరగబోతోంది ? బంగారం ధరలలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ? బాబా వంగా చెప్పిన జ్యోతిష్యం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
అసలు విషయంలోకి వెళ్తే.. భవిష్యత్తును ఊహించి చెప్పే బాబా వంగాకి ప్రాముఖ్యత ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జరిగే విషయాలను ముందే ఊహించి చెబుతుంది. అలా ఇప్పుడు బంగారంపై కూడా ఆమె తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. 2026లో ప్రపంచ మార్కెట్ అంతా బంగారం పైన ఆధారపడి ఉంటుందని, బంగారం ఉన్నవారు కోటీశ్వరులే అంటూ కూడా వివరించింది.
2026 నాటికి ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర భారీగా పెరిగే అవకాశం ఉందని బల్గేరియాకు చెందిన బాబా వంగా తెలిపారు. ఆమె చెబుతున్న జోష్యం ప్రకారం చూసుకుంటే.. ప్రపంచం మార్కెట్ లలో అస్థిరత వల్ల అది ఆర్థిక మాన్యానికి దారి తీయవచ్చు అని ఆమె తెలిపారు. ఒకవేళ ఆమె చెప్పిన జోష్యం నిజమైతే బంగారం ఇంట్లో ముందుగానే కొని పెట్టుకున్న వారు కోటీశ్వరులతో సమానమని చెబుతున్నారు. ఏది ఏమైనా వచ్చే ఏడాది బంగారం ధరలు ఆకాశాన్ని తాకబోతున్నాయని తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడితే బంగారంపై ధరలు 25 నుండి 45 శాతం పెరిగే అవకాశం ఉందని, వచ్చే దీపావళి నాటికి ఈ ధరలు మరింత పెరగవచ్చు అని నిపుణులు కూడా చెబుతున్నారు. పైగా వచ్చే ఏడాదికి 1,80,000 వరకు ఈ ధరలు పలికే అవకాశం ఉంటుందని ఒకవేళ ఇది నిజమైతే బంగారం ధరల్లో కొత్త రికార్డు సృష్టించినట్లే అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే..ఈరోజు హైదరాబాదు బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.820 తగ్గి 1,22,460 కి చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.750 తగ్గి రూ.1,12,250 కి చేరుకుంది. అటు వెండిపై రూ.5000 తగ్గి ఏకంగా కేజీ సిల్వర్ ధర 1,65,000 చేరుకుంది.
