Begin typing your search above and press return to search.

అజారుద్దీన్ మంత్రి పదవి ఆరు నెలలు మాత్రమేనా ?

ఏతా వాతా తేలేది ఏమిటి అంటే మరో ఏడాది దాకా మండలిలో సీటు ఖాళీ అయ్యేది లేదు. కానీ అజారుద్దీన్ విషయానికి వస్తే ఆయన మంత్రి అయినా ఆరు నెలల లోపల ఎమ్మెల్సీగా నెగ్గి తీరాల్సిందే.

By:  Satya P   |   1 Nov 2025 8:15 AM IST
అజారుద్దీన్ మంత్రి పదవి ఆరు నెలలు మాత్రమేనా ?
X

అజారుద్దీన్ అనే నేను అంటూ ఇలా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారో లేదో ఆయన మంత్రి పదవి మీద అపుడే చర్చలు స్టార్ట్ అయ్యాయి. అంతే కాదు కొత్త డౌట్లు కూడా తెస్తూ హాట్ డిస్కషన్ కి తెర తీస్తున్నారు. ఆయన పదవీ కాలం ఆరు నెలలు మాత్రమే అని కూడా ప్రత్యర్ధులు జోస్యం చెబుతున్నారు. ఆయన మాజీ కాక తప్పదని అంటున్నారు. ఇంతకీ ఎందుకలా ఏమి జరుగుతుంది, అజారుద్దీన్ పూర్తి కాలం మంత్రిగా కొనసాగాలంటే ఏమి చేయాలి ఆ ఇబ్బందులు అడ్డంకులు ఏమిటి ప్రత్యర్ధులు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత అన్నది హాట్ టాపిక్ గానే కాదు ఆసక్తికరంగానూ ఉంది.

ఏ సభలో సభ్యుడు కాదు :

రాజ్యాంగంలోని రాజ్యాంగంలోని అర్టికల్‌ 75(5) ప్రకారం చూస్తే మంత్రి కావాలంటే శాసన సభలో కానీ శాసన మండలిలో కానీ సభ్యుడు అయి ఉండాలి. ఒక వేళ మంత్రి పదవి అందుకున్నపుడు కాకపోయినా ఆరు నెలల వ్యవధిలో ఏదో సభకు నెగ్గి రావాలి అపుడే మంత్రి పదవి నిలుస్తుంది. ఇక అజారుద్దీన్ విషయమే తీసుకుంటే ఆయన ఏ సభలో సభ్యుడు అయితే కారు, గవర్నర్ కోటా కిందాయనని శాసభ సభకు నామినేట్ చేస్తూ ప్రభుత్వం పంపించిన ఫైల్ అయితే ఇంకా గవర్నర్ వద్దనే ఉంది. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్నదని చెబుతున్నారు. దాంతో ఆ విధంగా ఆరు నెలల్లో ఆయన ఎమ్మెల్సీ అవుతారా లేదా అంటే అది చూడాల్సి ఉంది అంటున్నారు.

ఖాళీలు లేవుగా :

ఇక పెద్దల సభ అయిన శాసనమండలికి ప్రతీ రెండేళ్ళకు ఒక మారు ఎన్నికలు జరుగుతాయి. మధ్యలో ఎవరైనా ఎంపిక కావాలంటే సభ్యుడు రాజీనామా చేయాలి దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి ఆ తరువాత ఎన్నికలు అపుడు ఎమ్మెల్సీ అవుతారు. ఇక తెలంగాణా శాసనమండలిలో చూసుకుంటే ప్రస్తుతానికి అయితే ఖాళీలు లేవని అంటున్నారు. సరిగ్గా ఏడాది తరువాత అంటే 2026 నవంబర్‌లోనే ఖాళీలు ఏర్పడుతాయని అంటున్నారు. అవి కూడా గోరటి వెంకన్న, బసవరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ వంటి వారి పదవీకాలం ఆనాటితో పూర్తి అవుతుంది అని అంటున్నారు ఇక బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు, ఆమె తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను మండలి చైర్మన్ ఆమోదించినా కూడా నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా నుంచే తిరిగి భర్తీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అజారుద్దీన్ ని అక్కడ అకామిడేట్ చేయలేరని అంటున్నారు. పైగా ఈ సీటుకి ఎన్నికలు జరగాలంటే ముందు స్థానిక ఎన్నికలు పూర్తి చేయాలి. అవి కూడా 42 రిజర్వేషన్ల వ్యవహారంతో ముడిపడి ఉందని అంటున్నారు.

ఏడాది దాకా అంతేనా :

ఏతా వాతా తేలేది ఏమిటి అంటే మరో ఏడాది దాకా మండలిలో సీటు ఖాళీ అయ్యేది లేదు. కానీ అజారుద్దీన్ విషయానికి వస్తే ఆయన మంత్రి అయినా ఆరు నెలల లోపల ఎమ్మెల్సీగా నెగ్గి తీరాల్సిందే. ఒక వేళ అలా జరగకపోతే ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది అని అంటున్నారు. గతంలో నందమూరి హరికృష్ణ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా చేశారు. అప్పటికి ఆయన ఏ సభలోనూ మెంబర్ కాదు, ఆరు నెలలలోగా నెగ్గలేకపోయారు, దాంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇదే విధంగా అజారుద్దీన్ విషయంలో జరుగుతుందని ప్రత్యర్ధి అయిన బీఆర్ఎస్ లో నేతలు అంటున్నారు కేవలం జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసమే ఈ విధంగా సడెన్ గా ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు అని ఈ అవసరం తీరాక ఏమి జరుగుతుంది అన్నది ఎవరికీ తెలియదు అని అంటున్నారు. మైనారిటీల ఓట్ల కోసం ఈ విధంగా చేశారు అని బీఆర్ఎస్ నుంచి ఆరోపణలు వస్తున్నాయి. మరి మూడేళ్ళ పాటు అజారుద్దీన్ మంత్రిగా ఉంటారా లేక మధ్యలోనే డకౌట్ అవుతారా అంటే వేచి చూడాల్సిందే.