Begin typing your search above and press return to search.

భీమిలీకి బంపర్ ఆఫర్... అక్కడే ఏవియేషన్ వర్శిటీ !

భీమిలీ నియోజకవర్గం అన్నవరం ప్రాంతంలో ఏకంగా అయిదు వందల ఎకరాలలో ఏవియేషన్ వర్శిటీని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం చురుకుగా చర్యలను చేపడుతోంది.

By:  Satya P   |   14 Dec 2025 9:24 AM IST
భీమిలీకి బంపర్ ఆఫర్... అక్కడే ఏవియేషన్ వర్శిటీ !
X

విశాఖ జిల్లా ఇపుడు అభివృద్ధిలో ముందుకు సాగిపోతోంది. వరసబెట్టి ఇటీ దిగ్గజ పరిశ్రమలు అన్నీ విశాఖ జిల్లాకే వస్తున్నాయి. అందులో కూడా భీమునిపట్నంలో అవి ఏర్పాటు అవుతున్నాయి. అలా భీమిలీ నియోజకవర్గం హాట్ ఫేవరేట్ అవుతోంది. అలాంటి భీమిలీకి ఇపుడు మరో బంపర్ ఆఫర్ తగలబోతోంది. అదేంటి అంటే ఏకంగా ఏవియేషన్ వర్శిటీని అక్కడ ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం చూస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనల దశను దాటి అమలు దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయని అంటున్నారు.

ఆసియాలోనే టాప్ గా :

భీమిలీ నియోజకవర్గం అన్నవరం ప్రాంతంలో ఏకంగా అయిదు వందల ఎకరాలలో ఏవియేషన్ వర్శిటీని ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వం చురుకుగా చర్యలను చేపడుతోంది. ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం అన్నది దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే ఎక్కడా లేదని అంటున్నారు. దాంతో ఆ ఘనత ఏపీకి, విశాఖకు భీమిలీకి దక్కుతోంది అని చెబుతున్నారు. ఈ ఏవియేషన్ వర్శిటీతో పాటుగా ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని కూడా నిర్మించాలని చూస్తున్నారు. ఇక్కడ యువతకు ఏవియేషన్ మీద శిక్షణ విద్య అన్నీ అందిస్తారు. దీని వల్ల సమీప భవిష్యత్తులో వారంతా ప్రపంచ స్థాయిలో ఏవియేషన్ రంగంలో మంచి ఉపాధి అవాకాశాలు అందుకుంటారని అంటున్నారు.

రాజు గారు రెడీ ;

ఈ ఏవియేషన్ వర్శిటీ ఎడ్యుకేషన్ సిటీ కోసం తన భూములను లీజుకు ఇవ్వడానికి గోవా గవర్నర్ పూసపాటి సంస్థానాధీశులు అయిన అశోక్ గజపతిరాజు ముందుకు వచ్చారు. ఆయనకు అన్నవరం ప్రాంతంలో మాన్సాస్ ట్రస్ట్ కి చెందిన 130 ఎకరాలు ఉన్నాయని చెబుతున్నారు. వీటిని లీజుకి ఇచ్చేందుకు ఆయన సుముఖంగా ఉన్నారని చెబుతున్నారు. మిగిలిన భూమి అక్కడ ప్రభుత్వం వద్ద ఉంది. అలాగే కావాల్సి వస్తే మరికొంత ప్రైవేట్ భూములు తీసుకుని ఏవియేషన్ వర్శిటీ ఎడ్యుకేషన్ సెంటర్ ని ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది అని అంటున్నారు.

ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ :

ఇదే విషయం మీద మంత్రి నారా లోకేష్ ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆయన ఇప్పటికే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుని నిర్మిస్తున్న ప్రఖ్యాత సంస్థ జీఎమ్మార్ సంస్థ అధికారులతో తాజాగా చర్చించారు అని అంటున్నారు. వారిని కూడా ఇందులో భాగస్వాములను చేయడం ద్వారా ఏవియేషన్ వర్శిటీని తొందరగా ఆచరణలోకి తీసుకుని రావాలని చూస్తున్నారు.

లోకేష్ కీలక చర్చలు :

ఇక ఈ నెల 16న విజయనగరానికి మంత్రి లోకేష్ వస్తారని అంటున్నారు. ఆయన ఈ భూముల విషయంలో అశోక్ గజపతి రాజుతోనూ అలాగే జీఎమ్మార్ అధికారులతోనూ చర్చిస్తారు అని అంటున్నారు. ఈ సందర్భంగా అసోక్ తో పాటు జీఎమ్మార్ అధినేత గ్రంధ్రి మల్లికార్జున రావుతో లోకేష్ కీలక భేటీని నిర్వహిస్తారు అని చెబుతున్నారు. ఈ చర్చలలోనే ఒప్పందం కుదురుతుంది అని అంటున్నారు.

ఏవియేషన్ హబ్ గా :

కేవలం ఏవియేషన్ వర్శిటీ మాత్రమే కాకుండా ఎడ్యుకేషన్ సిటీగా దీనిని అభివృద్ధి చేస్తారు. అంతే కాకుండా ఏరో స్పేస్, రక్షణ రంగానికి సంబంధించిన విద్యను అందిస్తారు అని అంటున్నారు ఇక వచ్చే ఏడాది జూన్ నాటికి భోగాపురం ఎయిర్ పోర్టు అందుబాటులోకి వస్తుంది. దానికి సమీపంలో ఈ ఏవియేషన్ వర్శిటీని కనుక ఏర్పాటు చేస్తే ఉత్తరాంధ్ర ఏవియేషన్ హబ్ గా మారడమే కాదు ఆసియాలోనే అంతా ఈ వైపు చూసేలా ఈ రంగంలో డెవలప్మెంట్ ఉంటుంది అని అంటున్నారు. కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఏవియేషన్ వర్శిటీని ఉత్తరాంధ్రాలో ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ప్రకటించారు దాంతో తొందరలోనే ఇవన్నీ సాకారం అవుతాయని అంటున్నారు.