Begin typing your search above and press return to search.

ఇండియాలో కూడా ఇలాంటి చట్టం తీసుకువస్తే!

అయితే వయసును కచ్చితంగా నిర్ధారించడానికి సమయం పడుతుందని.. కానీ త్వరలోనే ప్రభుత్వం దానిని గుర్తిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వేల్స్ నేషనల్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఆస్ట్రేలియాలో తెలిపారు.

By:  Madhu Reddy   |   5 Dec 2025 2:08 PM IST
ఇండియాలో కూడా ఇలాంటి చట్టం తీసుకువస్తే!
X

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం ఏ రేంజ్ లో పెరిగిపోయిందంటే.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా పదహారేళ్ల లోపు వయసున్న పిల్లలు కూడా ఈ సోషల్ మీడియాను ఉపయోగిస్తూ.. కొంతమంది తమ కెరియర్ ను తప్పుదోవ పట్టించుకుంటున్నారు అనే వార్తలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు తాజాగా వెలువడిన ఒక వార్త 16 సంవత్సరాల లోపు పిల్లలకు అతిపెద్ద షాక్ అని చెప్పవచ్చు.

విషయంలోకి వెళ్తే.. రీసెంట్ గా సోషల్ మీడియా మీద ఆస్ట్రేలియా తెచ్చిన చట్టాన్ని చాలామంది ప్రశంసిస్తున్నారు. 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా యూస్ చేయకుండా ఓ చట్టం తీసుకువచ్చింది. అయితే తాజాగా ఈ చట్టం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. అలాగే ఆస్ట్రేలియా తీసుకువచ్చిన చట్టాన్ని మిగతా దేశాలు కూడా అనుసరించాలని కూడా చెబుతోంది. తాజాగా ఆస్ట్రేలియా పదహారేళ్ల కంటే తక్కువ వయసున్న వారు సోషల్ మీడియాని వాడకూడదు అని తెచ్చిన చట్టం అమలు చేయడం ప్రారంభించిన తర్వాత.. ఎంతమంది పిల్లలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లలో తమ ఖాతాలను మూసివేస్తున్నారో నెలవారీగా నివేదించాలని బుధవారం రోజు ఆస్ట్రేలియా మంత్రి తెలిపారు.

పదహారేళ్ళ లోపు ఆస్ట్రేలియన్ పిల్లలు తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించడానికి సహేతుకమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైతే డిసెంబర్ 10 నుండి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కిక్, రెడ్డిట్, స్నాప్ చాట్, థ్రెడ్స్, టిక్ టాక్, ఎక్స్, యూట్యూబ్ వంటి ప్లాట్ఫార్మ్స్ కి 50 మిలియన్ వరకు ఆస్ట్రేలియన్ డాలర్ జరిమానా విధించబడతాయని తెలిపారు.

అయితే వయసును కచ్చితంగా నిర్ధారించడానికి సమయం పడుతుందని.. కానీ త్వరలోనే ప్రభుత్వం దానిని గుర్తిస్తుందని కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వేల్స్ నేషనల్ ప్రెస్ క్లబ్ ఆఫ్ ఆస్ట్రేలియాలో తెలిపారు. అయితే e Safety చట్టం యొక్క వ్యవస్థాగత ఉల్లంఘనలను గుర్తిస్తే.. ఫ్లాట్ ఫామ్ లు జరిమానాలను ఎదుర్కొంటాయని ఆమె తెలిపారు. ఈ ఫ్లాట్ ఫామ్ లు పదేపదే రూల్స్ ను అతిక్రమిస్తే కోర్టు గరిష్టంగా జరిమానా విధించవచ్చని e Safety నియంత్రణ సంస్థ తెలిపింది.

ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు పిల్లలు ఎవరైనా డిసెంబర్ 10 నుండి ఆయా ప్లాట్ఫామ్ లతో పాటూ యూట్యూబ్ నుండి సైన్ అవుట్ చేయబడతారని, పైగా ప్లే జాబితాలు వంటివి ఖాతాదారులకు మాత్రమే యాక్సెస్ చేయగల లక్షణాలను కోల్పోతారని గూగుల్ బుధవారం తెలిపింది. అనుబంధ గూగుల్ ఖాతాలలో ఉన్న వ్యక్తిగత డేటా , ఇతర సంకేతాల ఆధారంగా గూగుల్ యూట్యూబ్ ఖాతాదారుల వయసులను నిర్ణయిస్తుంది.. అయితే ఈ చట్టం ప్లాట్ఫార్మ్ ను తప్పుగా అర్థం చేసుకుంటుందని, యువ ఆస్ట్రేలియన్ లు దాన్ని ఉపయోగించే విధానాన్ని అలాగే ముఖ్యంగా పిల్లలు ఆన్లైన్లో సురక్షితంగా ఉంచాలనే దాన్ని ఇది నెరవేర్చలేదని మేము ఎప్పుటి నుంచో చెప్పుకొస్తున్నాం అని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు థ్రెడ్ యాజమాన్యంలోని మెటా అనుమానిత చిన్నపిల్లలను గురువారం నుండి ఆ ఫ్లాట్ఫారం నుండి తొలగిస్తామని తెలిపింది. అలాగే రాబోయే నెలలో ఈ చట్టాన్ని హైకోర్టులో సమర్థించడానికి మేము పోరాడుతాం. ఈ విషయంలో తల్లిదండ్రులు ఆస్ట్రేలియా ప్రభుత్వం ముందుకు రావాలని మంత్రి వేల్స్ తెలిపారు.

గత నెలలో మలేషియా ప్రభుత్వం కూడా 2026 నుండి 16 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా ఖాతాలను నిషేధిస్తామని తెలిపింది. అటు మలేషియాతో పాటూ ఫ్రాన్స్, యూరోపియన్ కమిషన్, గ్రీస్, న్యూజిలాండ్, డెన్మార్క్, రొమేనియా కూడా సోషల్ మీడియాకు కనీస వయసు నిర్ణయించడానికి ఆసక్తిగా ఉన్నారని మంత్రి వేల్స్ తెలిపారు. అంతేకాదు మేము చేసిన ఈ చట్టాన్ని ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తే బాగుంటుంది అని ఆస్ట్రేలియా మంత్రి తెలిపారు. ఇక ఈ విషయం వైరల్ అవ్వడంతో చాలామంది పేరెంట్స్ ఆస్ట్రేలియాలో లాగే ఇండియాలో కూడా ఇలాంటి చట్టం తీసుకువస్తే బాగుంటుందని అంటున్నారు.