అకాశంలో అద్భుతం...కనులకు విందు
నిర్మల ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతోంది. దానికి చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇది ఖగోళపరమైన అద్భుతం అని చెప్పాలి. ఇంతకీ ఈ అద్భుతం ఆవిష్కరణ ఎపుడు అంటే ఆగస్టు 12న.
By: Satya P | 11 Aug 2026 7:00 PM ISTనిర్మల ఆకాశంలో ఒక అద్భుతం జరుగుతోంది. దానికి చూసేందుకు రెండు కళ్ళు చాలవు. ఇది ఖగోళపరమైన అద్భుతం అని చెప్పాలి. ఇంతకీ ఈ అద్భుతం ఆవిష్కరణ ఎపుడు అంటే ఆగస్టు 12న. ఆ రోజు విశేషం అమావాస్య. ఆకాశం అంతా చీకటిగా ఉంటుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ అద్భుతం చోటు చేసుకుంటుంది. ఇక అరుదైన ఖగోళ అద్భుతాలు ఆవిష్కృతం కానున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
అన్నీ ఒకే వరసలోకి :
ఇక ఈ నెల 12న బుధుడు, గురుడు, అంగారకుడు, నెప్యూన్, శని, యురేనస్ గ్రహాలు ఒకే వరసలోకి రానున్నాయి. వీటిలో కొన్ని అస్పష్టంగా కనిపిస్తాయి. మరి కొన్ని స్పష్టంగా ఉంటాయి. ఇక అదే రోజున సంపూర్ణ సూర్యగ్రహణం కావడంతో పెర్సీడ్ ఉల్కాపాతంతో పాటు ఆరు గ్రహాల కూటమి వంటి అద్భుతాలు ఆకాశంలో చోటుచేసుకుంటున్నాయి. అంతే కాదు కామెట్ 109 పీ /స్విఫ్ట్-టటిల్ విడిచిన వ్యర్ధాలతో ఏర్పడిన ఆస్ట్రాయిడ్ కను విందు చేయనుంది. ఇది అమావాస్య సమయంలో రానుండడంతో మరింత ప్రకాశవంతంగా కనిపించనుంది. భూమి ప్రతి సంవత్సరం ఆగస్టులో ఈ తోకచుక్క వదిలిన శిధిలాల గుండా ప్రయాణించినప్పుడు పెర్సీడ్స్ ఉల్కాపాతం ఏర్పడుతుంది. రాత్రి సమయంలో ఎలాంటి చంద్రుని వెలుతురు ఇబ్బంది లేకుండా ఉల్కలు రాలిపోయే అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుంది. అదే ఆగస్టు 12న నింగిలో కను విందు చేయనుంది. భారత్‌లో ఈ ఖగోళ ఘటనలు పలు ప్రాంతాలలో స్పష్టంగా కనిపిస్తాయి
భారత్ లో సూర్య గ్రహణం :
ఇదిలా ఉంటే ఈసారి సంభవించే సంపూర్ణ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు అని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పగటిపూట ఆకాశంలో చంద్రుడు సూర్యుడిని అడ్డుకోవడం వల్ల ఆర్కిటిక్ గ్రీన్లాండ్ ఐస్లాండ్, ఉత్తర స్పెయిన్ ప్రాంతాలలో ఈ గ్రహణం ప్రభావంతో పూర్తిగా చీకటి అమ్ముకుంటుంది. అయితే భారత్ కి మాత్రం ఈ సూర్య గ్రహణం ప్రభావం ఉండదు, భారత్ మొత్తంలో ఏ ప్రాంతంలో కూడా ఇది కనిపించదని అంటున్నారు. అందువల్ల ఇక్కడ ఎటువంటి సూతకాల కాలం పాటించడం లేదా ఏ రకమైన మతపరమైన నియమాలు వర్తించవు అని చెబుతున్నారు. సాధారణంగా సూర్య గ్రహణం అంటే నిష్ట పాటిస్తారు. గ్రహణం ముగియగానే ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం, తమ నక్షత్రాల మీద ఆ గ్రహణ ప్రభావం పడితే దానాలు చేస్తారు. ఈసారి అలాంటివి చేయాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఎందుకంటే గ్రహణ ప్రభావమే ఇండియాకు లేదు కాబట్టి అన్నది శాస్త్రవేత్తల మాట.
