Begin typing your search above and press return to search.

ఆ మంత్రి గారి మీద ఒత్తిడి వేరే లెవెల్ అంటున్నారు

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటాయి. అనేక వర్గాల ప్రజలు ఉంటారు. ప్రతీ సమస్య జీవన్మరణమే. ప్రతీ ఒక్కరి బాధ ప్రపంచ బాధగానే ఉంటుంది.

By:  Satya P   |   8 Sept 2025 2:00 AM IST
ఆ మంత్రి గారి మీద  ఒత్తిడి వేరే లెవెల్ అంటున్నారు
X

రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటాయి. అనేక వర్గాల ప్రజలు ఉంటారు. ప్రతీ సమస్య జీవన్మరణమే. ప్రతీ ఒక్కరి బాధ ప్రపంచ బాధగానే ఉంటుంది. ఈ సమస్యలను ఇక తీర్చే వారు పాలకులు. దాంతో ప్రభుత్వంలో ఉన్న వారి మీద ఎపుడూ అధిక బాధ్యత ఉంటుంది. అయితే ప్రతీ మంత్రిత్వ శాఖకు ఒత్తిడి ఉంటుంది కానీ కొన్ని కీలక శాఖలకు ఇంకా అది ఎక్కువ. అలా చూస్తే కనుక ఏపీలో మరే శాఖకు లేనంత ఒత్తిడి అయితే ఆ ఒక్క శాఖకే ప్రస్తుతం ఉంది అని అంటున్నారు. ఆ శాఖ వ్యవసాయ శాఖ అయితే ఆ మంత్రి గారు అచ్చెన్నాయుడు.

సుదీర్ఘ అనుభవం ఉన్నా :

అచ్చెన్నాయుడుది మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం. ఆయన 1996లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అన్న ఎర్రన్నాయుడు ఎంపీగా పోటీ చేసి గెలవడంతో ఆయన వారసుడిగా అచ్చెన్నాయుడు రాజకీయ అరంగేట్రం చేశారు ఆ తరువాత ఉమ్మడి ఏపీలో మూడు సార్లు విభజన ఏపీలో మరో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014 నుంచి 2019 దాకా మంత్రిగా కీలక శాఖలే చూశారు. ఇక 2019 నుంచి 2024 మధ్యలో ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా ప్రాముఖ్యత కలిగిన స్థానంలోనే ఉన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం రావడంతో ఈసారి ఆయనకు వ్యవసాయ శాఖ దక్కింది. అయితే ఆ శాఖను తీసుకున్న తరువాత ఆయ్హన ఒత్తిళ్ళు మామూలుగా లేవని అంటున్నారు.

కరవు వరదలతో :

అయితే కరవు, లేకుంటే వరదలు ఏపీకి ఎపుడూ సర్వ సాధారణంగా ఉంటాయి. కరవు వచ్చినా లేక వరద వచ్చినా మొదటి ఇబ్బంది వచ్చేది రైతులకే. అలా ఏపీలో వ్యవసాయ రంగం నేరుగానే ప్రభావితం అవుతుంది. దాంతో వ్యవసాయ మంత్రికి ఎక్కడ లేని పని ఉంటుంది. ఇక గత ఏడాది ఎరువుల విషయంలో బాగానే ఉన్నా ఈసారి మాత్రం ఇబ్బందులు వస్తున్నాయి. ఎరువుల కొరతతో రైతన్నలు ఆందోళన పధం పడుతున్నారు. తమకు సరిపడినంత యూరియా కావాలని వారు కోరుతున్నారు. దీంతో గత కొంతకాలంగా ఇదే సమస్య కనిపిస్తోంది.

విపక్షాల విమర్శలు :

సరిపడా యూరియా ఉందని ప్రభుత్వం ఒక వైపు చెబుతూంటే కొరత ఉందని రైతులు ఇబ్బందుల్లో ఉన్నారని విపక్షాలు అంటున్నారు వైసీపీ అయితే ఇదే సమస్యను తీసుకుని జనంలోకి వెళ్తోంది. వాస్తవంగా చూస్తే యూరియా కొరత అయితే ఉంది అని అంటున్నారు కేంద్రం నుంచి ఏపీకి అవసరం అయిన మేరకు యూరియాను తెచ్చే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నా కూడా ఇంకా రైతులలో అయితే అది సంతృప్త స్థాయిలో లేదు, మరో వైపు కూటమి ప్రభుత్వానికి కూడా ఇది ఇబ్బందిగా మారింది. యూరియా విషయంలో విపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని ప్రభుత్వం కోరుతున్నా పెద్దగా మంత్రుల నుంచి అయితే అనుకున్న స్థాయిలో రియాక్షన్ రావడం లేదు అని అంటున్నారు.

అంతా ఆ ఇష్యూ చుట్టూనే :

జగన్ కూడా రైతుల సమస్యల మీదనే జనంలోకి వెళ్తున్నారు. చిత్తూరు బంగారుపాలెంలో మామిడి రైతుల సమస్య అయినా ప్రకాశం జిల్లాలో రైతుల సమస్యలు అయినా జగన్ అప్పట్లో ప్రస్తావించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదని ఆనాడు విమర్శలు వస్తే ఆ తరువాత వరదల మీద విమర్శలు చేశారు ఇపుడు యూరియా ఇష్యూ ముందుకు తెచ్చారు. ఎలా చూసుకున్నా వ్యవసాయ శాఖ మీదనే విపక్షం గురి పెడుతోంది. ఒక విధంగా చూస్తే ఆ శాఖ మంత్రి అచ్చెన్న మీద విపరీతమైన ఒత్తిడి పెరిగిపోతోంది. ఇతర శాఖలకు కూడా ఒత్తిడి ఉన్నా వ్యవసాయ శాఖతో పోలిస్తే తక్కువే అంటున్నారు. రైతులు అన్న అంశం సున్నితమైనది కావడంతో డీల్ చేయడం కూడా కొంత ఇబ్బందిగానే ఉంటోంది. మొత్తానికి అచ్చెన్నకు కూటమి ప్రభుత్వంలో పదిహేను నెలల పాలనలో కాసింత కూడా ఊపిరి తీసుకునే సీన్ అయితే కనిపించడం లేదు అని అంటున్నారు.