Begin typing your search above and press return to search.

HRతో CEO స‌ర‌సం.. కాపురం కూల్చిన కెమెరా.. ఉద్యోగాలూ ఊస్టింగ్!

చుట్టూ మాంచి జోష్ ఉంది.. దూరంగా చీక‌టిలో స‌ర‌సాలాడుకునే ఛాన్సూ ఉంది.. అవ‌కాశం దొరికింది క‌దా! అని ఒక రేంజులో రెచ్చిపోయి స‌ర‌సాలలో మునిగిపోయారు ఈ జంట‌.

By:  Sivaji Kontham   |   7 Sept 2025 5:00 PM IST
HRతో CEO స‌ర‌సం.. కాపురం కూల్చిన కెమెరా.. ఉద్యోగాలూ ఊస్టింగ్!
X

చుట్టూ మాంచి జోష్ ఉంది.. దూరంగా చీక‌టిలో స‌ర‌సాలాడుకునే ఛాన్సూ ఉంది.. అవ‌కాశం దొరికింది క‌దా! అని ఒక రేంజులో రెచ్చిపోయి స‌ర‌సాలలో మునిగిపోయారు ఈ జంట‌. కానీ అక్క‌డే ఓ పెద్ద ట్విస్ట్. లైవ్ కాన్సెర్ట్ లో స్పాట్ లైట్ కెమెరా వీళ్ల‌ కొంప ముంచింది. ఇద్ద‌రూ హ‌గ్ చేసుకుని స‌ర‌సాల్లో మునిగి తేల్తుండ‌గా స్పాట్ లైట్ ఫోక‌స్ లో ప‌బ్లిక్ కి అడ్డంగా దొరికిపోయారు. ఈ వీడియోని ఇప్పుడు ప్ర‌పంచం మొత్తం చూసింది.

అయితే ఆ ఇద్ద‌రూ పెద్ద కంపెనీలో హెచ్‌.ఆర్, సీఈవో పొజిష‌న్ లో ఉన్న‌వారు కావ‌డంతో పెద్ద ర‌చ్చ‌యింది. అప్ప‌టికే వేర్వేరు భాగ‌స్వాముల‌తో వారికి పెళ్ల‌యి ఫ్యామిలీలు ఉన్నాయి. కానీ ఇలా లైవ్ కాన్సెర్టు ఇద్ద‌రి ర‌హ‌స్య భోగోతాన్ని బ‌య‌ట‌పెట్టింది. ఇద్ద‌రినీ రెడ్ హ్యాండెడ్‌గా ప‌ట్టించేసింది. ప‌బ్లిక్ సాక్షిగా సాగిన ఈ భోగోతం కార‌ణంగా ఇప్పుడు కాపురాలు కొల్లేరు అవుతున్నాయి. ఇప్ప‌టికే స‌ద‌రు లేడీ హెచ్.ఆర్ కి త‌న భ‌ర్త విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. హెచ్.ఆర్ ఉద్యోగం కూడా ఊడిపోయింది. ఇక అదే కంపెనీ సీఈవోగా ఉన్న అత‌డు కూడా త‌న ప‌ద‌వికి వెంట‌నే రాజీనామా చేయాల్సి వ‌చ్చింది.

ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. ఇటీవ‌ల విస్త్ర‌తంగా మీడియాలో ప్ర‌చారంలోకి వ‌చ్చిన `ఆస్ట్రోనమర్` సంస్థ‌ మాజీ హెచ్‌ఆర్ హెడ్ క్రిస్టిన్ కాబోట్.. ఆస్ట్రోన‌మ‌ర్ సీఈవో ఆండీ బైరాన్‌ ఒక‌రినొక‌రు కౌగిలించుకుని లైవ్ కాన్సెర్టులో స‌ర‌సాల్లో మునిగి తేల‌గా స్పాట్ లైట్ వారి గుట్టు ర‌ట్టు చేసింది. ఈ తతంగాన్ని మీడియా విస్త్ర‌తంగా క‌వ‌ర్ చేసింది. దీంతో క్రిస్టిన్ కాబోట్ కి త‌న భ‌ర్త ఆండ్రూ విడాకులు ఇచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నట్లు డైలీ మెయిల్ త‌న క‌థ‌నంలో పేర్కొంది.

క్రిస్టిన్ అప్పటి ఖగోళ శాస్త్రవేత్త, సీఈఓ ఆండీ బైరాన్‌తో కలిసి రొమాంటిక్ డేట్ లో ఉన్న విష‌యం ఈవెంట్ కార‌ణంగా బ‌య‌ట‌ప‌డింది. క్రిస్టిన్ భర్త ఆండ్రూ బోస్టన్‌లోని అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వాడు. అయితే అప్ప‌టికే క్రిస్టిన్-ఆమె భ‌ర్త ఆండ్రూ మ‌ధ్య అనుబంధం శిథిలావ‌స్త‌లో ఉంది. ఇప్పుడు ఈ పెద్ద ఘ‌ట‌న త‌ర్వాత ఆండ్రూ ఇక‌ సంకోచం అన్న‌దే లేకుండా భార్య క్రిస్టిన్ నుంచి విడాకులు కావాలంటూ కోర్టుకు ద‌ర‌ఖాస్తు చేసాడు. అయితే ఆండ్రూ మొద‌టి భార్య, 63 ఏళ్ల యోగా టీచర్ జూలియా తన మాజీ జీవిత భాగస్వామి `భర్తగా తగిన వ్యక్తి కాదు` అని తీసిపారేసింది. క్రిస్టిన్ కూడా `భార్యగా తగిన వ్యక్తి` కాదని అన్నారు. ఆండ్రూ డబ్బు గురించి మాత్రమే ఆలోచిస్తున్నానని, క్రిస్టిన్ చేసిన ప‌నితో బాధ కంటే ఇబ్బందిప‌డ్డాన‌ని వ్యాఖ్యానించింది జూలియా.

డెయిలీ మెయిల్ ప్రకారం.. ఆగస్టు 13న న్యూ హాంప్‌షైర్‌లోని పోర్ట్స్‌మౌత్‌లోని కోర్టులో వివాహాన్ని రద్దు చేయాలని ఆండ్రూ కాబోట్ డాక్యుమెంట్లు దాఖలు చేశారు. ఆండ్రూతో విడాకుల పేరుతో మునుప‌టి భార్య‌ జూలియా బాగా లాభ‌ప‌డింది. ఈ కేసులో చివరికి ఆమె 1 మిలియన్ డాల‌ర్ డ‌బ్బుతో పాటు, 1.9 మిలియన్ డాల‌ర్ల విలువ చేసే ఇల్లు, జాగ్వార్ ని భ‌ర్త నుంచి పొందింది. ఆండ్రూ -క్రిస్టిన్ కేసులో ఏ పరిష్కారం కుదురుతుందో చూడాలి. ఒక అంచ‌నా ప్ర‌కారం.. ఆండ్రూ కోబోట్ నికర ఆస్తుల విలువ 2025 నాటికి 15.4 బిలియ‌న్ డాల‌ర్లు. ఆండ్రూ - క్రిస్టిన్ 2025 ప్రారంభంలో హాంప్‌షైర్ తీరంలో 2.2 మిలియన్ డాల‌ర్ల‌ ఇంటిని కొనుగోలు చేశారు.