Begin typing your search above and press return to search.

ట్రంప్ కి షాకిచ్చిన పాక్... ఆ విషయంలో హమాస్ వైపే..!

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గాజాలో శాంతిని పరిరక్షించే దళంగా పాకిస్థాన్ కొనసాగుతుంది కానీ.. హమాస్ నిరాయుధీకరణలో మాత్రం తమను భాగస్వాములను చేయొద్దని అన్నారు.

By:  Raja Ch   |   29 Dec 2025 10:00 AM IST
ట్రంప్  కి షాకిచ్చిన పాక్... ఆ విషయంలో హమాస్  వైపే..!
X

గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ (ఐ.ఎస్.ఎఫ్.) కు తమ దళాలను అందించాలని ఇస్లామాబాద్ ను వాషింగ్టన్ ఒత్తిడి చేస్తుందని.. ఈ విషయంపైనే పాకిస్థాన్ లోని అత్యంత శక్తివంతమైన వ్యక్తి, అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారని.. ఈ ఒత్తిడికి అసిమ్ మునీర్ తలొగ్గితే సరే కానీ.. అలా కానిపక్షంలో డొనాల్డ్ ట్రంప్ హర్ట్ అయ్యే అవకాశం ఉందని కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ విషయంలో పాక్ సరికొత్త మెలిక పెట్టింది.

అవును... గాజాలో శాంతిని నెలకొల్పే విషయంలో, హమాస్ ఉగ్రవాదులను నిరాయుధీకరించాలన్న పాయింట్ తో అమెరికా ప్రతిపాదిత 20 అంశాల ప్లాన్ లో పాక్ సహాయం కోరింది అమెరికా. ఇందులో భాగంగా... తమ సైన్యాన్ని గాజాకు పంపాలని పాక్ ను కోరింది. ఈ సమయంలో... 'మునీర్ ని అడకత్తెరలో పోక చెక్క చేస్తోన్న ట్రంప్.. ఇదిగో ప్రూఫ్!' అనే శీర్షికతో వచ్చిన కథనంలో మునీర్ పరిస్థితి గురించి ప్రస్థావించిన విషయం 'తుపాకీ.కామ్' పాఠకులకు విధితమే.

అయితే... ఈ విషయంలో తాము రామని చెప్పకుండా, వస్తామనీ అనకుండా అన్నట్లుగా... వస్తాము కానీ, హమాస్ నిరాయుధీకరణ విషయంలో మాత్రం తమను ఇబ్బంది పెట్టొద్దని.. ఆ పాయింట్ ని తీసేస్తేనే తమ పరిపూర్ణ మద్దతు ఉంటుందంటూ పాక్ నుంచి మెలికతో కూడిన సమాధానం వచ్చింది. ఉగ్రవాదుల వద్ద తుపాకులు ఉండకూడదు.. వారు జన జీవన స్రవంతిలో కలవాలంటే.. అందుకు పాకిస్థాన్ ఎందుకు ఒప్పుకుంటుంది.. ట్రంప్ పిచ్చి కాకపోతే!!

వివరాళ్లోకి వెళ్తే... గాజాలో ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో భాగంగా తమ దళాలను పంపించడానికి సానుకూలంగానే స్పందించినట్లు స్పందించిన పాకిస్థాన్... అమెరికా ప్రతిపాదిత 20 అంశాల ప్రణాళికలో హమాస్ ను నిరాయుధీకరించాలన్న పాయింట్ ను తొలగించాలని.. అప్పుడే ఇందులో తాము భాగమవుతామని తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన ఆ దేశ ఉప ప్రధాని ఇషాక్ దార్... ఐ.ఎస్.ఎఫ్.లో తమ దేశం భాగం కావడం తమకు చాలా సున్నితమైన అంశం అని అన్నారు.

ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... గాజాలో శాంతిని పరిరక్షించే దళంగా పాకిస్థాన్ కొనసాగుతుంది కానీ.. హమాస్ నిరాయుధీకరణలో మాత్రం తమను భాగస్వాములను చేయొద్దని అన్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... హమాస్ అనే ఉగ్రవాదుల వద్ద ఆయుధాలు ఉన్నప్పుడు, గాజాలో శాంతి స్థాపన ఎలా జరుగుతుంది? ఉగ్రవాదుల వద్ద తుపాకులు ఉన్నప్పుడు "శాంతి" అనే మాటకు చోటెక్కడ ఉంటుంది? ఈ విషయం పాక్ కి తెలియంది కాదు కదా?

అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆలోచన మాత్రం కరెక్ట్ గానే ఉందని అంటున్నారు పరిశీలకులు. హమాస్ ను నిరాయుధీకరణ చేయడమే ప్రధాన అంశంగా అమెరికా ప్రతిపాదిత శాంతి ప్రణాళిక ఉంది. హమాస్ ను నిరాయుధీకరణ చేయడమే గాజాలో శాంతిని స్థాపించడంలో ముఖ్యమైన దశగా అగ్రరాజ్యం విశ్వసిస్తోంది! అదే వాస్తవం కూడా..!

కానీ... హమాస్ ను నిరాయుధీకరించకుండా.. శాంతిని నెలకొల్పే పనుల్లో మాత్రం తాము భాగస్వాములం అవుతామంటూ పాక్ తనకు తెలిసిన, ఫాలో అవుతున్న సిద్ధాంతాన్నే వెల్లడించింది! మరి ఈ మెలికపై అగ్రరాజ్యం ఎలా స్పందిస్తుందనేది వేచి చూడాలి!