Begin typing your search above and press return to search.

ఏకంగా 1050 సినిమాలు హ్యాక్.. నిజం తెలిస్తే షాక్!

ఇప్పుడు మనం ఈ కుర్రాడి స్టోరీ వింటే.అవును మీరు వినేది నిజమే.అచ్చం కిక్ మూవీ లో రవితేజ లాగా కిక్కు కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడ్డాడు ఈ యువకుడు.

By:  Madhu Reddy   |   1 Oct 2025 8:00 PM IST
ఏకంగా 1050 సినిమాలు హ్యాక్.. నిజం తెలిస్తే షాక్!
X

రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమాలో కిక్కు కోసం హీరో ఎలాంటి పనులు చేస్తాడో చెప్పనక్కర్లేదు. బహుశా డైరెక్టర్ సమాజంలో ఉన్న కొంతమందిని ఆదర్శంగా తీసుకొనే ఈ సినిమా తీశారు కావచ్చు అనిపిస్తుంది ఇప్పుడు మనం ఈ కుర్రాడి స్టోరీ వింటే.అవును మీరు వినేది నిజమే.అచ్చం కిక్ మూవీ లో రవితేజ లాగా కిక్కు కోసం ఎలాంటి పనైనా చేయడానికి సిద్ధపడ్డాడు ఈ యువకుడు. అలా సమాజం మీద కోపంతో ఏకంగా హ్యాకర్ గా మారాడు.. ఆఖరిగా మారిన ఇతడు ఏకంగా 1050 సినిమాలు హ్యాక్ చేశాడు. మరి ఆయన ఎవరు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటి? హ్యాకర్ గా మారడం వెనుక అసలు కథ ఏంటి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ అబ్బాయి పేరు అశ్వినీ కుమార్. బీహార్ లోని పాట్నాకి చెందిన ఈ కుర్రాడికి 22 ఏళ్లు..22 ఏళ్లలోనే ఎంతో జీవితాన్ని చదివేసినట్టు సమాజం మీద వ్యతిరేకత పెంచుకున్నాడు. దానికి కారణం ఆయనలో ఉన్న లోపమే. ఆయనకి ఒక కన్ను సరిగ్గా కనబడక పోవడంతో చిన్నప్పటి నుండి ఆయన్ని అందరూ చులకన భావంతో చూసేవారు. దాంతో సమాజం మీద కసి పెంచుకొని సమాజంలో ఉండే మనుషుల మీద ఎప్పుడు కోపంతో ఉండేవాడు.

అలా చదివింది ఇంటరే కానీ ఏదో పెద్ద పెద్ద చదువులు చదివి ఎంతో టెక్నాలజీ పెంచుకున్న వాడిలాగా తయారయ్యాడు. ఎందుకంటే ఇంటర్ కే అశ్విని కుమార్ హ్యాక్ చేయడంలో మహా మహులనే మించి పోయాడు. అంత తక్కువ చదువు చదివి ఇంత పెద్ద జ్ఞానం ఎలా వచ్చిందని మీకు డౌట్ రావచ్చు.. దానికి కారణం చిన్నతనంలో ఆయన అనుభవించిన వేదనే. ఈయన కన్ను సరిగ్గా లేకపోవడంతో అందరూ ఒంటికన్ను శివరాజన్ అని హేళన చేసేవారట. దాంతో సమాజంలో ఏదో ఒక గుర్తింపు సంపాదించాలి అని యూట్యూబ్లో సెర్చ్ చేసి హ్యాకర్ గా మారాడు. ఎంతలా అంటే ఉదయం నుండి రాత్రి పడుకునే వరకు మొత్తం ఇంటర్నెట్ తోనే గడిపేవాడు.దాంతో ఆయన తల్లి చాలాసార్లు మందలించి చివరికి కొట్టిందట.కానీ ఎన్నిసార్లు కొట్టినా అశ్వినీ కుమార్ బుద్ధి మార్చుకోలేదు. తల్లి పడుకున్న తర్వాత అర్ధరాత్రి లేచి తెల్లవారుజాము వరకు ఇంటర్నెట్లో సెర్చ్ చేసేవాడు.. ఆ సమయంలో హ్యాకింగ్ పూర్తిస్థాయిలో నేర్చుకొని కొత్త సినిమాలు డౌన్లోడ్ చేయడం స్టార్ట్ చేశాడు.

ఆ తర్వాత కొత్త సినిమాలు డౌన్లోడ్ చేయడం కోసం వారి సర్వర్లను హ్యాక్ చేయడం మొదలు పెట్టాడు. అలా కొత్త సినిమాలను అందరికంటే ముందే చూసేసాను అని హ్యాపీ ఫీలింగ్ తో ఉండేవాడు.ఇక రాను రాను హ్యాకింగ్లో ఆరితేరిపోయి కిక్కు కోసం ఎన్నో పనులు చేశాడు. చివరికి కొన్ని వెబ్సైట్లు డబ్బులు ఆఫర్ చేయడంతో సినిమా అందరికంటే ముందు చూసాను అనే కిక్కు తో పాటు డబ్బులు కూడా వస్తున్నాయని కొన్ని ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ కి ఆ కొత్త సినిమాలను అమ్మేసి లక్షల్లో డబ్బు సంపాదించేవాడు. అశ్విని కుమార్ ఇక్కడితో ఆగలేదు.జార్ఖండ్ తో పాటు బీహార్, కేంద్ర ప్రభుత్వ వెబ్సైట్లను హ్యాక్ చేసి డేటా సంపాదించేవాడు. చివరికి ఎలక్షన్ కమిషన్ మీద కూడా అతని కన్ను పడింది. అలా తనకు వచ్చిన కోడింగ్ ద్వారా ఆ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేశాడు.

ఇక టెక్నాలజీలో ఇంత అనుభవం ఉన్న అశ్వినీ కుమార్ తన సొంత ఇంటి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టుకున్నాడు. కానీ ఎన్ని చేసినా ఏదో ఒక రోజు చేసిన తప్పు బయటపడక మానదు అన్నట్లు ఒక్క దెబ్బతో దొరికిపోయాడు. మొదట తెలంగాణ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడానికి వచ్చిన సమయంలో తన ఫోన్ లో ఉన్న డాటాని సెకండ్లో డిలీట్ చేసినప్పటికీ హార్డ్ డిస్క్ లో ఉన్న డేటా ఆధారంగా ఆయన్ని పట్టుకున్నారు. ఆ తర్వాత స్టేషన్ కి తీసుకువెళ్లి తమదైన స్టైల్ లో ఇన్వెస్టిగేషన్ చేయగా కేవలం కిక్కు కోసమే ఇదంతా చేశాను అని అశ్విని కుమార్ చెప్పిన డైలాగ్ కి , ఆయన సత్తా కి పోలీసులు సైతం షాక్ అయ్యారు. అలా కొత్త సినిమాలు అందరికంటే ముందే చూసాను అనే కిక్కు కోసం ఇంటర్ తోనే టెక్నాలజీలో ఆరితేరి వెబ్సైట్లు హ్యాక్ చేసుకుంటూ ఏకంగా ఇప్పటి వరకు 1050 కొత్త సినిమాలను హ్యాక్ చేశాడట. ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.