సన్నీ లియోన్ ఫోటో షేర్ చేసిన అశ్విన్... నెట్టింట ఆసక్తికర చర్చ!
అవును.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ వేదికగా రెండు ఫోటోలు కలిపి పోస్ట్ చేశారు.
By: Raja Ch | 10 Dec 2025 10:40 AM ISTభారత మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ తన అధికారిక ఎక్స్ హ్యాండిల్ లో బాలీవుడ్ నటి సన్నీ లియోన్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. మీరు చదివింది నిజమే! దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో అభిమానులను అబ్బురపరిచింది. ఈ సందర్భంగా అశ్విన్ కు ఇప్పుడు సన్నీలియోన్ ఎందుకు గుర్తొచ్చిందని ఒకరంటే.. ఆ పోస్టు వెనుక ఉన్న తర్కాన్ని మరికొంతమంది అర్ధం చేసుకుని రియాక్ట్ అవుతున్నారు.
అవును.. టీమిండియా మాజీ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ ఎక్స్ వేదికగా రెండు ఫోటోలు కలిపి పోస్ట్ చేశారు. అందులో ఒక ఫోటో సన్నీ లియోన్ ది కాగా.. మరో ఫోటో చెన్నై వీధి దృశ్యం. దీంతో... అశ్విన్ పోస్టు ఒక్కసారిగా సంచలనంగా మారింది. దీంతో కొంతమంది తలలు పట్టుకోగా.. మరికొంతమంది దాని వెనుక ఉన్న "సన్నీ సంధు" అనే క్రికెటర్ కోసమా అని అర్ధం చేసుకుంటున్నారు.
విషయంలోకి వెళ్తే... సోమవారం అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్ లో సన్నీ సంధు మ్యచ్ విన్నింగ్ లో గెస్ట్ రోల్ పోషించాడు! ఇందులో భాగంగా.. తమిళనాడు తరుపున తన రెండో మ్యాచ్ ఆడుతున్న సంధూ.. సాయి సుదర్శన్ (55 బంతుల్లో 101*)తో కలిసి 37 పరుగుల కీలక భాగస్వామ్యంలో.. కేవలం 9 బంతుల్లో 30 పరుగులు చేశాడు.
జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ విషయాన్నే అభిమానులకు ఎత్తి చూపినట్లుగా అశ్విన్ ఈ 22 ఏళ్ల సన్నీ సంధు కు తనదైన శైలిలో అభినందనలు తెలిపాడు. దీంతో... ఆ రెండు ఫోటోలను కలిపి... "సన్నీ (ఇంగ్లిష్) + సంధు (తమిల్) = సన్నీ సంధు (క్రికెటర్)" అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు!
మరోవైపు.. సన్నీ సంధు ఐపీఎల్ - 2026 మినీ వేలానికి రిజిస్టర్ చేసుకున్నాడు. ప్రస్తుతం అతని బేస్ ప్రైస్ రూ.30 లక్షలు కాగా... అశ్విన్ పోస్ట్ తర్వాత ఈ యంగ్ ఆల్ రౌండర్ కు డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అంటున్నారు.
