Begin typing your search above and press return to search.

టీమ్ మేట్‌తో ఉమెన్ క్రికెటర్ అఫైర్.. క్రికెట్ ఆస్ట్రేలియా పై మాజీ భార్య విమర్శలు

మైదానంలో వికెట్లు తీయడం, సిక్సర్లు బాదడం పాత కథ. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఇప్పుడు ‘రన్ రేట్’ కంటే ‘అఫైర్ రేట్’ పైనే లీడ్‌ స్టోరీలు నడుస్తున్నాయి.

By:  A.N.Kumar   |   9 Aug 2026 4:51 PM IST
టీమ్ మేట్‌తో ఉమెన్ క్రికెటర్ అఫైర్.. క్రికెట్ ఆస్ట్రేలియా పై మాజీ భార్య విమర్శలు
X

మైదానంలో వికెట్లు తీయడం, సిక్సర్లు బాదడం పాత కథ. ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఇప్పుడు ‘రన్ రేట్’ కంటే ‘అఫైర్ రేట్’ పైనే లీడ్‌ స్టోరీలు నడుస్తున్నాయి. టీమ్ మేట్‌తో వైస్ కెప్టెన్ అఫైర్ నడుపుతోందంటూ మాజీ భార్య సోషల్ మీడియా ఎక్కి రచ్చ రంబోలా చేస్తుంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) మాత్రం "ఇదంతా వారి పర్సనల్ మేటర్ సార్.. మాకేం సంబంధం లేదు" అంటూ పాప్‌కార్న్ తింటూ వేడుక చూస్తోంది.

ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్, జాతీయ జట్టు వైస్ కెప్టెన్ ఆష్లే గార్డ్‌నర్, ఆమె సహచర క్రీడాకారిణి జార్జియా వోల్, గార్డ్‌నర్ మాజీ భార్య మోనికా రైట్ చుట్టూ తిరుగుతున్న ఈ ముక్కోణపు కథ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. మైదానంలో ప్రత్యర్థులను తుత్తునియలు చేసే గార్డ్‌నర్.. సొంత కాపురాన్ని మాత్రం చక్కదిద్దుకోలేకపోయారనే వార్త వినడానికి కాస్త ఘాటుగానే ఉన్నా.. ఇది నిజమంటూ మోనికా రైట్ ఇన్స్టాగ్రామ్ వేదికగా చేసిన సంచలన ఆరోపణలు ఆస్ట్రేలియా క్రికెట్ వర్గాల్లో పెద్ద కలకలమే రేపాయి.

తన సంసారం కూలిపోవడానికి గార్డ్‌నర్ , జార్జియా వోల్‌ల మధ్య నడుస్తున్న రహస్య అఫైరే కారణమని మోనికా ఆవేదన వ్యక్తం చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇంతటితో ఆగకుండా జట్టుకు ప్రాతినిధ్యం వహించే ఒక నాయకురాలికి ఉండాల్సిన కనీస నైతిక విలువలు గార్డ్‌నర్‌లో లేవని.. వెంటనే ఆమెను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలగించాలని క్రికెట్ ఆస్ట్రేలియాను గట్టిగానే డిమాండ్ చేశారు. అయితే ఈ మొత్తం రచ్చపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించిన తీరు చూస్తే ఎవరికైనా నవ్వు రాకమానదు. మైదానంలో ప్రతి చిన్న వైఫల్యానికి రివ్యూలు, రూల్ బుక్స్ తిరగేసే ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, ఈ వివాదం విషయంలో మాత్రం సైలెంట్‌గా జేబులో చేతులు పెట్టుకుని వేడుక చూసే ప్రేక్షక పాత్రలోకి మారిపోయింది.

మోనికా పెట్టిన పోస్టులు తీవ్ర దుమారం రేపినప్పటికీ క్రికెట్ ఆస్ట్రేలియా చాలా చాకచక్యంగా తమ వద్ద ‘రెస్పెక్ట్ అట్ వర్క్’ అనే గొప్ప పాలసీ ఉందంటూ ఒక విచిత్రమైన వివరణ ఇచ్చి చేతులు దులుపుకుంది. ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాలు వారి ప్రైవేట్ వ్యవహారాలని.. ప్రొఫెషనల్ లైఫ్‌తో దానికి సంబంధం లేదంటూ బోర్డు ఇచ్చిన డెఫినిషన్ చూసి క్రీడా పండితులు ముక్కున వేలేసుకుంటున్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో సహచర ఆటగాళ్లతో సంబంధాలు ఉంటే అది జట్టు వాతావరణాన్ని ప్రభావితం చేయదా అని కొందరు ప్రశ్నిస్తుంటే బోర్డు మాత్రం "గ్రౌండ్ బయట ఏం చేసుకున్నా మాకేం సంబంధం లేదు.. గ్రౌండ్ లోపల మ్యాచ్‌లు గెలిపిస్తే చాలు" అనే ధోరణిలోనే ఉంది.

ఇక మరోవైపు గార్డ్‌నర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిడ్నీ సిక్సర్స్ ఫ్రాంచైజీ అయితే ఒక అడుగు ముందుకు వేసి.. వివాదాలు ఏమైనా మా కెప్టెన్ మాకే అంటూ ఆమెకు పూర్తి మద్దతు ప్రకటించింది. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆష్లే గార్డ్‌నర్, జార్జియా వోల్ ఇద్దరూ మాత్రం "మౌనం అర్ధ అంగీకారం" అన్నట్లుగా ఇప్పటివరకు నోరు విప్పకపోవడం ఈ డ్రామాను మరింత ఆసక్తికరంగా మార్చింది. ప్రొఫెషనల్ క్రీడల్లో ఒక ఆటగాడి వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కడ మొదలై నాయకత్వ నైతికత ఎక్కడ ముగుస్తుందో అర్థం కాక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

ఏది ఏమైనా ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో మొదలైన ఈ లవ్, బ్రేక్-అప్, పొలిటికల్ డ్రామా ముందు ముందు ఇంకెన్ని సీరియల్ మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.