Begin typing your search above and press return to search.

గిరి ప్రదక్షిణ వేళ కొండ ఎక్కిన నటి.. ఫైన్ వేసిన అటవీశాఖ

నిబంధనల్నిఅతిక్రమించే తీరు సామాన్యుల్లోనే కాదు సెలబ్రిటీల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి తీరునే ప్రదర్శించిన ఒక తమిళ నటి.. నటుడు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు.

By:  Garuda Media   |   30 Jan 2026 9:36 AM IST
గిరి ప్రదక్షిణ వేళ కొండ ఎక్కిన నటి.. ఫైన్ వేసిన అటవీశాఖ
X

నిబంధనల్నిఅతిక్రమించే తీరు సామాన్యుల్లోనే కాదు సెలబ్రిటీల్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి తీరునే ప్రదర్శించిన ఒక తమిళ నటి.. నటుడు ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. తప్పుడు పని చేయటమే కాదు.. దాన్నో ఆసక్తికర అంశంగా ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టు చేసిన వారికి అనూహ్య రీతిలో ఫైన్ షాక్ తగిలింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

తమిళనాడులోని తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వరస్వామి ఆలయం ఎంత ఫేమస్ అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేవాలయానికి వెళ్లిన భక్తుల్లో ఎక్కువ మంది గిరి ప్రదిక్షణ చేస్తారు. ఇక.. పౌర్ణమి వేళ లక్షలాది మంది భక్తులు గిరి ప్రదిక్షణ చేస్తున్నారు. దాదాపు పద్నాలుగు కిలోమీటర్ల గిరి ప్రదిక్షణ చేసి స్వామి వారిని దర్శించుకోవటం తెలిసిందే.

అయితే.. గిరి ప్రదిక్షణ వేళ.. పక్కనే ఉండే కొండను ఎక్కే విషయంపై నిషేధం అమల్లో ఉంది. కొండ ఎక్కకూడదని అటవీ అధికారులు బోర్డులు ఏర్పాటు చేయటం కనిపిస్తుంది. కానీ.. తమిళ బుల్లినటి అర్చనా రవిచంద్రన్.. తన తోటి నటుడు అరుణ్ ప్రసాద్ కలిసి కొండపైకి వెళ్లి వచ్చినట్లుగా గుర్తించారు. ఎలాంటి అనుమతి లేకుండా నిబంధనల్ని ఉల్లంఘిస్తూ కొండ ఎక్కిన వీరు.. దీనికి సంబంధించిన ఫోటోల్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

దీన్ని తీవ్రంగా పరిగణించిన అటవీశాఖ ఈ ఇద్దరు నటీనటులకు ఫైన్ షాకిచ్చింది.సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఫోటోల ఆధారంగా దర్యాప్తు చేసిన అధికారులు..వీరు నిబంధనల్ని ఉల్లంఘించినట్లుగా గుర్తించారు. దీంతో వీరిద్దరికి రూ.5 వేలు చొప్పున జరిమానా విధించారు. అంతేకాదు.. మళ్లీ ఎప్పుడూ ఇలా కొండ ఎక్కొద్దని హెచ్చరిక జారీ చేశారు. ఎంత సెలబ్రిటీలు అయితే మాత్రం ఇలా చేయటం సబబు కాదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.