అర్ణబ్ గోస్వామికి అడ్డంగా దొరికిన సీజేపీ యాక్టివిస్ట్.. చెడుగుడు ఆడేశాడు.. వైరల్ వీడియో
టెలివిజన్ స్క్రీన్ల ముందు కూర్చునే ప్రేక్షకులకు అర్ణబ్ గోస్వామి డెసిబెల్స్ స్థాయిలు కొత్తేమీ కాదు.
By: A.N.Kumar | 22 Aug 2026 10:39 AM ISTటెలివిజన్ స్క్రీన్ల ముందు కూర్చునే ప్రేక్షకులకు అర్ణబ్ గోస్వామి డెసిబెల్స్ స్థాయిలు కొత్తేమీ కాదు. కొండలను పిండి చేసేంత గొంతుకతో "ది నేషన్ వాంట్స్ టు నో" అని ఆయన అరవడం వినడం మనందరికీ బాగా అలవాటైన విద్యే. అయితే ఈసారి ఆయన స్టూడియోలో జరిగిన రచ్చ వేరే లెవెల్.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అర్ణబ్ గోస్వామి, యాక్టివిస్ట్ రిహ్యా యాదవ్ మధ్య జరిగిన ఆ ఇంటర్వ్యూ క్లిప్పులే హల్ చల్ చేస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే.. డిబేట్ పేరుతో పిలిచి ఒక రేంజ్‌లో ‘జనరల్ నాలెడ్జ్’ టెస్ట్ పెట్టేశారు అర్ణబ్..
జర్నలిజమా? స్కూల్ అసెంబ్లీ టెస్టా?
ఇంటర్వ్యూ మొదలవ్వడమే తీవ్రమైన జాతీయ అంశాలు, దేశభక్తి, ఐడెంటిటీపై చర్చతో స్టార్ట్ అయింది. కానీ కథ అక్కడ ఆగలేదు. అప్పటిదాకా బాగానే మాట్లాడిన రిహ్యా యాదవ్‌కి అర్ణబ్ ఊహించని ఒక 'సిలబస్' విసిరారు. "వందేమాతరం రాసింది ఎవరు? జాతీయ గీతానికి, జాతీయ గేయానికి తేడా ఏంటి?" అంటూ వరుసబెట్టి రాపిడ్ ఫైర్ ప్రశ్నల వర్షం కురిపించారు. దాంతో లైవ్ టెలివిజన్ కెమెరాల ముందు.. కోట్లాది మంది చూస్తుండగా రిహ్యా కొద్దిగా తడబడ్డారు. అంతే.. మన అర్ణబ్ ఊరుకుంటారా? టీచర్ క్లాస్‌రూమ్‌లో హోమ్‌వర్క్ చేయని విద్యార్థిని నిలబెట్టి ప్రశ్నించినట్లు.. ఆమెను మరింత ఒత్తిడిలోకి నెట్టేశారు.
రెండు క్యాంప్‌లుగా విడిపోయిన సోషల్ మీడియా పబ్లిక్
ఈ వీడియో క్లిప్ వైరల్ అవ్వడమే ఆలస్యం.. నెటిజన్లు వెంటనే రెండు ముఠాలుగా విడిపోయి సోషల్ మీడియాలో యుద్ధానికి దిగేశారు. అర్ణబ్ ఫ్యాన్స్ వర్గం "యాక్టివిజం పేరుతో టీవీల్లోకి వచ్చి ఉపన్యాసాలు దంచేసే ముందు, దేశానికి సంబంధించిన ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలి కదా.. వందేమాతరం గురించి కూడా స్పష్టత లేకపోతే ఎలా?" అంటూ అర్ణబ్‌కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నారు.
రిహ్యా సపోర్టర్ల వర్గం మాత్రం "అయ్యా.. అది డెసిబెల్స్ ఎక్కువ ఉన్న హై-ప్రెజర్ టీవీ షో.. ఆ క్షణంలో ఎవరైనా టెన్షన్‌లో తడబడతారు. కావాలని ఒక్క చిన్న పాయింట్‌ని పట్టుకుని ఒక వ్యక్తి సామర్థ్యాన్నే ప్రశ్నించడం ఏ రకమైన జర్నలిజం? ఇది ఇంటర్వ్యూలా లేదు.. ఒక టీవీ కాన్ఫ్రంటేషన్‌లా ఉంది" అంటూ కౌంటర్లు ఇస్తున్నారు.
చివరికి మిగిలిందేంటంటే..
10 సెకన్ల వైరల్ వీడియో క్లిప్పులను చూసి ఒకరి మేధస్సును, సామర్థ్యాన్ని పూర్తిగా అంచనా వేయడం ఎంతవరకు కరెక్ట్ అన్నది పక్కన పెడితే.. ఈ రచ్చ వల్ల ప్రైమ్‌టైమ్ టీవీ ఛానెళ్లకు కావాల్సినంత టీఆర్పీ.. సోషల్ మీడియాకి కావాల్సినంత మీమ్ మెటీరియల్ మాత్రం పుష్కలంగా దొరికేశాయి. కాబట్టి పూర్తి వీడియోను చూసి.. ఎవరు చెప్పింది కరెక్టో ఎవరికి వారు నిర్ణయించుకోవడమే ఉత్తమం..
