Begin typing your search above and press return to search.

ప్రేయసికి ప్రపోజ్ చేసిన సైనికుడు.. అధికారుల రియాక్షన్?

ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్ ముగిసిన వెంటనే ఒక సైనికుడు తన ప్రేయసికి మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేసిన క్యూట్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

By:  Madhu Reddy   |   4 Jun 2026 11:37 PM IST
ప్రేయసికి ప్రపోజ్ చేసిన సైనికుడు.. అధికారుల రియాక్షన్?
X

ఆర్మీ పాసింగ్ ఔట్ పరేడ్ ముగిసిన వెంటనే ఒక సైనికుడు తన ప్రేయసికి మోకాళ్లపై నిలబడి ప్రపోజ్ చేసిన క్యూట్ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. లవ్ స్టోరీ సినిమా రేంజ్‌లో ఉన్న ఈ సీన్ చూసి నెటిజన్లు ఫిదా అయిపోయారు. కానీ, సామాన్యుల మనసులు గెలుచుకున్న ఈ లవ్ ప్రపోజల్.. ఇండియన్ ఆర్మీకి మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. రూల్స్ బ్రేక్ చేశాడంటూ ఆ సైనికుడిపై ఇప్పుడు క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో చూద్దాం.

పరేడ్ గ్రౌండ్‌లో లవ్ ప్రపోజల్:

మహారాష్ట్రలోని నాసిక్‌లో గల 'కాంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్' లో తాజాగా పాసింగ్ ఔట్ పరేడ్ ఘనంగా జరిగింది. ఇక ఈ వేడుక ముగిసిన వెంటనే అక్కడ ఒక ఊహించని సంఘటన జరిగింది. శిక్షణ పూర్తి చేసుకున్న కెప్టెన్ భరత్ భరద్వాజ్ పరేడ్ గ్రౌండ్‌లోనే అందరి ముందే తన ప్రియురాలు ఆరుషీకి లవ్ ప్రపోజల్ చేశాడు. ఆమె కూడా వెంటనే ఓకే చెప్పేయడంతో, ఆమె వేలికి రింగ్ తొడిగి గట్టిగా హగ్ చేసుకున్నారు.

నెటిజన్లు ఖుష్.. ఆర్మీ ఫైర్:

ఈ లవ్లీ మూమెంట్‌కు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్‌లో రాగానే నెటిజన్లు లైకులు, కామెంట్ల వర్షం కురిపించారు. "నిజమైన హీరో అంటే ఇతడే" అంటూ చాలా మంది పొగిడారు. కానీ, ఈ ఫోటోలు కాస్తా పైఅధికారుల వరకు వెళ్లడంతో కథ అడ్డం తిరిగింది. ఇలాంటి క్రమశిక్షణతో కూడిన ఆర్మీ పరేడ్ గ్రౌండ్‌లో ఇలా చేయడం సరైనది కాదని ఇండియన్ ఆర్మీ సీరియస్‌గా స్పందించింది.

ప్రొటోకాల్ ఉల్లంఘన కింద యాక్షన్?:

ఆర్మీ రూల్స్ ప్రకారం.. పరేడ్ గ్రౌండ్‌లో ప్రతి ఒక్కరూ కఠినమైన ప్రొటోకాల్ పాటించాల్సి ఉంటుంది. అధికారిక వేడుక ముగిసిన వెంటనే ఇలా పర్సనల్ విషయాల కోసం గ్రౌండ్‌ను వాడుకోవడం ఆర్మీ డిసిప్లిన్‌కు విరుద్ధం. కెప్టెన్ భరత్ భరద్వాజ్ ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారని ఆర్మీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనివల్ల ఆయనపై డిపార్ట్‌మెంటల్ పరంగా క్రమశిక్షణా చర్యలు తీసుకునే ఛాన్స్ గట్టిగా కనిపిస్తోంది.

ప్రేమించిన అమ్మాయిని అందరి ముందు అంగీకరించాలనే ఆ సైనికుడి తాపత్రయం నెటిజన్లకు నచ్చినా, దేశ రక్షణ దళాల రూల్స్ ముందు ఏదీ ఎక్కువ కాదు. ఇక ఆర్మీలో డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం కాబట్టి ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ లవ్ ప్రపోజల్ వివాదంపై ఆర్మీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆ కెప్టెన్‌కు ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి.