Begin typing your search above and press return to search.

షాకింగ్... ఇన్ స్టాగ్రామ్ లైవ్ లో ముగ్గురు యువతుల హత్య!

మరోవైపు ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అని ఆరోపించబడిన 20 ఏళ్ల పెరువియన్ యువకుడి ఫోటోను అధికారులు విడుదల చేశారు, అతను ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.

By:  Raja Ch   |   28 Sept 2025 9:00 PM IST
షాకింగ్... ఇన్  స్టాగ్రామ్  లైవ్  లో  ముగ్గురు యువతుల హత్య!
X

ఇన్ స్టాగ్రామ్ లైవ్‌ లో ముగ్గురు యువతులను దారుణంగా హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన అర్జెంటీనాలో చోటుచేసుకుంది. దీంతో.. బాధితులకు న్యాయం చేయాలని, ఈ ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ భారీ సంఖ్యలో ప్రజలు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.

అవును... అర్జెంటీనాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన సోషల్ మీడియా లైవ్ లో ముగ్గురు యువతుల దారుణ హత్య ఘటనకు సంబంధించిన కేసులో.. ముగ్గురు యువతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం బ్యూనస్ ఎయిర్స్ వీధుల్లోకి వేలాది మంది నిరసనలకు చేపట్టారు. పార్లమెంటు వరకూ కవాతు చేపట్టారు.

ఈ సందర్భంగా... లారా, బ్రెండా, మోరెనా అనే పేర్లతో కూడిన బ్యానర్‌ ను, వారి చిత్రాలతో కూడిన ప్లకార్డులను పట్టుకుని పెద్ద ఎత్తున ప్రదర్శన ఇచ్చారు. ఇప్పటికే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో... బొలీవియన్ సరిహద్దు నగరం విల్లాజోన్‌ లో ఒకరిని అరెస్టు చేశారు.

మరోవైపు ఈ కుట్రకు ప్రధాన సూత్రధారి అని ఆరోపించబడిన 20 ఏళ్ల పెరువియన్ యువకుడి ఫోటోను అధికారులు విడుదల చేశారు, అతను ఇప్పటికీ పరారీలో ఉన్నాడు.

సెప్టెంబర్‌ 19వ తేదీన లారా, బ్రెండా, మెరానా అనే ముగ్గురు యువతులు ఒక పార్టీకి వెళ్తున్న క్రమంలో ఐదుగురు సభ్యుల డ్రగ్స్‌ ముఠా వారిని కిడ్నాప్‌ చేసింది. వారిని వేధింపులకు గురిచేస్తూ ఇన్ స్టాగ్రామ్‌ లైవ్‌ లో హత్య చేసింది. ఈ సందర్భంగా.. తమ వద్ద నుంచి డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నా, దొంగలించినా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి అని వ్యాఖ్యానించింది!