Begin typing your search above and press return to search.

స్మార్ట్ వాచ్ ప్రియులకు ఆపిల్ శుభవార్త.. తక్కువ ధరలో.. సరికొత్త ఫీచర్లతో!

ప్రముఖ టెక్ బ్రాండెడ్ కంపెనీలలో ఆపిల్ బ్రాండ్ కూడా ఒకటి. చాలామంది ఎక్కువగా ఆపిల్ ఐఫోన్ లను ఉపయోగించాలని చూస్తూ ఉంటారు.

By:  Madhu Reddy   |   10 Sept 2025 4:13 PM IST
స్మార్ట్ వాచ్ ప్రియులకు ఆపిల్ శుభవార్త.. తక్కువ ధరలో.. సరికొత్త ఫీచర్లతో!
X

ప్రముఖ టెక్ బ్రాండెడ్ కంపెనీలలో ఆపిల్ బ్రాండ్ కూడా ఒకటి. చాలామంది ఎక్కువగా ఆపిల్ ఐఫోన్ లను ఉపయోగించాలని చూస్తూ ఉంటారు..అయితే వీటిని ధరలు భారీ స్థాయిలో ఉండడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి ఏర్పడింది. ఈ బ్రాండ్ నుంచి ఇప్పటికే ఎన్నో రకాల వాచెస్, మొబైల్స్, ఎయిర్ బర్డ్స్ ఇతరత్రా వస్తువులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ఆపిల్.. కొత్త స్మార్ట్ వాచ్ లను విడుదల చేసింది. ఆపిల్ awe dropping ఈవెంట్లో.. ఆపిల్ వాచ్ సిరీస్-11, వాచ్ SE -3, వాచ్ అల్ట్రా - 3 మోడల్ మొబైల్స్ ని లాంచ్ చేశారు. అలాగే వీటితోపాటుగా ఐఫోన్ 17 సిరీస్, ఎయిర్ పాడ్స్ ప్రో -3 అందుబాటులోకి తీసుకువచ్చింది. మరి ఈ కొత్త వాచ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, ధర గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి చూద్దాం.

ఆపిల్ వాచ్ సిరీస్-11:

ఈ స్మార్ట్ వాచ్ 100% రీ సైకిల్ చేసిన టైటానియం అల్యూమినియంతో తయారు చేసినట్టు ఆపిల్ స్పష్టం చేసింది. అల్యూమినియం ఫ్రేమ్ తో lon X గ్లాస్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ వాచ్ కి టైటానియం వేరియంట్ సప్లయర్ గ్లాస్ కూడా ప్రొటెక్షన్ గా ఉంటుంది. ఈ స్మా ర్ట్ వాచ్ లైవ్ ట్రాన్స్లేషన్ ను సపోర్ట్ చేస్తుంది. ECG తో పాటుగా ఇతర హెల్త్ ట్రాకర్లను కూడా కలిగి ఉంది. అలాగే నిద్ర నాణ్యతను కూడా తెలిపే ఫీచర్ ఇందులో కలదు. ఈ ఆపిల్ వాచ్ 5G నెట్వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. OS 26 పైన పని చేస్తుంది. హైపర్ టెన్షన్ నోటిఫికేషన్ ను కూడా తెలియజేస్తుంది. ఆప్టికల్ హార్ట్ సెన్సార్ ద్వారా వివరాలను సేకరించి.. 30 రోజుల డేటాను రిపోర్ట్ రూపంలో అందిస్తుంది. అంతేకాదు శరీరంలో మార్పులు జరిగిన వెంటనే నోటిఫికేషన్ రూపంలో అప్రమత్తమయ్యేలా చేస్తుంది. ఈ ఆపిల్ స్మార్ట్ వాచ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో కూడా వస్తుంది.. సింగిల్ ఛార్జ్ తో 24 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. కేవలం 15 నిమిషాల ఫాస్ట్ ఛార్జ్ తో 8 గంటల వరకు ఈ స్మార్ట్ వాచ్ ను ఉపయోగించవచ్చు. ధర విషయానికి వస్తే రూ.46,900 రూపాయల నుంచి మొదలు అవుతుంది.

ఆపిల్ వాచ్ అల్ట్రా -3 : ఫీచర్స్

భారీ LTPO3 OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఆల్ ఫేస్ అండ్ డిస్ప్లే ఫీచర్ కలదు.. అలాగే ఇందులో నిద్ర నాణ్యతను కూడా చూపిస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 42 గంటల పాటు పనిచేస్తుంది. ఇందులో జీపీఎస్, హార్ట్ రేటింగ్ రీడింగ్ ఉపయోగించుకోవచ్చు. కేవలం 15 నిమిషాలలో చార్జింగ్ చేస్తే 12 గంటల పాటు ఉపయోగించుకోవచ్చు. హైపర్ టెన్షన్ నోటిఫికేషన్ కూడా ఇస్తుంది. 5G సపోర్ట్ కలదు. దీని ధర రూ.89,000 రూపాయలు.. వేరియేషన్,కలర్స్ బట్టి ధరలలో మార్పు ఉంటుంది.

ఆపిల్ వాచ్ SE -3:

ఈ వాచ్ S -10 చిప్ పైన పనిచేస్తుంది. అలాగే Hey SIRI ను కూడా సపోర్ట్ చేస్తుంది. కాల్ క్వాలిటీ కోసం వాయిస్ ఐసోలేషన్ ఫీచర్ కూడా కలదు. లైవ్ ట్రాన్స్ లేషన్ సపోర్టు కూడా కలదు. ఫాస్ట్ ఛార్జింగ్, టెంపరేచర్ సెన్సింగ్ తో సహా మరికొన్ని ఫీచర్స్ కలవు. ధర రూ.25,900. ఇందులో వేరియేషన్ , మోడల్ ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి.