Begin typing your search above and press return to search.

ఐఫోన్ 17 సేల్స్ ప్రారంభం.. ఈ క్రేజ్ ఏంటి సామీ!

ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. మానవులు ఆహారం లేకుండా ఒక్క రోజు అయినా ఉంటారు కానీ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నారు

By:  Madhu Reddy   |   19 Sept 2025 1:24 PM IST
ఐఫోన్ 17 సేల్స్ ప్రారంభం.. ఈ క్రేజ్ ఏంటి సామీ!
X

ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో పెరిగింది.. మానవులు ఆహారం లేకుండా ఒక్క రోజు అయినా ఉంటారు కానీ ఫోన్ లేకుండా నిమిషం కూడా ఉండలేకపోతున్నారు. అంతలా సెల్ ఫోన్ ప్రపంచం అయిపోయింది. దీంతో ప్రపంచ మార్కెట్లో ఫోన్ల బిజినెస్ అత్యధికంగా పెరిగిపోయింది.. మనిషి పది రూపాయలు జేబులో లేకపోయినా 10,000 ఫోన్ మాత్రం జేబులో పెట్టుకొని తిరిగే పరిస్థితులు ఉన్నాయి. అలా మొబైల్ ఫోన్లలో అనేక కంపెనీలు వచ్చాయి. మరి వీటన్నింటిలోకెల్లా ప్రపంచంలో అందరూ మెచ్చే మొబైల్ కంపెనీ అంటే ఆపిల్.. ఈ కంపెనీ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ వచ్చినా భారీ రేటు తో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉంటాయి..

ఇప్పటికే ఐఫోన్ నుంచి ఎన్నో మోడల్స్ వచ్చి కస్టమర్లను ఆకట్టుకున్నాయి. ఇదే తరుణంలో రోజుకో కొత్త మోడల్ మార్కెట్ లోకి వస్తోంది. ఇక ఐఫోన్ ని మించిన మోడల్స్ మాత్రం మార్కెట్లోకి ఇంకా రాలేదని చెప్పవచ్చు. అలాంటి ఐఫోన్ ని సాధారణ వ్యక్తులు కొనాలంటే చాలా కష్టం. మినిమం లక్షల్లో సంపాదించే వారికి మాత్రమే ఐఫోన్ కొనే సామర్థ్యం ఉంటుంది. మరి ఈ ఫోన్ కి అంత రేటు ఎందుకంటే ఇందులో సెక్యూరిటీ ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి. కాబట్టి ఫోన్ కొనడానికి చాలామంది ఆసక్తి చూపుతారు. అలాంటి ఐఫోన్ లో సరికొత్త మోడల్ మార్కెట్ లో రిలీజ్ అయింది. అదేంటి అనే వివరాలు చూద్దాం..

టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త ఐఫోన్ 17 సిరీస్ ని విడుదల చేసింది. సెప్టెంబర్ 19న భారీగా ఈ సిరీస్ మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఈ ఐఫోన్ ఎయిర్ పేరిట కేవలం 5.6 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంటుంది. అలాగే ఈ - సిమ్ లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఈ మోడల్స్ లో 128 జీబీ స్టోరేజ్ ను కంపెనీ ఆపివేసింది. దీనికి ముందు వచ్చినటువంటి ఐఫోన్ 16 సిరీస్ తో పోలిస్తే దీని బేస్ మోడల్ ధర పెరిగిపోయింది. అయితే ఈరోజు ఇండియాతో సహా 63 దేశాల్లో సెప్టెంబర్ 19 నుంచి అనగా ఈ రోజు నుండి ఈ ఫోన్ కొనుక్కోవచ్చని యాపిల్ సంస్థ తెలియజేసింది.

ఈ ఫోన్ స్టోరేజ్ విషయానికి వస్తే.. 256 జీబీ,512 జిబి స్టోరేజ్ తో మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ ఈరోజు అందుబాటులోకి రావడంతో ఇండియాలోని నాలుగు అధికారిక యాపిల్ స్టోర్ ల వద్ద విపరీతమైనటువంటి కస్టమర్ల తాకిడి ఉంది. ఐఫోన్ అంటే ఇష్టపడే కస్టమర్లు ఇప్పటికే స్టోర్ ల ముందు క్యూలో నిల్చొని ఉన్నారు.. అయితే ముంబైలోని బికేసి స్టోర్లో విపరీతమైన లైన్ ఉండటంతో అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భారతదేశంలో ముంబై, ఢిల్లీ,బెంగళూరు,పూణే వంటి రాష్ట్రాల్లో మాత్రమే అతిపెద్ద ఆపిల్ స్టోర్లు ఉన్నాయి.. ప్రస్తుతం దీని ధర 89,900 నుంచి ప్రారంభమైనట్టు తెలుస్తోంది.