క్యాన్సర్ చికిత్స కోసం ప్రోటాన్ థెరపీ.. అపోలో కొత్త మైలురాయి!
తెలంగాణను భవిష్యత్ వైద్యం కోసం ప్రపంచ కేంద్రంగా మార్చాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికను అపోలో రూపొందించింది. ఇప్పుడు ఈ సంస్థ ఒక కొత్త మైలురాయిని అందుకోబోతోంది.
By: Sivaji Kontham | 9 Dec 2025 7:57 PM ISTఅధునాతన వైద్యం సాంకేతిక విషయాలతో ముడిపడినది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అందిపుచ్చుకుని, మారుతున్న వాతావరణం, సవాళ్లకు అనుగుణంగా ప్రజారోగ్య సంరక్షణ కోసం ప్రయోగాలు చేయడం చాలా అవసరం. అలాంటి ప్రయోగాత్మకతతో ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని భారతదేశ ఆరోగ్య సంరక్షణ ఆవిష్కరణలలో ముందంజలో ఉన్న అపోలో హాస్పిటల్స్ ఖ్యాతి విశ్వవిఖ్యాతమైనది. డాక్టర్ శోభన కామినేని, డాక్టర్ సంగీత రెడ్డి, ఉపాసన కొణిదెల, విశ్వజిత్ రెడ్డి వంటి నిష్ణాతుల సారథ్యంలో అపోలో సంస్థానం ఇంత పెద్ద స్థాయికి విస్తరించిందనడంలో సందేహం లేదు.
తెలంగాణను భవిష్యత్ వైద్యం కోసం ప్రపంచ కేంద్రంగా మార్చాలనే ప్రతిష్టాత్మక ప్రణాళికను అపోలో రూపొందించింది. ఇప్పుడు ఈ సంస్థ ఒక కొత్త మైలురాయిని అందుకోబోతోంది. ఇకపై క్యాన్సర్ చికిత్స కోసం ప్రోటాన్ థెరపీని ప్రవేశపెట్టడం అపోలోకు ఒక మైలురాయిగా నిలుస్తుంది. దీనికి అనుబంధంగా ఆటోమేటెడ్ డయాగ్నస్టిక్స్, ప్రెసిషన్ మెడిసిన్ .. AI- ఆధారిత బయోమార్కర్ ఆవిష్కరణలను కలిగి ఉన్న హైటెక్ గ్లోబల్ రిఫరెన్స్ ల్యాబ్ విస్తరణ దశలో ఉందని అపోలో వర్గాలు పేర్కొన్నాయి.
భారతదేశంలోని అతిపెద్ద బయోబ్యాంక్‌లలో ఒకదానికి నిలయమైన అపోలో హెల్త్ సిటీ దీర్ఘాయువు - మానవ పనితీరులో పురోగతులను వేగవంతం చేస్తోంది. అదే సమయంలో, అపోలో మెడికల్ కాలేజ్ అంతర్జాతీయంగా పోటీతత్వ వైద్య ప్రతిభను ఉత్పత్తి చేస్తూనే ఉంది.
డిజిటల్ హెల్త్ యాక్సెస్, టెలిమెడిసిన్, మొబైల్ మెడికల్ యూనిట్లు సహా 1000 పైగా ఫార్మసీల ఉనికితో అపోలో టెక్నాలజీ అధునాతన వైద్యంతో ప్రజల మధ్య అంతరాలను తగ్గిస్తోంది. ప్రపంచంలోని అత్యంత అధునాతన మెడిసిన్ - వైద్యానికి ఏకైక కేంద్రంగా హైదరాబాద్ సహా తెలంగాణను నిలిపేందుకు అపోలో ప్రయత్నిస్తోంది. భవిష్యత్ ఆరోగ్య సంరక్షణ పర్యావరణ వ్యవస్థను నిర్మించాలనే నిబద్ధతతో అపోలో గ్రూప్ దాదాపు రూ.1,700 కోట్ల పెట్టుబడితో దూసుకెళుతోంది.
