ఎవరి ఓట్లకు ఎసరు... ఏపీలో సర్... !
అంతేకా దు.. సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టకపోతే.. న్యాయపోరాటం తప్పదని.. టీవీ చర్చల్లో పలువురు నాయకులు వ్యాఖ్యానించారు.
By: Garuda Media | 16 Jan 2026 2:00 PM ISTఏపీలో ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్య ఓటర్ల సమగ్ర సర్వే జరగనుంది. తద్వారా 2004 నుంచి ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల జాబితాలను సవరించనున్నారు. చనిపోయినా.. వలస వెళ్లిన.. అడ్రస్ మారిన వారి ఓట్లను జాబితాల నుంచి తొలగించనున్నారు. అయితే..ఈ ప్రక్రియపై దేశవ్యాప్తంగా పెద్ద రచ్చ సాగుతున్న విషయం తెలిసిందే. బీజేపీ అనుకూల పార్టీలకు చెందిన వారి ఓట్లు ఉంచుతున్నారని.. వ్యతిరేకుల ఓట్లు తొలగిస్తున్నారన్నది ఈ వ్యవహారంపై జరుగుతున్న కీలక చర్చ.
అయినా.. కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు తీసు కువెళ్తోంది. ఈ క్రమంలో ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సర్వే చేపట్టి.. కేవలం 60 రోజులలోపే ముగించ నుంది. అయితే.. ఈ వ్యవహారాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు స్వాగతిస్తున్నారు. కానీ, గత ఎన్ని కల అనంతరం.. ఈవీఎంలోపై సందేహాలు వ్యక్తం చేస్తున్న వైసీపీ.. ఎన్నికల సంఘం వ్యవహారంపై అను మానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడుసర్ ప్రక్రియపైనా వైసీపీ అంతర్మథనం చెందుతోంది.
ఇది తమకు ఎసరు పెట్టే అవకాశం ఉందని పలువురు నాయకులు వ్యాఖ్యానించడం గమనార్హం. అంతేకా దు.. సర్ ప్రక్రియను పారదర్శకంగా చేపట్టకపోతే.. న్యాయపోరాటం తప్పదని.. టీవీ చర్చల్లో పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. అయితే.. ఇప్పటికే పలు రాష్ట్రాల నుంచికేసులు సుప్రీంకోర్టులో పెండింగు లో ఉన్నాయి. అయినా.. కేంద్ర ఎన్నికల సంఘం తన పనితాను చేసుకుని పోతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ న్యాయపోరాటం కేవలం కోర్టుకే పరిమితం అయ్యే అవకాశం ఉంది.
ఇక, రాజకీయంగా చూస్తే.. సర్ ప్రక్రియ ద్వారా ఎస్సీ, ఎస్టీల ఓటు బ్యాంకు గణనీయంగా తగ్గుతున్న వ్యవ హారం తెరమీదికి వచ్చింది. తమిళనాడులో కొనసాగుతున్న సర్వేలో కోటి మందిని తప్పించారు. బీహార్‌లో గతంలోనే 64 లక్షల మందిని తప్పించారు. ఈ పరంగా చూసుకుంటే.. ఏపీలో ఎంత మందిని తప్పిస్తార న్నది చూడాలి. ఇదే కనుక జరిగితే.. అది వైసీపీకి భారీ నష్టాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. బలమైన ఓటు బ్యాంకుపై పెద్ద ప్రభావం చూపించనుందని వైసీపీనాయకులు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
