Begin typing your search above and press return to search.

ఏపీలో కొత్త ప్రాంతీయ పార్టీ ?

రాజకీయ పార్టీలు పెట్టడం వరకూ ఒకే. ఎవరైనా పెట్టవచ్చు. కానీ స్పేస్ ఎంత మేరకు ఉంది అన్నది చూసుకోవాల్సి ఉంది అని అంటున్నారు.

By:  Satya P   |   28 Dec 2025 5:00 AM IST
ఏపీలో కొత్త ప్రాంతీయ పార్టీ ?
X

ఏపీలో రాజకీయం గురించి అందరికీ తెలుసు. మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అందులో సీనియర్ మోస్ట్ పార్టీగా టీడీపీ ఉంది. అలాగే రెండవ ప్లేస్ లో వైసీపీ ఉంది. ఇక జనసేన కూడా మూడవ ప్రాంతీయ పార్టీగా 2024 నుంచి అధికారంలో ఉంటూ వస్తోంది. జాతీయ పార్టీలుగా కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి. కమ్యూనిస్టులు కూడా ఉన్నారు. అయితే ఇందులో బీజేపీ పొత్తులతో కూటమిలో కొనసాగుతోంది. మిగిలిన పార్టీలు రెండూ పెద్దగా ప్రభావం చూపించలేకపోతున్నాయి. ఇలా ఏపీ రాజకీయం ఉన్న సమయంలో మరో ప్రాంతీయ పార్టీ అవసరం ఉందా అన్న చర్చ అయితే ఉంది. కొత్తగా ప్రాంతీయ పార్టీలు పెట్టినా అది భర్తీ చేసేలా పొలిటికల్ వాక్యూం ఉందా అన్నది కూడా మరో చర్చగా ఉంది.

ఇదీ పొలిటికల్ సినారియో :

ఏపీలో ప్రాంతీయ పార్టీలు అయినా జాతీయ పార్టీలు అయినా గత నాలుగున్నర దశాబ్దాల కాలంలో చూస్తే కనుక రెండే పార్టీల మధ్య ఎపుడూ పోరు సాగుతూ వస్తోంది. ప్రజలు కూడా ఎక్కడా హంగ్ అన్నది లేకుండా క్లియర్ కట్ గా తమ తీర్పుని ఇస్తూ వస్తున్నారు అలా టీడీపీ వచ్చాక కాంగ్రెస్ టీడీపీల మధ్య పోరు చాలా ఏళ్ళు నడచింది. విభజన ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీగా ఆ పోరు మారింది. జనసేన కూడా మూడవ పార్టీగా వచ్చినా కావాల్సినంత పొలిటికల్ వ్యాక్యూం లేదని భావించే కూటమిలో చేరి అధికారంలో సర్దుకుంటోంది అన్నది తెలిసిందే. మరి ఏపీలో రాజకీయం ఇలా ఉంటే కొత్త ప్రయోగాలు చేస్తే ఏ మేరకు వర్కౌట్ అవుతుంది అన్నది కూడా చర్చగా ఉంది.

పెట్టేది ఎవరు :

రాజకీయ పార్టీలు పెట్టడం వరకూ ఒకే. ఎవరైనా పెట్టవచ్చు. కానీ స్పేస్ ఎంత మేరకు ఉంది అన్నది చూసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మధ్యనే ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ అయితే ఒక ప్రకటన చేశారు. బీసీలు మైనారిటీలు ఎస్సీ ఎస్టీ కాపులు అంతా కలిసి ఒక రాజకీయ వేదిక బలంగా ఏర్పాటు అవుతుందని. అయితే ఆయన మాటల సంగతి ఏలా ఉన్నా రంగానాడు పేరుతో విశాఖలో వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా భారీ సభ జరిగింది. దానికి రంగా కుమార్తె ఆశాకిరణ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆమె రాజకీయ పార్టీ అని అనలేదు కానీ రాష్ట్రవ్యాప్తంగా తాను త్వరలో పర్యటిస్తాను రంగా ఆశయాల సాధన కోసం పోరాడుతాను అని చెప్పారు. ఆమె టీడీపీ జనసేన వైసీపీలను కూడా తన ప్రసంగంలో కొంత వరకూ విమర్శించారు. దాంతో ఆమె వైసీపీలో చేరుతారు అని వస్తున్న వార్తల మీద కూడా జరిగిన చర్చకు ఒక జవాబు అయితే వచ్చింది.

రాజకీయ శక్తిగా :

అయితే ఈ సభకు నిర్వహణ సారధ్యం వహించిన రాధా రంగా మిత్రమండలి నాయకులు అయితే ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా తాము అవతరిస్తామని చెప్పుకొచ్చారు. దాంతోనే ఊహాగానాలు ఇపుడు చెలరేగుతున్నాయి. కొత్తగా రాజకీయ శక్తి అంటే రాజకీయ పార్టీనా అన్నది కూడా అంతా చర్చించుకుంటున్నారు. నిజంగా రంగానాడు అన్నది రాజకీయ శక్తిగా మారుతుందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు. కొత్తగా పార్టీ పెడితే దానికి రంగానాడు అన్న పేరు పెడతారా అన్నది కూడా మరో చర్చగా ఉంది. ఇక ఈ సభకు హాజరైన తెలంగాణాకు చెందిన నాయకుడు, బీసీ నేత ఎంపీ అయిన ఆర్ క్రిష్ణయ్య సైతం మాట్లాడుతూ బీసీలు బడుగులు కాపులు అంతా కలసి ముందుకు సాగాలని కోరారు. అంటే బహుజనుల కోసం తొందరలో ఒక రాజకీయ పార్టీ ఏపీలో ఏర్పాటు అవుతుందా అన్నదే చర్చగా ఉంది. ఆశాకిరణ్ ఏపీలో పర్యటన చేపట్టిన తరువాత ఆమె ప్రసంగాలు ఆమె ఆలోచనలు అన్నీ చూసిన తరువాత దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు.