పాలిటిక్స్‌కు సినిమాలు కలిసి రాలేదా.. ?
ఏపీ రాజకీయాలకు-సినిమాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల తరఫున సినిమాలు రావడం తెలిసిందే.
By: Garuda Media | 28 Jan 2026 4:00 AM ISTఏపీ రాజకీయాలకు-సినిమాలకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల తరఫున సినిమాలు రావడం తెలిసిందే. గత 2019, 2024 ఎన్నికలకు ముందు ఇలానే సినిమాలు వచ్చాయి. 2019కి ముందు ఎన్టీఆర్ పేరుతో బాలకృష్ణ సినిమాలు తీసి.. ఎన్నికలసమయంలో ప్రభావం చూపించే ప్రయత్నం చేశారు. ఇక, వైసీపీ తరఫున కూడా.. పాదయాత్రపై.. యాత్ర పేరుతో సినిమాలు వచ్చాయి. 2024కు ముందు కూడా.. ఇలానే సినిమాలు వచ్చాయి.
కానీ, ఎంత ప్రభావం చూపాయన్నది ప్రశ్నగా మారింది. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ.. వైసీపీకి అనుకూలం గా తీసిన సినిమాలు కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపలేదు. మరోవైపు.. సినీరంగంలోనూ గతంలో ఉన్న రాజకీయ ప్రభావం రాను రాను తగ్గిపోయింది. వైసీపీ హయాంలో ఆపార్టీని సపోర్టు చేసిన.. ఎగ్రసివ్‌గా కామెంట్లు చేసిన వారు.. చాలా మంది పార్టీకి దూరమయ్యాయి. ఇక, మౌనంగా ఉన్న హీరోలు, కమెడియన్లు కూడా.. ఈ రాజకీయాలు తాము చేయలేమంటూ వైదొలిగారు.
మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఏ పార్టీకి సినీ రంగం అనుకూలంగా ఉంది? అంటే.. ప్రస్తుతం ఉన్న పరిస్థి తిలో ఏ పార్టీకి కూడా సినీ రంగం ప్లస్గా మారడం లేదు. ఎవరికి వారు తటస్థంగానే ఉంటున్నారు. తమ వ్యాపారాలు.. వ్యవహారాలుదెబ్బతినకుండా చూసుకునే విషయంలోనే వారు శ్రద్ధ చూపిస్తున్నారు. గత ఏడాది అనుభవం తర్వాత.. వచ్చే ఎన్నికల నాటికి పెద్దగా సినిమాలు తీసేందుకు కూడా ఎవరు ముందుకు వచ్చేందుకు సిద్ధం గా లేరని తెలుస్తోంది.
ఎందుకంటే.. ఏ ప్రభుత్వం వస్తే.. తమకు ఎలాంటి చిక్కులు వస్తాయోనని సినీ రంగం తీవ్ర ఆవేదన వ్య క్తం చేస్తోంది. ఇదేసమయంలో టికెట్ల ధరలు, వ్యాపారాలు వంటివి కూడా వారికి ముఖ్యం. దీంతో పాలిటి క్స్‌కు ఇప్పుడు సినిమా రంగం దూరంగానే ఉందని చెప్పాలి. అంతేకాదు.. తెలంగాణలో ఒక విధంగా.. ఏపీలో మరో విధంగా వ్యవహరించినా.. అది తమకు ఇబ్బందేనన్నది ఇప్పటి వరకు జరిగిన పరిణామా లను గమనిస్తే.. అర్థం అవుతుంది. ఫలితంగా గత మూడునాలుగేళ్ల కిందట ఉన్న సంబంధాలు.. ఇప్పుడు సినీ-రాజకీయ రంగాల మధ్య కనిపించడం లేదు.
