Begin typing your search above and press return to search.

ఏపీ పాలిటిక్స్‌: సీమ-ఉత్త‌రాంధ్ర‌లో దూకుడు.. కోస్తాలో సైలెంట్‌..!

ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ చ‌ర్య‌కు వ‌చ్చే జిల్లాలు కోస్తాంధ్ర‌వే. నెల్లూరు నుంచి తూర్పుగోదావ‌రి వ‌ర‌కు ఉన్న జిల్లాల్లో ఎప్పుడూ రాజ‌కీయాలు వేడివేడిగా సాగుతుంటాయి.

By:  Garuda Media   |   4 Aug 2026 11:50 AM IST
ఏపీ పాలిటిక్స్‌: సీమ-ఉత్త‌రాంధ్ర‌లో దూకుడు.. కోస్తాలో సైలెంట్‌..!
X

ఏపీ పాలిటిక్స్‌లో ఎప్పుడూ చ‌ర్య‌కు వ‌చ్చే జిల్లాలు కోస్తాంధ్ర‌వే. నెల్లూరు నుంచి తూర్పుగోదావ‌రి వ‌ర‌కు ఉన్న జిల్లాల్లో ఎప్పుడూ రాజ‌కీయాలు వేడివేడిగా సాగుతుంటాయి. అయితే.. దీనికి భిన్నంగా ఈ జిల్లాల్లో అటు వైసీపీ, ఇటు టీడీపీ స‌హా.. ఇత‌ర ప‌క్షాలు మౌనంగా ఉంటున్నాయి. ఎక్క‌డా ఎవ‌రూ అలికిడి కూడా చేయ‌డం లేదు. విప‌క్షాల‌పై అధికార పార్టీ నాయ‌కులు కూడా ప‌న్నెత్తు మాట అన‌డం లేదు. ఇక‌, అధికారం పార్టీల‌పై ఈ జిల్లాల్లోని నాయ‌కులు పెద్ద‌గా స్పందించ‌డం లేదు.

కానీ, అటు సీమ‌లోను.. ఇటు ఉత్త‌రాంధ్ర‌లోనూ .. అధికార‌-విప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. ఒక‌రిపై ఒక‌రు ఫిర్యాదులు చేసుకోవ‌డం.. కేసులు పెట్టుకోవ‌డం.. దాడులు.. రాజకీయ విమ‌ర్శ‌లు ఇటీవ‌ల కాలంలో పెరుగుతున్నాయి. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. ఆయా జిల్లాల్లో టీడీపీ మ‌రింత విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం.. వైసీపీ త‌న ఉనికిని కాపాడుకునే ప్ర‌య‌త్నం చేయ‌డ‌మేన‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వాస్త‌వాలు ఎలా ఉన్నా.. నేత‌ల మ‌ధ్య సెగ‌లు పొగ‌లు క‌క్కుతున్నాయి.

వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు వివాదంతో మొద‌లైన ర‌గ‌డ‌.. ప్ర‌స్తుతం వ‌రుస‌ అరెస్టుల వ‌ర‌కు సాగుతోంది. క‌ర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష అరెస్టు స‌హా.. మాజీ ఎంపీ మాధ‌వ్ అరెస్టు దాకా కొన‌సాగుతోంది. శ్రీకాకుళంలో చాలా మందిపై కేసులు పెండింగులో ఉన్నాయ‌ని వైసీపీ నాయ‌కులే చెబు తున్నారు. మ‌రోవైపు అనంత‌పురంలోనూ తాడిప‌త్రి స‌హా.. ఉర‌వ‌కొండ వంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో కూడా రాజ‌కీయం వేడిగా సాగుతోంది. నిజానికి ఎన్నికల‌స‌మ‌యంలో కానీ.. పెద్ద‌గాచ‌ర్చ‌కు ఈ ప్రాంతాలు ఇప్పుడు ఇంత హాట్‌గా మార‌డం గ‌మ‌నార్హం.

సీమ‌లోని నాలుగు జిల్లాపై టీడీపీ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు ముమ్మ‌రం చేసింది. అలాగే.. ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల‌పైనా ఇదే స్ట్రాట‌జీతో ముందుకు సాగుతోంది. ఈ నేప‌థ్యంలో వైసీపీ కూడా అదే రీతిలో వ్యూహాత్మ‌కంగా ముందుకుసాగాల‌ని నిర్ణ‌యించింది. ఇది.. రాజ‌కీయ వివాదాల నుంచి వ్య‌క్తిగ‌త వివాదాలకు కూడా దారితీయ‌డంతో పాటు.. వైసీపీ నేత‌లు చేస్తున్న త‌ప్పులు కూడా క‌లిసి వ‌స్తున్నాయి. దీంతో అటు సీమ‌, ఇటు ఉత్త‌రాంధ్ర జిల్లాలు రాజకీయంగా దుమారం రేపుతుండ‌డం గ‌మ‌నార్హం.