Begin typing your search above and press return to search.

తొలిసారి ఈవీఎం కాదా..బ్యాలెట్ తోనేనా ?

ఏపీలో వేలాదిగా ఉన్న పంచాయతీలకు ఎన్నికలు తొందరలో జరగనున్నాయి. ప్రజా పాలన లేక ఇప్పటికే అయిదు నెలలు గడచిపోయాయి. మరో రెండు నెలలలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి.

By:  Satya P   |   16 Aug 2026 9:42 AM IST
తొలిసారి ఈవీఎం కాదా..బ్యాలెట్ తోనేనా ?
X

ఏపీలో వేలాదిగా ఉన్న పంచాయతీలకు ఎన్నికలు తొందరలో జరగనున్నాయి. ప్రజా పాలన లేక ఇప్పటికే అయిదు నెలలు గడచిపోయాయి. మరో రెండు నెలలలో స్థానిక ఎన్నికలు ఉన్నాయి. దాంతో ఎంత తొందరగా ఎన్నికలు జరిపించాలన్నది ప్రభుత్వం ఆలోచిస్తోంది. అలాగే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించాలని చూస్తోంది. ఆ దిశగా సన్నాహాలు కూడా ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో బ్యాలెట్ తో ఎన్నికలు అంటూ ఇపుడు కొత్త మాట వినిపిస్తోంది. నిజానికి ఈవీఎంలు గడచిన రెండు దశాబ్దాలుగా వినియోగంలోకి వచ్చాయి. అయితే ఈసారి పంచాయతీ ఎన్నికలను కూడా బ్యాలెట్ పేపర్ విధానంలోనే జరిపించాలని ఎన్నికల సంఘం ఆలోచన చేస్తోంది అని అంటున్నారు.

గతంలోనూ బ్యాలెట్ పేపర్ తోనే :

ఇదిలా ఉంటే ఏపీలో 2021లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలని కూడా ఈవీఎంలతో నిర్వహించలేదు. వాటిని సంప్రదాయ బ్యాలెట్ పేపర్లతోనే చేపట్టారు. 2021 ఫిబ్రవరిలో జరిగిన ఏపీ గ్రామ పంచాయతీ ఎన్నికల పూర్తి షెడ్యూల్ ప్రకారం ఓటింగ్ ప్రక్రియ అంతా బ్యాలెట్ పేపర్ల మీదే సాగింది. అదే విధంగా సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసిన అభ్యర్థులకు బ్యాలెట్ పేపర్ పై ముద్రించిన వివిధ రకాల గుర్తులను కేటాయించారు. ఇక పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ కేంద్రాల్లోనే బ్యాలెట్ బాక్సులను తెరిచి ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. అలాగే 2021లో ఏపీలో జరిగిన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈవీఎంల ద్వారా జరగలేదు. ఈ ఎన్నికలను పూర్తిగా బ్యాలెట్ పేపర్లు తోనే నిర్వహించారు. ఇప్పటిదాకా ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీ ఎన్నికలకు మాత్రమే ఈవీఎంలను ఉపయోగిస్తూ వచ్చారు.

తొలిసారి ఈవీఎంలు అంటూ :

ఈ నేపథ్యంలో ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికలను తొలిసారి ఈవీఎంలతో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావించింది. కానీ చివరికి బ్యాలెట్ విధానానికే మొగ్గు చూపినట్లు సామాజిక మాధ్యమాలలో అయితే విస్తృత ప్రచారం జరుగుతోంది. దాంతో పాటు గ్రామ పంచాయతీలతో పాటు మున్సిపల్ ఎన్నికలనూ బ్యాలెట్ విధానంలో నిర్వహించేందుకు ప్రణాళిక అంటూ పోస్ట్ లు వైరల్ అవుతున్నాయి. ఇక రాష్ట్రంలో అందుబాటులో లక్ష పది వేల బ్యాలెట్ బాక్సులు అందుబాటులో ఉన్నాయని అంటున్నారు. వీటిలో కూడా యాభై వేల బ్యాలెట్ బాక్స్ లు మాత్రమే వినియోగానికి చాన్స్ ఉన్నట్లుగా చెబుతునారు. ఈ క్రమంలో అదనంగా 50 వేల చొప్పున బాక్సులు సమకూర్చాలని తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఎన్నికల కమిషన్లకు అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం లేఖ రాసినట్లు సామాజిక మాధ్యమాలలో వార్తలు వస్తున్నాయి. వీటిలో నిజమెంత ఉందో తెలియదు. అయితే పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను బ్యాలెట్ విధానంలో నిర్వహిస్తారని అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉండడంతో ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.