Begin typing your search above and press return to search.

వైసీపీ 26...టీడీపీ కూటమి 32

అయితే వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి వచ్చింది. దాని ప్రకారం ఉమ్మడి పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా చేసింది.

By:  Raja Ch   |   12 Aug 2025 9:33 AM IST
వైసీపీ 26...టీడీపీ కూటమి 32
X

ఉమ్మడి ఏపీ విభజన తరువాత ఏపీ 13 ఉమ్మడి జిల్లాతోనే విడిపోయింది. అంతకు ముందు 1953లో ఉమ్మడి మద్రాస్ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నవి 11 జిల్లాలే, అంటే అరవై ఏళ్ళ కాలంలో ఏపీలో కేవలం రెండు జిల్లాలే కొత్తగా ఏర్పడ్దాయి అన్న మాట. అవి 1972లో ప్రకాశం జిల్లా. ఇది గుంటూరు నుంచి వేరు పడి ఏర్పాటు అయింది. అలాగే 1978లో విజయనగరం జిల్లా. ఇది విశాఖపట్నం నుంచి వేరుపడి ఏర్పాటు అయింది. అయితే 2014 నుంచి 2019 మధ్య తెలంగాణాలో ఉన్న పది జిల్లాలు కాస్తా 33 అయ్యాయి. కానీ ఏపీలో మాత్రం అలాగే ఉంచేశారు.


వైసీపీ ముద్ర అది :

అయితే వైసీపీ ఎన్నికల్లో హామీ ఇచ్చి వచ్చింది. దాని ప్రకారం ఉమ్మడి పదమూడు జిల్లాలను 26 జిల్లాలుగా చేసింది. దీనిని ప్రాతిపదిక ఏమిటి అంటే ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా మార్చడం. ఇందులో వెసులుబాటు ఉంది కానీ చాలా చోట్ల ప్రాంతీయ సెంటిమెంట్లకు సరైన న్యాయం అయితే జరగలేదని విమర్శలు పెద్దగా వచ్చాయి. అంతే కాదు జిల్లా కేంద్రాల ఎంపిక కూడా కొన్ని చోట్ల వివాదం అయింది. మరి కొన్ని కొత్త జిల్లాల డిమాండ్లు అలా పక్కన పెట్టేశారు అని కూడా ఆరోపణలు ఉన్నాయి.

కూటమి హామీతో :

అయితే టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే కనుక ఈ లోపాలను అన్నీ సవరిస్తామని అంతే కాకుండా జిల్లాల ప్రజల సెంటిమెంట్ ని గౌరవిస్తామని హామీ ఇచ్చింది. అవసరమైన చోట కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేసింది. ఇపుడు టీడీపీ కూటమి ఆ ప్రక్రియను స్టార్ట్ చేసింది. వైసీపీకి కొత్త జిల్లాల ఏర్పాటు క్రెడిట్ ఉంది. ఆ ముద్రను మార్చి మరీ తనదైన కొత్త ముద్ర బలంగా వేసుకోవాలని టీడీపీ కూటమి చూస్తోంది.

కొత్తగా ఆరు జిల్లాలతో :

వైసీపీ లెక్కకు కొత్తగా ఆరు జిల్లాలను చేర్చి సరికొత్తగా ఏపీ రూపురేఖలను మారుస్తోంది. దాంతో 32 రెండు జిల్లాలు ఏపీలో ఏర్పాటు కాబోతున్నాయి. అలా ఏపీలో తనదైన తీరులో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. దాంతో పాటు ప్రజల సెంటిమెంట్ ని గౌరవించడం ద్వారా అందరికీ న్యాయం చేశామని చెప్పుకోవాలని చూస్తోంది అంటున్నారు.

ఇవేనా కొత్త జిల్లాలు :

ఏపీలో ప్రస్తుతం ప్రచారంలో ఉన్న దానిని బట్టి చూస్తే కొత్త జిల్లాల లిస్ట్ ఈ విధంగా ఉంది. పలాస జిల్లా, , శ్రీకాకుళం జిల్లా, మన్యం జిల్లా, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లా, కాకినాడ జిల్లా, తూర్పుగోదావరి జిల్లా, బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా, క్రిష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, అమరావతి జిల్లా, గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లా, పలాండు జిల్లా, మార్కాపురం జిల్లా, ప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా, గూడూరు జిల్లా, శ్రీ బాలాజీ జిల్లా, చిత్తూరు జిల్లా, మదనపల్లె జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఆదోని జిల్లా, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారు అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతోంది.