ఏపీ కొత్త జిల్లాలు ఇవే.. 26 కాదు 28!
ప్రజల నుంచి వస్తున్న వినతులకు అనుగుణంగా తగిన నిర్ణయాన్ని తీసుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం.
By: Garuda Media | 30 Dec 2025 9:49 AM ISTప్రజల నుంచి వస్తున్న వినతులకు అనుగుణంగా తగిన నిర్ణయాన్ని తీసుకుంది ఏపీలోని కూటమి ప్రభుత్వం. తాజాగా నిర్వహించిన కేబినెట్ భేటీలో కొత్తగా రెండు జిల్లాలకు ఓకే చెప్పేసింది. ఈ కొత్త జిల్లాల్ని కొత్త సంవత్సరం తొలి రోజు నుంచే అమలయ్యేలా నిర్ణయాన్ని తీసుకున్నారు. దీంతో ఇప్పటివరకు ఉనన 26 జిల్లాలు కాస్తా 28 జిల్లాలుగా మారాయి. అంతేకాదు కొత్తగా ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో పాటు.. పలు నిర్ణయాలు తీసుకున్నారు.
కొత్తగా రానున్న జిల్లాల విషయానికి వస్తే..
1. పోలవరం
2. మార్కాపురం
అంతేకాదు.. జిల్లాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాల్ని కేబినెట్ భేటీలో తీసుకున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకకు మార్చే ప్రతిపాదనకు ఓకే చెప్పేశారు. అదే సమయంలో అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోకి.. రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని డిసైడ్ చేశారు. రాయచోటి నియోకవర్గం అన్నమయ్య జిల్లాలోనే ఉండనుంది.
ఇప్పటివరకు ఉన్న 26 జిల్లాల్లో 17 జిల్లాలకు సంబంధించి రెవెన్యూ డివిజన్లు.. మండలాల్లో మార్పులు చేర్పులు జరిగాయి.తొమ్మిది జిల్లాల్లో ఎలాంటి మార్పులు లేవు. తాజా మార్పుల నేపథ్యంలో మారిన జిల్లాల వారీగా రెవెన్యూ డివిజన్లు.. మండలాల విషయానికి వస్తే.
జిల్లా పేరు రెవెన్యూ డివిజన్లు మండలాల
నంద్యాల 4 30
కర్నూలు 3 27
శ్రీసత్యసాయి 5 32
వైఎస్సార్ కడప 5 40
అన్నమయ్య 3 25
చిత్తూరు 4 28
తిరుపతి 3 36
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు 4 36
శ్రీకాకుళం 3 30
అనకాపల్లి 3 24
అల్లూరి సీతారామరాజు 1 11
పోలవరం 2 12
కాకినాడ 2 21
అంబేడ్కర్ కోనసీమ 3 19
తూర్పుగోదావరి 2 22
పశ్చిమగోదావరి 3 20
బాపట్ల 3 20
ప్రకాశం 3 28
మార్కాపురం 2 21
