Begin typing your search above and press return to search.

కూటమి ధీమా...వైసీపీలో ఆశ !

స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి విడతలో భాగంగా కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.

By:  Satya P   |   30 Oct 2026 8:53 AM IST
కూటమి ధీమా...వైసీపీలో ఆశ !
X

స్థానిక సంస్థల ఎన్నికల్లో తొలి విడతలో భాగంగా కార్పోరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు పోలింగ్ కి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. నవంబర్ 1న పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉంటే ఏపీలో 13 కార్పోరేషన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో నూటికి నూరు తాము గెలుస్తామని కూటమి పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. వైసీపీ అయితే తాము గట్టి పోటీ ఇస్తామని కూటమిలో అనైక్యత ఏమైనా ఉంటే తమకు ఎంతో కొంత అనుకూలిస్తుందని ఆశలు పెంచుకుంటోంది.

ఉత్తరాంధ్రాలో రెండు :

ఏపీలో అతి పెద్ద కార్పొరేషన్ గా ఉత్తరాంధ్రాలో విశాఖ ఉంది. ఇక్కడ మొత్తం 120 వార్డులు ఉన్నాయి. వైసీపీ నుంచి వరుదు కళ్యాణి టీడీపీ నుంచి ముక్కా శ్రావణి మేయర్ అభ్యర్ధులుగా పోటీ చేస్తున్నారు. వైసీపీ అయితే బలమైన పోటీ ఇస్తామని అంటోంది. కూటమిలోని మూడు పార్టీలు కలసికట్టుగా రంగంలో ఉన్నందువల్ల నల్లేరు మీద నడకగా తమకు ఈ ఎన్నికలు ఉంటాయని టీడీపీ అంచనా వేస్తోంది. తమ విజయం ఖయామని కూటమి నేతలు చెబుతున్నారు. విజయనగరంలో చూస్తే వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కుమార్తె కోలగట్ల శ్రావణి పోటీలో ఉన్నారు. ఆమె గత అయిదేళ్లుగా డిప్యూటీ మేయర్ గా పనిచేశారు కాబట్టి ఆ అనుభవం కలసి వస్తుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ నుంచి అవనాపు భార్గవి పోటీలో ఉన్నారు. ఇక్కడ కూడా కూటమి బలమే టీడీపీకి గట్టి అండగా ఉండబోతోంది. అయితే వైసీపీ ఏమైనా చాన్స్ ఉంటుందేమో అని చూస్తోంది అంటున్నారు.

సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేటు :

ఇక మిగిలిన చోట్ల మేయర్ సీట్లు చూస్తే విజయవాడలో వంగవీటి రాధా క్రిష్ణ జనసేన తరఫున బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా వైసీపీ మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మిని నిలిపింది. ఇక్కడ ఇండిపెండెంట్ గా ఏబీ వెంకటేశ్వరరావు పోటీలో ఉన్నారు. కానీ జనసేన టీడీపీ కట్టుగా నిలిచి ఉన్నాయి. దాంతో పాటు వంగవీటి బ్రాండ్ కూడా ఈ ఎన్నికల్లో కీలకం అవుతుందని అంటున్నారు. అలా జనసేన ఖాతాలో తొలి మేయర్ సీటు పడుతుందని అంటున్నారు. గుంటూరు, మచిలీపట్నం, ఒంగోలు లలో కూటమికి నల్లేరు మీద నడక అనే అంటున్నారు. అయితే నెల్లూరులో మాత్రం ఆనం విజయ్ కుమార్ రెడ్డిన్ వైసీపీ మేయర్ అభ్యర్థిగా నిలబెట్టింది. దాంతో ఇక్కడ కొంత పోటీ ఉండే చాన్స్ ఉంది అంటున్నారు.

రాయలసీమలో ఏంటి :

ఇక చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం మేయర్ సీట్లకు ఎన్నికలు అయితే ఏకపక్షంగానే సాగనున్నాయని అంటున్నారు. ఇందులో అనేక చోట్ల నామినేషన్లు పూర్తిగా వైసీపీ వేయలేదు అని అంటున్నారు. దాంతో ముందే కూటమికి విజయం ఖాయం అయింది అని అంటున్నారు. కడపలో తొలిసారి కూటమి మేయర్ ని చూడబోతున్నారు అని అంటున్నారు. ఇక అనంతపురం కార్పోరేషన్ మీడ కమలం జెండా ఎగరనుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే మేయర్ ఎన్నికల్లో కూటమి నూరు శాతం స్ట్రైక్ రేట్ సాధిస్తుందని ధీమాగా ఉంది. అలాగే 87 మునిసిపాలిటీలలో కూడా కూటమి పార్టీల జెండా ఎగురుతుందని అంటున్నారు. అయితే వైసీపీ తాము ధీటైన పోటీ ఇస్తామని కొన్ని చోట్ల ఫలితాలు అనూహ్యంగా ఉండబోతాయని సంకేతాలు ఇస్తోంది. చూడాలి మరి ఏమి జరుగుతుందో.