కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?
ఏపీలో 13 కార్పోరేషన్లు, 79 మునిసిపాలిటీలు నగర పంచాయతీలకు ఈ నెల 3 అంటే మంగళవారం తీర్పు వెలువడనుంది.
By: Satya P | 2 Nov 2026 11:53 PM ISTఏపీలో 13 కార్పోరేషన్లు, 79 మునిసిపాలిటీలు నగర పంచాయతీలకు ఈ నెల 3 అంటే మంగళవారం తీర్పు వెలువడనుంది. మొదట్లో మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రానికి పుంజుకుంది అన్నది ఉంది. అలాగే ఎక్కువ శాతం గ్రామీణ నేపథ్యం ఉన్న ప్రాంతాలలో పోలింగ్ జరిగింది. మహిళలు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇక విశాఖ విజయవాడ వంటి చోట తక్కువగా ఓటింగ్ జరిగింది అని నివేదికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల తీర్పు ఎలా ఉండబోతోంది అన్నది పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. దాంతో సర్వత్రా ఏపీలో జరిగిన పోలింగ్ మీద పెద్ద ఎత్తున ఉత్కంఠ ఏర్పడింది.
ఆ రెండు చోట్ల :
ఇక ఏపీలో అర్బన్ బాడీస్ అంటే 13 కార్పొరేషన్లు ఉన్నాయి. అందులో కూడా విశాఖ విజయవాడ మీదనే అందరి దృష్టి ఉంది. ఈ రెండు చోట్ల ఓటర్లు ఏ రకంగా తీర్పుని ఇచ్చారు అన్నది అంతటా ఆసక్తి ఉంది. విశాఖ అయితే ఏపీలో పెద్ద కార్పొరేషన్. ఇక్కడ 120 దాకా వార్డులు ఉన్నాయి. అలాగే విజయవాడలో 86 దాకా వార్డులతో రెండవ స్థానంలో ఉంది. ఈ రెండు చోట్ల ఫలితాల సరళి అయితే ఏపీ రాజకీయాన్ని మారుస్తుంది అన్న భావన ఉంది. దాంతో ఈ ఫలితాల మీద అంతా చర్చించుకునేందుకు నవంబర్ 3 కౌంటింగ్ డే ఆస్కారం ఇస్తోంది.
మొత్తం స్వీప్ చేసింది :
ఇక ఏపీలో చూస్తే 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి మొత్తానికి మొత్తం స్వీప్ చేసింది. ఉత్తరాంధ్రా నుంచి రాయలసీమ దాకా ఎక్కడా వైసీపీని ఊపిరి తీసుకోనీయని విధంగా తీర్పు వచ్చింది. వైనాట్ 175 అంటూ వైసీపీ విజయం మీద పూర్తి ధీమాతో ఆ ఎన్నికల్లో తలపడితే 11 సీట్లు మాత్రమే దక్కాయి అంటే కూటమి ప్రభంజనం ఎంత బలంగా వీచింది అన్నది అంతే ఈ రోజుకీ అంతా చర్చించే విధంగా ఉంది. చూస్తూండగానే రెండున్నరేళ్ళు ఇట్టే గడచిపోయాయి. దాంతో కూటమి పాలన మీద జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారు అన్నది అయితే ఉంది. కూటమి మాత్రం అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని పూర్తి ధీమాగా ఉంది. దానికి తోడు వైసీపీ చాలా చోట్ల పోటీ చేసినా ఆ ప్రభావం ఏదీ ఉండదని కూడా భావిస్తోంది. అయితే వైసీపీ గతానికి అంటే 2024 ఎన్నికల ఫలితాల కంటే తాము బలపడతామని ఆశిస్తోంది. ఎంతో కొంత గ్రాఫ్ పెరుగుతుందని తప్పించి వెనక్కి తగ్గేది ఉండదని ఊహిస్తోంది.
పట్టణ ఓటర్ల తీరు :
ఇక చూస్తే పట్టణ ఓటర్ల తీర్పు కానీ వారు తీర్పు కానీ ఎపుడూ భిన్నంగా ఉంటుంది. వారు అభివృద్ధిని కోరుకుంటారు. అలాగే లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉండాలని ఆశిస్తారు. ఏపీలో ఉపాధి అవకాశాలు పెరగాలని భావిస్తారు. అయితే పట్టణాలను ఆనుకునే గ్రామీణ ప్రాంతాలు కూడా కలసి అవి కార్పోరేషన్లలోనో మునిసిపాలిటీలలోనో విలీనం అయి ఉన్నాయి. అలాంటి చోట్ల సంక్షేమం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అని అంటున్నారు. దాంతో కూటమి అభివృద్ధి ప్లస్ సంక్షేమానికి జనం ఇచ్చే తీర్పుగా కూడా దీనిని భావించాలని అంటున్నారు. ఏపీలో సమగ్రమైన ప్రగతికి బాటలు వేశామని భావిస్తూ కూటమి జనంలోకి వెళ్ళింది. అలాగే యాంటీ ఇంకెంబెన్సీ మీద నమ్మకంతో వైసీపీ రంగంలోకి దిగింది. దాంతో ఎవరి ధీమా వారికి ఉంది. మరి అర్బన్ ఓటర్ తీర్పు ఎలా ఉండబోతోంది అన్నదే తేలనుంది. దానికి కొద్ది గంటల సమయం మాత్రమే ఉంది. చూడాలి ఏమి జరుగుతుందో.
