Begin typing your search above and press return to search.

ఏపీ ఎంపీల ప‌నితీరు @ 2025 ..!

కానీ అనూహ్యంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు.

By:  Garuda Media   |   30 Dec 2025 7:00 AM IST
ఏపీ ఎంపీల ప‌నితీరు @ 2025 ..!
X

ఎంపీల పనితీరులో ఈ ఏడాది మెరుగైన ఫలితాలు కనిపించాయి. ముఖ్యంగా ఇటు టిడిపి అటు వైసిపి ఎంపీలు ఇరుపక్షాలు కూడా పార్లమెంట్లో కానీ ఇటు నియోజకవర్గాల్లో కానీ పర్యటించడం, పార్లమెంట్లో సమస్యలను ప్రస్తావించటం వంటి అంశాల్లో మెరుగైన పనితీరుకు మార్కులు వేసుకున్నారు. నిజానికి వైసీపీ ఎంపీల పనితీరుపై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు. కానీ అనూహ్యంగా తిరుపతి ఎంపీ గురుమూర్తి, కడప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిలు ముందు వరుసలో ఉన్నారు.

నిజానికి ప్ర‌తిప‌క్షంలో ఉన్న ఎంపీలు ముందు వరుసలో నిల‌వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. వాస్తవానికి వైసీపీ ఎమ్మెల్యేలను తీసుకుంటే ఒకరు కూడా సభకు రావడం లేదు. ప్రజల మధ్య కూడా పెద్దగా ఉండడం లేదు. కానీ ఎంపీలు మాత్రం దీనికి భిన్నంగా ఇటు ప్రజలు తోను అటు పార్లమెంటులో నూ బలంగా పనిచేస్తున్నారు. ఇది ఒక పరిణామం అయితే టిడిపి ఎంపీలు కూడా పోటాపోటీగా పనిచేస్తుండడం విశేషం. ఈ క్రమంలోనే ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో టిడిపి ఎంపీలు ముందు వరుసలో నిలవడం మంచి మార్కులు సాధించడం వంటివి కనిపించింది.

ముఖ్యంగా యువ ఎంపీలు విశాఖ పార్ల‌మెంటు స‌భ్యులు మెతుకుమెల్లి భ‌ర‌త్‌, అమ‌లాపురం ఎంపీ గంటి హ‌రీష్‌, న‌ర‌స‌రావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు వంటివారు.. ముందు వ‌రుస‌లో నిల‌బ‌డ్డారు. అంతేకాదు.. తొలిసారి విజ‌యం ద‌క్కించుకున్న విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్న కూడా వ‌రుసలో మంచి నెంబ‌రునే ద‌క్కించుకున్నారు. స్థానిక స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌డం.. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండ‌డం... అదేవిధంగా.. అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్ట‌డం వంటివి ముఖ్యంగా వీరికి మంచి మార్కులు ప‌డేలాచేశాయి.

ఇక జనసేన ఎంపీల విషయానికొస్తే ఉన్నది ఇద్దరే అయినప్పటికీ సమస్యల మీద స్పందిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గానికి కావలసిన నిధులను తెచ్చుకోవడంలోనూ బాల‌శౌరి వంటి సీనియర్ నాయకులు సక్సెస్ అవుతున్నారు. మొత్తంగా చూస్తే 2025లో రాష్ట్రానికి సంబంధించిన ఎంపీల పనితీరు ఆశించినట్టుగానే ఉంది. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సమయం కూడా కేటాయిస్తుండడం విశేషం అనే చెప్పాలి. పార్టీల‌తో సంబంధం లేకుండా..ఎంపీల‌కు మంచి మార్కులే ప‌డుతున్నాయి. చిత్రం ఏంటంటే.. మ‌హిళా ఎంపీలు శ‌బ‌రి, పురందేశ్వ‌రి కూడా.. ప‌నితీరులో మెరుగైన విధానాలు పాటిస్తున్నారు.