Begin typing your search above and press return to search.

కొత్త జిల్లాలు ఇంకా చాలా..... రీజన్ అదే !

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు అయింది. దానికి హెడ్ క్వార్టర్స్ గా మార్కాపురం ఉంటుంది.

By:  Satya P   |   31 Dec 2025 5:00 AM IST
కొత్త జిల్లాలు ఇంకా చాలా..... రీజన్ అదే !
X

ఏపీలో కొత్త జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. కొత్తగా మార్కాపురం జిల్లా ఏర్పాటు అయింది. దానికి హెడ్ క్వార్టర్స్ గా మార్కాపురం ఉంటుంది. అలాగే రంపచోడవరం హెడ్ క్వార్టర్స్ గా పోలవరం కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక అన్నమయ్య జిల్లా అలాగే ఉంటుంది కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ గా మదనపల్లె ఉంటుంది. ఇవన్నీ జనవరి 1వ తేదీ 2026 నుంచి అమలులోకి వస్తాయి. అయితే విభజన నాటికి 13 ఉమ్మడి జిల్లాలుగా ఉన్న ఏపీ వైసీపీ హయాంలో 26 జిల్లాలుగా రెట్టింపు అయింది కూటమి వచ్చాక మరో రెండు జిల్లాలు అదనం అయ్యాయి. మరి కొత్త జిల్లాలు ఇంతటితో ఆగుతాయా ఇంకా పెరుగుతాయా అంటే ప్రస్తుతానికి కామావే అని అంటున్నారు. ఇంకా పెరిగే ఆవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

తెలంగాణా మోడల్ :

తెలంగాణాలో చూస్తే పది జిల్లాలు 33 జిల్లాలుగా ఏర్పాటు అయ్యాయి. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అదనంగా మరో 21 జిల్లాలు ఏర్పాటు చేశారు. అయితే ములుగు నారాయణపేటలను కొత్త జిల్లాలుగా 2019 ఫిబ్రవరిలో ఏర్పాటు చేశారు దాంతో 33 అయ్యాయి. సమర్థవంతమైన పాలన కోసం అనేక పరిపాలనా విభాగాలతో కూడిన రాష్ట్రంగా మార్చామని పాలకులు చెప్పుకున్నారు. అయితే భౌగోళికంగా జనాభా పరంగానూ అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పరంగానూ తెలంగాణా కంటే ఏపీ పెద్దది. మరి ఏపీలో 2023 దాకా కొత్త జిల్లాలు లేవు. 28 జిల్లాలు గా చేసినా ఇంకా డిమాండ్లు ఉన్నాయి. అయితే పాలనా సౌలభ్యం కోసం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సి ఉందని అంటున్నారు. అలాగే డిమాండ్లు కూడా చాలానే ఉన్నాయి.

డీ లిమిటేషన్ తరువాత :

ఇక దేశవ్యాప్తంగా జన గణనతో పాటు కొత్తగా ఎంపీ సీట్లు పునర్ విభజన సాగుతుంది. అలాగే ఏపీలో అసెంబ్లీ సీట్లు కూడా మరో 50 దాకా పెరుగుతాయని అంటున్నారు. ఇవన్నీ జరిగేందుకు మరో రెండేళ్ళ పైన సమయం పట్టవచ్చు. అలా పెరిగిన 225 అసెంబ్లీ సీట్లకు అలాగే 30 దాకా అయ్యే ఎంపీ సీట్లకు తగిన విధంగా కొత్త జిల్లాల ఏర్పాటు ఉండొచ్చు అని అంటున్నారు. అందుకే ప్రస్తుతానికి ఈ నెంబర్ అని అంతా అంటున్నారు.

నెంబర్ పెద్దదేనా :

ఏపీలో కనీసంగా మరో ఏడెనిమిది కొత్త జిల్లాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అయితే ఇవన్నీ జరగాలంటే 2029 ఎన్నికల తరువాతనే అని అంటున్నారు. అలా ఏర్పడిన ప్రభుత్వం మరిన్ని కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే వీలుందని అంటున్నారు. నిజానికి కూటమి ప్రభుత్వంలో కనీసంగా అరడజన్ దాకా కొత్త జిల్లాలు వస్తాయని అంతా భావించారు. కానీ అలా జరగలేదు, కేవలం రెండు కొత్త జిల్లాలతో సరిపెట్టారు, అయితే డీ లిమిటేషన్ తరువాత మరిన్ని జిల్లాలు వస్తాయని అంటున్నారు. మరి అవి ఏమిటో ఎక్కడెక్కడ వస్తాయన్నది అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన తరువాత వాటి స్వరూప స్వభావాలను చూసిన తర్వాత పాలనా పరమైన అవసరాలతో పాటు స్థానికుల నుంచి వచ్చే డిమాండ్లు ఇతరత్రా అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని చేయవచ్చు అని అంటున్నారు.