Begin typing your search above and press return to search.

స్విస్ లో లోకేష్ మేకోవర్ వైరల్.. పార్టీ శ్రేణుల ఫిదా!

అవును.. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పనితీరుతో పాటు ఆయన మేకోవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

By:  Raja Ch   |   20 Jan 2026 2:35 PM IST
స్విస్  లో లోకేష్  మేకోవర్  వైరల్.. పార్టీ శ్రేణుల ఫిదా!
X

ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి దావోస్ వెళ్లిన మంత్రి నారా లోకేష్.. అక్కడ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సందర్భంగా... గత పర్యటనల కంటే ఈసారి ఆయన శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఆయన అంతర్జాతీయ వేదికలపై వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో ఆయన న్యూ లుక్ కు పార్టీ శ్రేణులు ఫిదా అవుతున్నారు.

అవును.. దావోస్ పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేష్ పనితీరుతో పాటు ఆయన మేకోవర్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సాధారణంగా ఫార్మల్ దుస్తుల్లో కనిపించే ఆయన.. ఈసారి దావోస్ వీధుల్లో, కొన్ని సమావేశాల్లో స్టైలిష్ 'టీ-షర్ట్' ధరించి కనిపించారు. గతంతో పోలిస్తే ఆయన గణనీయంగా బరువు తగ్గి, చాలా స్లిమ్‌ గా, ఫిట్‌ గా కనిపిస్తున్నారు. ఈ 'న్యూ లుక్' ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

సాధారణంగా తెల్లటి షర్టు, నల్లటి / బ్లూ కలర్ ప్యాంటు ధరించి కనిపించే నారా లోకేష్.. ఈసారి దావోస్ పర్యటనలో టీ షర్ట్, బ్లూ ఫ్యాంట్, స్టైలిష్ షూ తో దర్శనం ఇచ్చేసరికి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఈ సందర్భంగా... లోకేష్ న్యూ లుక్ అదిరింది అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఆయన ఫోటోలు షేర్ చేస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ న్యూ లుక్ కు పార్టీ శ్రేణులు ఫిదా అవుతున్నారనే చర్చ నెట్టింట సాగుతోంది.

అయితే లోకేష్ లో ఈ మార్పు కేవలం దుస్తులు, బాహ్య రూపానికే పరిమితం కాలేదని.. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు.. అగ్రశ్రేణి సంస్థల ప్రతినిధులతో సంభాషించేటప్పుడు సైతం అత్యంత ఆత్మవిశ్వాసంతో, వేగంగా నిర్ణయాలు తీసుకునే నాయకుడిగా ఆయన కనిపిస్తున్నారని చెబుతున్నారు. ఈ సందర్భంగా... జ్యూరిక్‌ లో తెలుగు డయాస్పొరా సమావేశంలో లోకేష్ ప్రసంగాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు.

ఈ సందర్భంగా... ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లో రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులు.. తద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని చెప్పిన లోకేష్.. భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల్లో 25.3% ఒక్క ఆంధ్రప్రదేశ్ కే వచ్చాయని అన్నారు. గూగుల్‌ 15 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి ఏపీలో పెడుతోందని వివరించారు. ఈ క్రమంలోనే... మీరు పని చేసే కంపెనీలకు విస్తరించే ఆలోచన ఉంటే వారికి ఏపీ గురించి చెప్పండని ప్రవాసాంధ్రులకు ఆయన పిలుపునిచ్చారు.