Begin typing your search above and press return to search.

60-30-10...కూటమికి బెస్ట్ ఫార్ములా ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి మిత్రుల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా జరుగుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది.

By:  Satya P   |   24 Sept 2026 1:00 AM IST
60-30-10...కూటమికి  బెస్ట్  ఫార్ములా ?
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేళ కూటమి మిత్రుల మధ్య సీట్ల సర్దుబాటు సాఫీగా జరుగుతుందా లేదా అన్న చర్చ సాగుతోంది. దానికి కారణం 2024 ఫార్ములాకు జనసేన బీజేపీ ఒప్పుకోకపోవడం. ఆనాటి రాజకీయం వేరు, పరిస్థితులు వేరు అని ఈ రెండు పార్టీలు అంటున్నాయి. మరీ ముఖ్యంగా జనసేన అయితే 2026 నడుస్తోంది ఇపుడు కొత్త ఫార్ములాతోనే ముందుకు అన్ తెగేసి చెబుతోంది. బలం ఉన్న చోట పోటీ చేసి తీరుతామని అంటోంది. ఎవరో వచ్చి టికెట్ ఇస్తారని ఎదురు చూడొద్దు, బలం ఉంది అనుకుంటే జనసేన నియమినిచిన ఎన్నికల కమిటీ దృష్టిలో పెట్టి పోటీ చేయండి అని అధినాయకత్వం దిశా నిర్దేశం చేసిన క్రమంలో ఇప్పుడు అసలైన రాజకీయ వేడి రాజుకుంది.

ఐక్యంగా సాగకపోతే :

నిజానికి 2024 ఎన్నికల్లో అత్యధిక సీట్లు కూటమిని వరించాయి అంటే ఐక్యంగానే అంతా ముందుకు సాగారు, ఒక్క ఓటు కూడా పొల్లుపోకుండా రాబట్టుకున్నారు. దానికి వైసీపీ యాంటీ ఇంకెంబెన్సీ కూడా తోడు అయి బంపర్ విక్టరీ సొంతం అయింది. దాంతో వైసీపీ 40 శాతం ఓటు షేర్ వద్ద ఆగిపోయింది. టీడీపీ కొటమి అయితే 56 శాతం దాకా ఓటు షేర్ సాధించి ఎంతో దూరంలో నిలబడ్డాయి. ఇప్పుడు అదే మ్యాజిక్ రిపీట్ కావాలి అంటే కనుక కచ్చితంగా అంతా కలసికట్టుగా నడవాల్సిందే అని అంటున్నారు. అలా కాకుండా ఫ్రెండ్లీ కాంటెస్ట్ అని ఎవరి మటుకు వారు విడిగా పోటీ చేసినా అంతిమంగా కూటమి నష్టపోతుందని ఆ మేరకు వైసీపీకి రాజకీయ ప్రయోజనం గరిష్టంగా దక్కుతుందని అంటున్నారు.

పట్టువిడుపులతో :

అయితే కూటమి ఐక్యంగా సాగేందుకే ఈ రోజుకు కూడా చూడడం మంచి పరిణామంగా చెబుతున్నారు. ఇంకా రిజర్వేషన్లు ఏమిటి అన్నది క్లారిటీ లేదు, అవన్నీ ఒక కొలిక్కి వచ్చాక అపుడు కూటమిలోని మూడు పార్టీల అధినాయకత్వాలు కూర్చుని చర్చలు జరిపితే కనుక వ్యవహారం అంతా ఒకమంచి పరిష్కారం వస్తుందని అంటున్నారు. అంతే కాదు మూడు పార్టీలు సర్దుబాటు చేసుకోవడానికి కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అంటున్నారు. ఈ క్రమంలో ఈ భేటీ మీదనే ఆసక్తి సర్వత్రా ఉంది. జనసేన అయితే తమకు 30 శాతం నిష్పత్తిలో సీట్లు కావాలని పట్టుబడుతోంది. బీజేపీ కూడా గతం కంటే ఎక్కువ సీట్లలో పోటీకి తయారు అవుతోంది. దాంతోనే ఏపీ రాజకీయాలో స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటు కూటమి ఏమి చేయబోతోంది అన్నది ఉత్కంఠను పెంచేస్తోంది.

అందరికీ ఆమోదంగా :

అయితే కూటమి ఐక్యంగా ముందుకు సాగేందుకు బెస్ట్ ఫార్ములా ఒకటి ఉందని అంటున్నారు. అదే 60-30-10 అని అంటున్నారు. అరవై శాతం సీట్లలో టీడీపీ పోటీ చేస్తే 30 శాతం సీట్లలో జనసేన పోటీ పడుతుందని, 10 శాతం సీట్లు బీజేపీకి విడిచిపెడితే కూటమికి తిరుగులేని విజయం దక్కుతుందని అంటున్నారు. దీని వల్ల కూటమి పార్టీలు మరింత బలపడతాయి తప్పిచి ఎక్కడా ఎవరూ తగ్గినట్లు కానే కాదని అంటున్నారు. ముఖ్యంగా నెటిజన్ల నుంచి ఈ రకమైన కొత్త ఫార్ములా రావడం విశేషం. ఇందులో జనసేన కోరినట్లుగా 30 శాతం ఉంది. బీజేపీకి కూడా అవకాశాలు పెరుగుతున్నాయి. కూటమిలో పెద్దన్నగా ఉన్న టీడీపీ పెద్ద మనసుతో ఆలోచన చేస్తే సీట్ల సర్దుబాటు ఈ ఫార్ములాతో కుదరడం అన్నది కష్టసాధ్యం కాదని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.