కూటమి కంటే ముందుగా : వైసీపీ అభ్యర్థులు వీరే !
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించింది. కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది.
By: Satya P | 15 Oct 2026 9:31 PM ISTఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దూకుడు ప్రదర్శించింది. కూటమి పార్టీలు సీట్ల సర్దుబాటు కోసం చర్చలు జరుపుతున్న నేపథ్యంలో వైసీపీ వ్యూహాత్మకంగా తమ పార్టీ అభ్యర్ధులను ప్రకటించింది. కీలక స్థానాలలో మేయర్ అభ్యర్ధులను ఆ పార్టీ ఎంపిక చేసి మరీ తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఏపీలోని పెద్ద కార్పోరేషన్ అయిన విశాఖ నుంచి ఎమ్మెల్సీ వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి పేరు ఉంది. ఆమె మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచి కూటమిని ఎదుర్కోనున్నారు.
ఏడు మేయర్ అభ్యర్ధులతో :
అదే విధంగా విజయనగరం నుంచి మేయర్ అభ్యర్థి కోలగట్ల శ్రావణి పేరుని ప్రకటించారు. ఒంగోలులో కుప్పం ప్రసాద్, కడపలో బండి దీప్తిరెడ్డి, మచిలీపట్నంలో లంకా జ్యోతి, ఏలూరులో గంటా మోహన్రావు, విజయవాడలో రాయన భాగ్యలక్ష్మి, కర్నూలులో ఎం.సుశీల, నెల్లూరులో ఆనం విజయ్కుమార్లను మేయర్ అభ్యర్ధులుగా వైసీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. మరో పది మేయర్ అభ్యర్ధులను ఈ రాత్రికి ఎంపిక చేసి రేపు రిలీజ్ చేయాలని చూస్తోంది.
మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థులుగా :
అదే విధంగా వైసీపీ పలు మునిసిపాలిటీలకు పోటీ చేసే చైర్మన్ అభ్యర్ధుల జాబితాను రిలీజ్ చేసింది. ఈ లిస్ట్ లో ఇచ్చాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి, పలాస మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా తలసు శ్రీపద్మ, నర్సీపట్నం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా చింతకాయల అనిత, యలమంచిలి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా బి.తులసి, తుని మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పిట్ల రామ తులసి, కొవ్వూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మన్నె పద్మ, రామచంద్రాపురం మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నాగేశ్వరరావు, కొండపల్లి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా నల్లమోతు తేజస్వీ, తెనాలి మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా మద్దలి శేషాచలం, చీరాల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా డా.ఇస్తార్ల శెర్లి, బద్వేల్ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా రాచపూడి వెంకట సాయి కృష్ణ, ప్రొద్దుటూరు మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా పొర్రెడ్డి నరసింహారెడ్డి, పులివెందుల మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా వైఎస్ ప్రమీలమ్మ, మదనపల్లె మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థిగా జింక చలపతి ఉన్నారు.
నగర పంచాయతీ అభ్యర్థులు వీరే :
అలాగే నగర పంచాయతీ అభ్యర్ధులను కూడా వైసీపీ విడుదల చేసింది. ఏలేశ్వరం నగర పంచాయతీ అభ్యర్థిగా బదిరెడ్డి ఆశా లత, ఉయ్యూరు నగర పంచాయతీ అభ్యర్థిగా పైడముక్కల దివ్య, గురజాల నగర పంచాయతీ అభ్యర్థిగా పోలు వీరారెడ్డి, కనిగిరి నగర పంచాయతీ అభ్యర్థిగా పులి శాంతిరెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభ్యర్థిగా షేక్ షకీలా బేగం, కమలాపురం నగర పంచాయతీ అభ్యర్థిగా మార్జుల కవిత పేర్లను ఎంపిక చేస్తూ జాబితాను విడుదల చేశారు. దీంతో దీంతో తొలి జాబితాలో జరబోయే కార్పోరేషన్లు మునిసిపాలిటీలు నగర పంచాయతీలకు సంబంధించి వైసీపీ ఇప్పటికి 27 మంది అభ్యర్ధులతో మొదటి జాబితా రిలీజ్ చేసినట్లు అయింది.
నామినేషన్ల కోసమే :
వైసీపీ తరఫున అభ్యర్ధులు అంతా మొదటి రోజునే నామినేషన్లు వేయాలని వైసీపీ భావిస్తోంది. ఈ నెల 16 నుంచి నామినేషన్ల దాఖలు ప్రక్రియ మొదలవుతోంది. ఈ నెల 18 చివరి తేదీ. చివరి గడువు వరకూ వేచి ఉండకుండా ముందే నామినేషన్లు దాఖలు చేస్తే ప్రచారానికి ఎక్కువ సమయం ఉంటుందని ఇబ్బందులు కూడా రాకుండా ఉంటాయని వైసీపీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే తొందరగా లిస్ట్ ఫైనలైజ్ చేసి రిలీజ్ చేస్తోంది అని అంటున్నారు.
