Begin typing your search above and press return to search.

గెలుపు మంత్రం: వైరాలు బ‌లాదూర్‌.. !

చిత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ప‌లు జిల్లాల్లో వైసీపీ నాయ‌కులు, టీడీపీ నేత‌లు చేతులు క‌లిపార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి.

By:  Garuda Media   |   20 Oct 2026 11:33 AM IST
గెలుపు మంత్రం: వైరాలు బ‌లాదూర్‌.. !
X

వైసీపీ అంటే టీడీపీకి ప‌డ‌దు.. టీడీపీ పొడ కూడా వైసీపీకి గిట్ట‌దు!. ఇది గ‌త 12 సంవ‌త్స‌రాలుగా అంద‌రూ చూస్తున్న దే. అంద‌రికీ తెలిసిందే. కానీ.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే.. ఇదిపూర్తిగా మారిపోతున్న ప‌రిస్థితి నెల కొంది. పైస్థాయిలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు, వైసీపీ అధినేత జ‌గ‌న్‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటు న్నారు.నిప్పులు చెరుక్కుంటున్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఈ రెండు పార్టీల నాయ‌కుల మ‌ధ్య ఇంత వివాదం ఉందా? అంటే ప్ర‌శ్నార్థ‌క‌మే. ఎందుకంటే.. స్థానికంగా గెలుపు గుర్రం ఎక్కేందుకు.. ఒక‌రినొక‌రు సాయం చేసుకుం టున్నార‌ట‌.

చిత్రంగానే ఉన్న‌ప్ప‌టికీ.. ప‌లు జిల్లాల్లో వైసీపీ నాయ‌కులు, టీడీపీ నేత‌లు చేతులు క‌లిపార‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌స్తున్నాయి. ఎవ‌రికి వారు త‌మ త‌మ పార్టీల్లోనే ఉన్న‌ప్ప‌టికీ.. వేర్వేరు కార‌ణాల‌తో చేతులు క‌లుపుకొంటున్నారు. తాము గెలుపు గుర్రం ఎక్కుతామ‌ని అంచ‌నా వేసుకున్న నాయ‌కులు కూడా ప్ర‌త్య‌ర్థుల‌తో క‌లిసి ప‌నిచేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో నామినేషన్ల దాఖలు ప్రక్రియ సందర్భంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు, నేతలు ఒకరినొకరు ఆలింగనం చేసుకోవ‌డం.. ప‌క్క‌ప‌క్క‌నే కూర్చుని నామినేష‌న్లు వేయ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

అంతేకాదు.. ఎంతో స్నేహపూర్వక వాతావారణంలో కలిసిపోయిన దృశ్యాలు ప‌లుజిల్లాల్లో క‌నిపించాయి. సాధార ణంగా ఎన్నికల వేళ రెండు పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొనే రాయలసీమ ప్రాంతం స‌హా తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర‌లోనూ రాజకీయ ప‌రిస్థితి మారిపోయింది. తమ‌కు పెద్ద‌గా ఎడ్జ్ లేద‌ని భావిస్తున్న కొంద‌రు వైసీపీ నాయ‌కులు అధిష్టానం ద‌గ్గ‌ర విమ‌ర్శ‌లు ఎదుర్కొనేందుకు అవ‌కాశం ఇవ్వ‌కుండా పోటీ అయితే చేస్తున్నారు. కానీ.. వీరి ప‌రిస్థితి ఎలానూ తెలిసిపోయింది కాబ‌ట్టి.. టీడీపీనేత‌ల‌తో స‌ఖ్య‌త‌గా ఉంటున్నార‌ట‌.

త‌ద్వారా ఎలానూ త‌మ‌కు గెలుపు ద‌క్క‌దు కాబ‌ట్టి.. గెలిచే వారికి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 12-15 మునిసిప‌ల్ చైర్మ‌న్ స్థానాల్లో చేతులు క‌లిపార‌న్న‌ది బ‌హిరంగ ర‌హ‌స్యం అయితే.. దీనిని ఇటు టీడీపీ కానీ.. అటు వైసీపీ కానీ.. ఖండించ‌డం లేదు. అయితే.. స్థానికంగా ప్ర‌జ‌లు మాత్రం విస్మ‌యం వ్య‌క్తం చేస్తున్నారు. రాజ‌కీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు.. శాశ్వ‌త మిత్రులు ఉండ‌రు కాబ‌ట్టి.. నాయ‌కులు చేతులు క‌లిపార‌ని అనుకున్నా.. దీనివెనుక వ్యాపార ప్ర‌యోజ‌నాలు.. లావాదేవీలు కూడా భారీగానే ఉన్నాయ‌న్న‌ది ప‌రిశీల‌కులు చెబుతున్న మాట‌.