సైలెంటుగా చక్కబెడుతున్న లోకేశ్.. లోకల్ పోల్స్ కు పక్కా స్కెచ్!
స్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు వంద శాతం స్ట్రైక్ రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
By: Tupaki Political Desk | 24 Sept 2026 2:00 PM ISTస్థానిక ఎన్నికలకు కూటమి ప్రభుత్వం పకడ్బందీగా వ్యూహరచన చేస్తోంది. కూటమిలోని టీడీపీ, జనసేన పార్టీలు వంద శాతం స్ట్రైక్ రేటు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఇందులోభాగంగా ఆయా పార్టీల అగ్రనేతలు ఇప్పటికే కేడర్ కు దిశానిర్దేశం చేస్తున్నారు. వచ్చే నెలలో ఎన్నికల ప్రక్రియ మొదలు అవుతుందని నాయకులు అంతా సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. మరోవైపు రెండు పార్టీల ముఖ్యనేతలు క్షేత్రస్థాయిలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా టీడీపీ తరఫున మంత్రి లోకేశ్ నెల రోజుల నుంచి స్థానిక ఎన్నికలపై దృష్టి పెట్టారని అంటున్నారు. అటు ఉత్తరాంధ్ర నుంచి ఇటు రాయలసీమ వరకు వరుసగా జిల్లాల పర్యటనకు వెళుతూ ఎన్నికల వ్యూహరచన చేస్తున్నారని చెబుతున్నారు. ఇక జనసేనాని పవన్ కూడా రెండు రోజుల క్రితం కాకినాడలో జనసేన సన్నాహక సమావేశం నిర్వహించి స్థానిక శంఖారావం పూరించారని అంటున్నారు.
ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల్లో నూటికి నూరు శాతం స్ట్రైక్ రేటు సాధించాల్సిందేనని టీడీపీ టార్గెట్ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈ బాధ్యతను యువనేత, పార్టీ వర్కింగు ప్రెసిడెంటు లోకేష్ కు అప్పగించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించి గత సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి ఘన విజయాన్నందించిన మంత్రి లోకేష్ స్థానిక ఎన్నికల బాధ్యతలను భుజాన వేసుకోవాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని యువత, మహిళలు, రైతులతో పాటు ఇతర ముఖ్యమైన వర్గాలను లోకేష్ ఆకట్టుకో గలిగినట్టు పార్టీ లోని సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. యువగళం సమయంలో వారితో మమేకమై పేరుపేరునా పలకరించగలిగే చనువు కూడా యువ నాయకుడు పెంచుకున్నారని సీనియర్లు అంటున్నారు. ఆయన చొరవ వల్ల యువత, నిరుద్యోగ ఓటర్లు పార్టీ కి బాగా దగ్గరయ్యారని చెబుతున్నారు.
ఈ రకంగా పార్టీ అభివృద్ధితో బాటు, కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి లోకేశ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా పార్టీ భవిష్యత్తు సారధిగా స్థానిక ఎన్నికలకు ఆయన సారథ్యం వహించాలని పార్టీ కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రజలతో సత్సంబంధాలు, నాయకుల మధ్య సమన్వయానికి ఈ ఎన్నికలు చక్కని అవకాశంగా భావించాలని లోకేశ్ కు సూచిస్తున్నారని అంటున్నారు. దీంతో యువనేత కూడ నెల రోజుల నుంచి ఈ పనిపైనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారని చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి మొదలుపెట్టిన యువనేత పర్యటన వరుసగా ఉత్తరాంధ్ర, కోస్తా మీదుగా ప్రస్తుతం రాయలసీమకు చేరుకుందని అంటున్నారు. ప్రతివారం ఏదో ఒక నియోజకవర్గంలో పర్యటించేలా ఇప్పటివరకు కార్యక్రమాలు చేపట్టిన యువనేత రానున్న నెల రోజుల్లో మరింత వేగం పెంచాలని భావిస్తున్నారని అంటున్నారు. దీంతో వచ్చేనెల మొదటి రెండు వారాల్లో మరిన్ని పర్యటనలకు ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు.
ఇక జిల్లాల పర్యటనకు వస్తున్న మంత్రి లోకేశ్ దృష్టిని ఆకట్టుకునేందుకు పార్టీ కేడర్ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉండటంతో ఎన్నికఅధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకునేందుకు ప్రాధాన్యం ఇస్తుందని అంటున్నారు. ల్లో విజయంపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తున్న కేడర్ తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మిత్రపక్షాలతో చర్చలు జరగనందున యువనేత ఏ విషయం చెప్పకుండానే పర్యటనలు ముగిస్తున్నారని అంటున్నారు. కానీ, యువనేతకు తమ ఆలోచన తెలియజేశామన్న ఆనందం కేడర్ లో కనిపిస్తోందని చెబుతున్నారు. ఇక ఈ పర్యటనల వల్ల స్థానిక ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టిన టీడీపీ అగ్రనాయకత్వం ఎక్కడైనా సమస్యలు గుర్తిస్తే వెంటనే పరిష్కరించుకుంటుందని చెబుతున్నారు.
