Begin typing your search above and press return to search.

స్థానిక ఎన్నికల మీద బిగ్ అప్ డేట్ !

ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 34 శాతం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి గుర్తు చేశారు.

By:  Satya P   |   4 Oct 2026 9:54 AM IST
స్థానిక ఎన్నికల మీద బిగ్ అప్ డేట్ !
X

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల మీద బిగ్ అప్ డేట్ ఇది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ అన్నది ఇంకా మొదలు కాలేదు కానీ రాజకీయ సందడి అయితే స్టార్ట్ అయిపోయింది. అంతే కాదు పంచాయతీల నుంచి మేయర్ సీటు దాకా హీట్ పుట్టిస్తోంది. ఆశావహులు రేసులో క్యూ కడుతున్నారు. రేపో మాపో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికల ప్రక్రియను ఎపుడైనా ప్రారంభించేందుకు రెడీ అని స్పష్టం చేస్తోంది. ఈ నేపధ్యంలో పురపాలక,పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ లోకల్ బాడీ ఎన్నికల మీద బిగ్ అప్ డేట్ ఇచ్చారు. దాంతో స్థానిక ఎన్నికల గురించి ఇప్పుడు సరికొత్త చర్చకు ఆస్కారం ఏర్పడినట్లు అయింది.

తీర్పు వచ్చేంతవరకూ :

ఇదిలా ఉంటే మున్సిపల్ ఎన్నికలలో బీసీలకు 34 శాతం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల ఈ విషయం మీద సుప్రీం తీర్పు వచ్చేవరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాకుండా నిలుపుదల చేయనున్నట్లుగా ఆయన వెల్లడించడం విశేషం. ఏపీలో ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చెశారు. అందుకే దీనికోసం సుప్రీంకోర్టును సైతం కోరనున్నట్లు తెలిపారు. వైసీపీ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. స్థానిక ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా ఇప్పటికీ అడ్డుకుంటుందని ఆరోపించారు. అయినా సరే కూటమి తన వంతు ప్రయత్నాలు గట్టిగా చేస్తోందని చెప్పారు.

అనుభవం లేని సీఎం :

జగన్ మీద కూడా మంత్రి నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరిపాలన ఎలా చేయాలో తెలియని వారు గత ప్రభుత్వంలో సీఎం అయ్యారని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. ఏ మాత్రం అవగాహన లేకుండా తీసుకున్న అనేకమైన నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ సహా అన్ని వ్యవస్థలు గత అయిదేళ్ళూ తీవ్రంగా దెబ్బతిన్నాయని నారాయణ నిందించారు. ఎపుడైతే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆనాటి నుంచే భవన నిర్మాణ రంగంలో అనేక సంస్కరణలు తెచ్చామని గుర్తు చేశారు. ఇప్పటికే భవన నిర్మాణ రంగానికి ఊతమిచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నట్లుగా మంత్రి వివరించారు. రాష్ట్రం అమలు చేసిన సంస్కరణల వల్ల కేంద్రం నుంచి రాష్ట్రానికి 800 కోట్ల రూపాయలు నిధులు వచ్చాయని నారాయణ తెలిపారు ఎవరైనా సరే ఆన్ లైన్ లో దరఖాస్తు పెడితే చాలు ఇరవై నాలుగు లేఅవుట్ బిల్డింగ్ లకు అనుమతులిస్తామని ఆయన చెప్పారు.

టాప్ ఫైవ్ లో ఒకటిగా :

ఇదిలా ఉంటే ప్రపంచంలో టాప్ ఫైవ్ రాజధానులలో ఒకదానిగా నిర్మించేలా అమరావతిని ప్రారంభించామని ఆయన చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అయితే మళ్ళీ అక్కడ వర్క్ స్టార్ట్ చేసిందని ఫలితంగా 2028 చివరి నాటికి అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు పూర్తి చేస్తారన్న నమ్మకాన్ని మంత్రి వ్యక్తం చేయడం విశేషం. ఇదిలా ఉంటే ఏపీలో స్థానిక సంస్థలు ఎపుడు జరుగుతాయని అంటే సుప్రీంకోర్టు తీర్పు తరువాతనే స్పష్టమవుతోంది.