Begin typing your search above and press return to search.

కాదేదీ ప్ర‌చారానిక‌న‌ర్హం.. త‌మ్ముళ్లే ఫ‌స్ట్‌.. !

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంత ఎక్కువ మందిని ఆక‌ర్షించ‌గ‌లిగితే అంత ఎక్కువ‌గా ఓట్లు రాలుతాయి!. ఎంత ఎక్కు వ మందిని మ‌చ్చిక చేసుకుంటే అన్ని ఓట్లు సొంతం అవుతాయి.

By:  Garuda Media   |   21 Oct 2026 9:00 PM IST
కాదేదీ ప్ర‌చారానిక‌న‌ర్హం.. త‌మ్ముళ్లే ఫ‌స్ట్‌.. !
X

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎంత ఎక్కువ మందిని ఆక‌ర్షించ‌గ‌లిగితే అంత ఎక్కువ‌గా ఓట్లు రాలుతాయి!. ఎంత ఎక్కు వ మందిని మ‌చ్చిక చేసుకుంటే అన్ని ఓట్లు సొంతం అవుతాయి. ఈ క్ర‌మంలో ప్ర‌చారానికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. ప్ర‌స్తుతం రెండు ర‌కాల ఎన్నిక‌లు రాష్ట్రంలో జ‌రుగుతున్నాయి. 1) స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరే ష‌న్లు అయితే.. 2) జిల్లా, మండ‌ల ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌కు కూడా గంట కొట్టేశారు. ఈ నేప‌థ్యంలో గెలుపు గుర్రం ఎక్కా లనుకునే నాయ‌కులు పెద్ద ఎత్తున ప్ర‌చార‌ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తున్నారు.

అయితే.. సంప్ర‌దాయ ప్ర‌చారానికి తోడు తాజాగా అందుబాటులోకి వ‌చ్చిన సాంకేతిక‌త‌ను కూడా విరివిగా వినియో గించుకునే ప్ర‌య‌త్నంలో నాయ‌కులు ఉన్నారు. ప్ర‌స్తుతం అంద‌రికీ చేతిలో అందుబాటులో ఉన్న వ్య‌వ‌స్థ ఆర్టిఫి షియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తోపాటు చాట్ జీపీటీ వంటి సాధనాలు. వీటికితోడు యూట్యూబ్‌, ఫేస్ బుక్‌, ఎక్స్‌, ఇన్ స్టా రీల్స్ వంటివి కూడా.. ప‌ని చేస్తున్నాయి. వీటిలో యువ‌త‌ను ఎక్కువ‌గా ఆక‌ర్షిస్తున్న‌ది యూట్యూబ్‌, ఏఐ అనే లెక్క ఉంది. దీంతో నాయ‌కులు వీటిని ఎక్కువ‌గా ఆశ్ర‌యిస్తున్నారు.

భ‌లే డిమాండ్‌..

ఏఐ వీడియోలు, చాట్స్‌, లేబుల్స్‌.. ఇలా రూపొందించేవారికి ఇప్పుడు భ‌లే డిమాండ్ ఏర్ప‌డింది. ప్ర‌తి కార్పొరేట‌ర్ అభ్య‌ర్థీ.. కూడా వీటిని ఆశ్ర‌యిస్తున్నారు. ఇక‌, జిల్లా, మండ‌ల స్థాయిలో పోటీ చేస్తున్న నాయ‌కులు కూడా అధునాత న ప్ర‌చారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో అత్యంత ఆక‌ర్ష‌ణీయంగా వీడియోలు, షార్ట్స్ రూపొందించి.. వాటిని ప్ర‌చారం చేసే వారికి ప్రాధాన్యం పెరిగింది. ఇక్క‌డ అభ్య‌ర్థుల‌కు కావాల్సింది.. ప్ర‌చారం అది ఏ రూపంలో ఉన్నా స‌రే. త‌మ గెలుపు ఎక్క‌డా త‌ప్ప‌కూడ‌దు. ఇదే సూత్రాన్ని అంద‌రూ పాటిస్తున్నారు.

ఐటీలో మేటి..

టీడీపీ ఐటీ విభాగం ఈ విష‌యంలో మేటిగా ప‌నిచేస్తోంది. ప్ర‌త్యేకంగా జిల్లాల వారీగా పార్టీ కేంద్ర కార్యాల‌యంలో డెస్కులు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఆయా జిల్లాల‌కు చెందిన అభ్య‌ర్థుల‌కు ప్ర‌చారంలో సాయం చేస్తున్నారు. అయితే.. సంఖ్యా బ‌లం ఎక్కువ‌గా ఉన్న నేప‌థ్యంలో ఈ సేవ‌లు ప‌రిమితం అవుతున్నాయి. దీంతో ఎక్కువ మంది నాయ‌కులు సొంత ఖ‌ర్చుతోనే ఈ త‌ర‌హా ప్ర‌చారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న‌వారు.. ఆక‌ర్ష‌ణీయంగా ప్ర‌చారం చేయ‌గ‌లిగే వారిని ఎంపిక చేసుకుని.. నియ‌మించుకుంటున్నారు. ఇక‌, వైసీపీ విష‌యానికి వ‌స్తే.. ఈ త‌ర‌హా ప్ర‌చారంపై ఇంకా దృష్టి పెట్ట‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.