Begin typing your search above and press return to search.

ఏపీ ప‌ల్లె పోరు.. జెండాలు కాదు.. అజెండాలే కీల‌కం.. !

ఏపీలో 13,354 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నవంబర్ 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల చేసి, నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ జరపనున్నారు. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగకపోయినా, గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ కూటమి, వైసీపీ మధ్య రాజకీయ పోరు ఆసక్తికరంగా మారనుంది.

By:  Garuda Media   |   10 Nov 2026 6:00 AM IST
ఏపీ ప‌ల్లె పోరు.. జెండాలు కాదు.. అజెండాలే కీల‌కం.. !
X

రాష్ట్రంలో తాజాగా జ‌రిగిన స్థానిక మునిసిపాలిటీలు, కార్పొరేష‌న్లు, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్ ఎన్నికల ఫలితాల త‌ర్వా త‌.. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో రాజ‌కీయాలు వేడెక్కాయి. రాష్ట్రంలోని మొత్తం 13,354 గ్రామ పంచాయతీలకు మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 13, 16, 19 తేదీల్లో నోటిఫికేషన్లు విడుదల కానుండగా, నవంబర్ 26, 29, డిసెంబర్ 2 తేదీల్లో పోలింగ్ జరగనుంది. మూడున ఓట్ల లెక్కింపు.. అదే రోజు ఫ‌లితం విడుద‌ల కానుంది.

చిత్రం ఏంటంటే.. ఈ ఎన్నిక‌లు పార్టీల జెండాల‌పై జ‌ర‌గ‌వు. పార్టీల గుర్తుల‌పైనా జ‌ర‌గ‌వు. కానీ, అన్ని పార్టీల ప్ర‌భా వం మాత్రం స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. స్థానికం స‌హా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో బ‌ల‌మైన గెలుపు ద‌క్కించుకున్న కూట‌మి పార్టీలు.. ఇప్పుడు గ్రామీణ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ త‌మ స‌త్తాను చాటుకునేందుకుప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామీణ రాజకీయాల తీరుతెన్నులపై ఇప్ప‌టికే ప్ర‌ధాన పార్టీలు దృష్టి పెట్టాయి. కూటమి తాజాగా ద‌క్కించుకున్న‌ భారీ విజయాన్ని కొన‌సాగించాల‌న్న క‌సితో ఉండ‌డం గ‌మ‌నార్హం.

అయితే.. వైసీపీ కూడా.. ఈ ఎన్నిక‌ల్లో వ‌చ్చిన ప‌రాజ‌యాన్ని అధిగ‌మించ‌డంతోపాటు.. గ‌త ఎన్నిక‌ల్లో త‌మ‌కు ద‌క్కిన గ్రామీణ ఓటు బ్యాంకును సుస్థిరంగా కాపాడుకునే ప్ర‌య‌త్నంలో ఉండ‌డం విశేషం. 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలోన‌గ‌రాలు ప‌ట్ట‌ణాల్లో కంటే కూడా.. గ్రామీణ ప్రాంతాల్లోనే వైసీపీ బ‌ల‌మైన ఓటు బ్యాంకును సొంతం చేసుకుంది. ఈ కార‌ణంగానే.. పార్టీ 40 శాతం ఓటుబ్యాంకును ద‌క్కించుకునేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. ఇప్పుడు కూడా అదే హ‌వా సాగించేలా వ్యూహాత్మ‌క ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గ్రామీణ స్థాయిలో తన పట్టును నిలుపుకోవడానికి వైయస్సార్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. స్థానిక బలగాలను సమీకరించుకుని పంచాయతీలను దక్కించుకోవడానికి ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. గ్రామీణ పంచాయతీ ఎన్నికలు అధికారికంగా రాజకీయ పార్టీల గుర్తులతో జరగవు. అయినప్పటికీ, క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఏ పార్టీకి చెందినవారనే అంశంపైనే ప్రధానంగా పోటీ నడుస్తుంది. ప్రధాన పార్టీలైన టీడీపీ కూటమి, వైయస్సార్సీపీ బలపరిచిన అభ్యర్థుల మధ్యే ప్రధాన పోరు ఉండ నుంది.

ప్ర‌భావాలు ఎలా..?

ప్ర‌స్తుతం గెలిచిన స్థానిక అభ్య‌ర్థులు, మండ‌ల ప‌రిష‌త్ ఫ‌లితాలు వంటివి గ్రామాల్లోనూ ప్ర‌భావితం అవుతాయ‌ని అంటున్నారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలు కూడా కూట‌మికి అనుకూలంగా మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ముఖ్యంగా 4 వేల రూపాయ‌ల పింఛ‌ను స‌హా.. గ్రామీణ ప్రాంతాల్లో జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌, ర‌హ‌దారుల నిర్మాణం, రైతుల‌కు చేస్తున్న మేలు, సౌర విద్యుత్ స‌ర‌ఫ‌రా వంటి కీల‌క అంశాలు ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌భావితం చేయొచ్చ‌ని చెబుతున్నారు.