Begin typing your search above and press return to search.

బ్రేకింగ్... మద్యం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం నమోదు చేసుకుంది.

By:  Raja Ch   |   17 Jan 2026 10:21 AM IST
బ్రేకింగ్... మద్యం కేసులో విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు!
X

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సంచలనంగా మారిన లిక్కర్ స్కామ్ కేసులో మరో సంచలనం నమోదు చేసుకుంది. ఇందులో భాగంగా.. మద్యం కుంభకోణం కేసులో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో ఈ కేసు వ్యవహారం మరోసారి సంచలనంగా మారింది. వాట్ నెక్స్ట్ అనేది మరింత ఆసక్తిగా మారింది.

అవును... వైసీపీ ప్రభుత్వ హయాంలోని లిక్కర్ వ్యవహారానికి సంబంధించిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. గతంలో వైసీపీలో నెంబర్ 2 స్థానంలో ఉన్నారనే పేరు సంపాదించుకున్న విజయసాయిరెడ్డికి తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు జారీ చేసింది. జనవరి 22న విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది.

కాగా... వైసీపీ అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న అదాన్‌ డిస్టిలరీస్, ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, లీలా డిస్టిలరీస్‌ సంస్థలు రాజ్‌ కెసిరెడ్డి(ఏ-1), ముప్పిడి అవినాష్‌ రెడ్డి (ఏ-7)ల నియంత్రణ, పర్యవేక్షణలో ఉండేవని.. ఈ మూడు సంస్థలు కలిపి మొత్తం రూ.78 కోట్లను అనిల్‌ చోఖ్రాకు సంబంధించిన డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించాయని సిట్ గుర్తించినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

ఇదే సమయంలో.. రెండో దశలో ఆ నిధులు మరో 32 డొల్ల కంపెనీల ఖాతాల్లోకి మళ్లించారని.. అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఆ సొత్తు వైసీపీకి చెందినవారికి.. వారి నుంచి అప్పటి ప్రభుత్వ పెద్దలకు చేర్చేవారని.. ఎక్కడా ఆడిట్‌ కు దొరక్కుండా బహుళ అంచెల్లో నిధుల మళ్లింపునకు పాల్పడ్డార అని సిట్‌ గుర్తించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా విజయసాయిరెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం ఆసక్తిగా మారింది.