లిక్కర్ కేసు: తెరవెనుక ఇంత జరుగుతోందా ..!
వైసిపి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం అవుతుంది.
By: Garuda Media | 18 Sept 2025 9:00 PM ISTవైసిపి హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి దాదాపు సంవత్సరం అవుతుంది. ఈ కోణంలో అనేక మందిపై కేసు నమోదు చేశారు. 42 మందిని నిందితులుగా పేర్కొన్నారు. అదేవిధంగా చాలామందిని అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం ఎంపీ మిధున్ రెడ్డి జైల్లోనే ఉన్నారు. ఇవన్నీ పైకి కనిపిస్తున్న విషయాలు. అయితే, చిత్రం ఏంటంటే ఈ కేసును సిబిఐకి అప్పగించాలని అదేవిధంగా ఈ కుంభకోణం ద్వారా జరిగిన నిధుల గోల్మాల్ విషయాన్ని ఈడీకి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్నాళ్ల కిందటే నిర్ణయించుకున్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి ఈ డిమాండ్ కొన్నాళ్లుగా మంత్రులు.. పార్టీ నాయకులు మధ్య కూడా వినిపించింది. ఇక వైసిపి విషయానికి వస్తే ఏ దర్యాప్తు చేయించుకున్న తమకు అభ్యంతరం లేదని, ఇప్పటికిప్పుడు జైలుకు తీసుకువెళ్లిన తాను సిద్ధంగా ఉన్నానని వైసీపీ అధినేత జగన్ పదేపదే చెప్పిన విషయం కూడా తెలిసిందే. ఈ పరిణామాల క్రమంలో అసలు సిబిఐకి ఈడికి ఎందుకు ఇవ్వడం లేదు అన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు ఛత్తీస్గడ్ సీఎం భూపేష్ బగల్ కుమారుడి విషయం తాజాగా వెలుగులోకి రావడంతో అక్కడ ఏం జరుగుతుందన్నది ఏపీ ప్రభుత్వం ఆరా తీసింది.
చత్తీస్గడ్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారానే లిక్కర్ ని విక్రయించింది. అయితే, ఈ క్రమంలో సుమారు 2000 కోట్ల రూపాయల వరకు అక్రమాలు చోటు చేసుకున్నాయని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం దీనిపై సిబిఐ దర్యాప్తు చేయిస్తోంది. ఇటీవల భూపేష్ కుమారుడిని కూడా అరెస్ట్ చేశారు. అంటే, బిజెపి పాలిత రాష్ట్రంలో చోటు చేసుకున్న లిక్కర్ కుంభకోణం పై అక్కడి బిజెపి నాయకుల విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన సిబిఐ, ఈడి విచారణ చేస్తూ అరెస్టులు కూడా సాగిస్తున్నాయి.
మరి ఏపీ విషయానికి వస్తే వైసీపీ విషయంలో ఎందుకని ఇలా చేస్తున్నారు.. ఎందుకని కనీసం సిబిఐ ఈడి విచారణలో కూడా పట్టించుకోవడం లేదు. అనేది చర్చనీయాంశంగానే కాదు ఆసక్తిగాను మారింది. దీనికి ప్రధాన కారణం జగన్‌తో బిజెపి నాయకులకు ఉన్న సంబంధాలు. ముఖ్యంగా ప్రధానమంత్రి, అదే విధంగా హోం మంత్రి శాఖ మంత్రి రక్షణ శాఖ మంత్రి వంటి పెద్ద నాయకులతో జగన్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. దీంతో వారు దాదాపు 7 నెలల కిందటే సిబిఐ ఈడి విచారణలకు ఒప్పుకోలేదని తాజాగా ఆంగ్ల దినపత్రిక ఒకటి రాసుకువచ్చింది.
సిబిఐ, ఈడి రాకపోవడానికి ప్రధాన కారణం కేంద్రం ఒప్పుకోకపోవడమేనని ఈ పత్రిక కథను స్పష్టం చేసింది. దీనిని బట్టి ఈ కేసులో సిబిఐ, ఈడి దర్యాప్తు ఇకపై ఉండబోదు. కేవలం రాష్ట్రంలో మాత్రమే అధికారులు దర్యాప్తు సాగించి విచారణను తేల్చాల్సి ఉంటుంది. మరోవైపు జగన్ జోలికి పోకుండా కూడా ఎవరో అడ్డుపడుతున్నారన్న చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలో తెరవనుక రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో కూడా ఈ కేసు విషయంపై ఏదో జరుగుతుందన్న చర్చకు బలం చేకూరుతోంది. మరి ఇది ఎప్పటికీ తేలుతుంది ఎన్నాళ్లు పడుతుంది. అంతిమ ల లబ్ధిదారు ఎవరు అనే విషయాలు తేలాలంటే మరింత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తానికి సిబిఐ ఈడి విచారణలు జరగకపోవడానికి కారణం కేంద్రమేనని తాజాగా వెలుగు చూసిన విషయం.
