తెలుగు డయాస్పోరాలో సంచలన విషయాలు వెల్లడించిన చంద్రబాబు, లోకేష్!
అవును... స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న చంద్రబాబు, లోకేష్ జ్యూరిక్ లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు.
By: Raja Ch | 20 Jan 2026 12:35 AM ISTస్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్.. జ్యూరిక్ లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ హయాంలో ఏపీకి వచ్చిన పెట్టుబడులపై అటు సీఎం చంద్రబాబు, ఇటు మంత్రి లోకేష్ పలు కీలక విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా... భారత్ కు వచ్చే పెట్టుబడుల్లో.. ఒక్క ఏపీకే 25 శాతం వస్తున్నాయని చంద్రబాబు చెప్పగా.. ఏడాదిన్నరలో ఏపీకి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లోకేష్ అన్నారు.
అవును... స్విట్జర్లాండ్ లో పర్యటిస్తున్న చంద్రబాబు, లోకేష్ జ్యూరిక్ లో తెలుగు డయాస్పోరాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన లోకేష్... ఈ కార్యక్రమానికి 20 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారని.. ఈ సమావేశం కూటమి ప్రభుత్వానికి అదృష్టం లాంటిదని అన్నారు. ఈ నేపథ్యంలోనే.. ఏడాదిన్నరలో ఏపీకి రూ.23.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని.. తద్వారా 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు వస్తాయని తెలిపారు.
అనంతరం ప్రసంగించిన సీఎం చంద్రబాబు.. తాను 1995 నుంచి జ్యూరిక్ కు వస్తున్నట్లు తెలిపారు. అప్పట్లో తెలుగు వాళ్లు చాలా తక్కువ మంది ఉండేవారని.. అయితే ఇప్పుడు ఇక్కడున్నవారిని చూస్తుంటే తెలుగు ప్రాంతంలో ఉన్నట్లు ఉందని అన్నారు. స్విట్జర్లాండ్, ఐర్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఇటలీ, డెన్మార్క్, ఫిన్ లాండ్ లో వేలమంది తెలుగువాళ్లు ఉన్నారని.. ఇక్కడి ఎన్.ఆర్.టీలో దాదాపు రెండు లక్షల మంది సభ్యులు ఉన్నారని.. అన్ని దేశాల్లో కలిపి 400 తెలుగు సంఘాలు ఉన్నాయని వెల్లడించారు.
ఇదే సమయంలో... తాను 1995లోనే ఐటీ గురించి ఆలోచిస్తే.. అప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని.. అయితే తాను అవేమీ పట్టించుకోకుండా ఐటీని ప్రమోట్ చేయడం వల్లే ఇప్పుడు 195 దేశాల్లో తెలుగు వాళ్లు ఉన్నారని చెప్పిన చంద్రబాబు... 2028 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందని.. 18 నెలల్లో ఏపీని నంబర్ వన్ బ్రాండ్ గా మార్చామని.. 25 కొత్త పాలసీలు తేవడంతో భారత్ కు వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఏపీకే వస్తున్నాయని చంద్రబాబు అన్నారు.
అంతకంటే ముందు... సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగరత్నం, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగాను చంద్రబాబు కలిశారు. ఈ సందర్భంగా... వివిధ అంశాలపై బాబు వారితో చర్చించారు. ఇదే క్రమంలో... స్విట్జర్లాండ్ లో అక్కడి భారత రాయబారి మృదుల్ కుమార్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. ఏపీ పాలసీల గురించి వివరించి, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా సహకరించాలని ఆయనను కోరారు.
