యూరప్ పారిశ్రామిక వేత్తలు ఘటికులు.. వారిని బాబు ఎలా ఒప్పించారంటే!
ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో గురువారం నిర్వహించిన యూరప్ బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్‌టేబుల్ సమావేశంలో బాబు వారిని ఒప్పించేందుకు ఒకింత కష్టపడ్డారనే చెప్పాలి.
By: Garuda Media | 14 Nov 2025 12:00 AM ISTప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో యూరప్ కంట్రీలు ముందు వరుసలో ఉన్నాయి. విద్య, పారిశ్రా మికీకరణ, సాంకేతికంగా కూడా యూరప్ దేశాలు ముందున్నాయి. ఈ క్రమంలో అక్కడివారిని ఒప్పించి.. ఏపీలో పెట్టుబడులు పెట్టించాలన్నది సీఎం చంద్రబాబు వ్యూహం. ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో గురువారం నిర్వహించిన యూరప్ బిజినెస్ పార్ట్‌నర్‌షిప్ రౌండ్‌టేబుల్ సమావేశంలో బాబు వారిని ఒప్పించేందుకు ఒకింత కష్టపడ్డారనే చెప్పాలి.
యూరప్ నుంచి పలువురు పారిశ్రామిక వేత్తలు విశాఖకు వచ్చారు. ఈ సందర్భంగా ఓ ఈయూ ప్రతినిధి మైకందుకుని ఏపీలో పెట్టుబడులు ఎందుకు పెట్టాలని ప్రశ్నించారు. "మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే ఈయూ కంపెనీల క్లస్టర్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి మేం ఎందుకు రావాలి? మీరు ఏం చెబుతారు?`` అని సీఎం చంద్రబాబును ఆయన ప్రశ్నించారు. అంతేకాదు.. ఇప్పటికే డెవలప్ అయిన మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలు ఉన్నాయన్నారు.
నిజానికి ఈ ప్రశ్న వెనుక చాలానే అర్ధం ఉంది. రాష్ట్రానికి రాజధాని నగరం నిర్మాణంలో ఉండడం.. పెట్టు బడులు ఇప్పుడిప్పుడే వస్తుండడం వంటివి కారణాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు డెవలప్ అయి న.. రాష్ట్రాలనుకాకుండా.. ఏపీలో పెట్టుబడులు పెడితే ఒనగూరే ప్రయోజనం ఏంటన్నది చాలా మంది ప్రశ్న. దీనికి సీఎం చంద్రబాబు చాలా సుదీర్ఘంగా సమాధానం చెప్పారు. దేశంలో రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడాలన్నది తన సిద్ధాంతమని పేర్కొన్నారు.
గతంలో కూడా తాను ఇలాగే పోటీ పడేవాడినని పేర్కొన్న చంద్రబాబు ఒకప్పుడు, బెంగళూరు దేశానికి ఐటీ రాజధానిగా ఉండేదని.. తర్వాత హైదరాబాద్‌కు ఐటీని తీసుకురావడానికి ప్రయత్నించి సక్సెస్ అయిన ట్టు వివరించారు. ఇప్పుడు హైదరాబాద్‌కు ఐటీ ద్వారానే ఆదాయం చేకూరుతోందన్నారు. కలిసి పనిచే యడం.. ఉత్సాహ పూరితమైన పోటీ వాతావరణ ఉండాలన్నదే తన అభిలాషగా చెప్పుకొచ్చారు. అందుకే.. ఏపీ పోటీ తత్వంతో పనిచేస్తోందని బదులిచ్చారు. కేవలం రాయితీలు ఇచ్చి వదిలేయడం కాదని.. నిరంతరం పెట్టుబడి దారులకు అండగా కూడా ఉంటామని చెప్పారు. దీంతో యూరప్ పెట్టుబడి దారులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
