Begin typing your search above and press return to search.

హోం శాఖ మీద మోజు పెరుగుతోందా లేక ?

అన్ని మంత్రిత్వ శాఖలలో పవర్ ఫుల్ శాఖ హోం శాఖ. ఎందుకంటే అందరి మంత్రులకూ ప్రోటోకాల్ ప్రకారం పోలీసులు సెల్యూట్ చేస్తారు.

By:  Satya P   |   22 Jun 2026 10:00 AM IST
హోం శాఖ మీద మోజు పెరుగుతోందా లేక ?
X

అన్ని మంత్రిత్వ శాఖలలో పవర్ ఫుల్ శాఖ హోం శాఖ. ఎందుకంటే అందరి మంత్రులకూ ప్రోటోకాల్ ప్రకారం పోలీసులు సెల్యూట్ చేస్తారు. కానీ మొత్తం పోలీసులే హోం మంత్రి కంట్రోల్ లో ఉంటారు. ఆ మంత్రికి అంతా సెల్యూట్ చేస్తారు. ఇలా అత్యంత శక్తివంతమైన హోం శాఖ ఏపీలో మాత్రం ఎందుకో టార్గెట్ అవుతోంది. తెలంగాణ ఏపీ రెండు రాష్ట్రాలు విడిపోయాక తెలంగాణాలో హోం మంత్రులుగా పనిచేసిన వారు ఎవరైనా ఏపీలో అంత వివాదాలు అయితే లేవు. ఇపుడు ఆ హోం శాఖ ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్దనే ఉంది. ఆయన గత రెండున్నరేళ్ళుగా ఆ శాఖను చూస్తూ వస్తున్నారు.

టఫ్ జాబ్ గానేనా :

ఇక ఏపీలో హోం మంత్రిత్వ శాఖ అయితే టఫ్ జాబ్ అని అంటున్నారు. అది వైసీపీ హయాంలో అయినా లేక టీడీపీ జమానాలో అయినా టఫ్ గానే వ్యవహారం ఉందని విశ్లేషణలు ఉన్నాయి. టీడీపీ 2014 నుంచి 2019 మధ్యలో హోం మంత్రిగా నిమ్మకాయల చినరాజప్ప చేశారు. ఆయన ఆ శాఖాపరంగా సాఫ్ట్ గానే డీల్ చేసినా విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన తన సొంత నియోజకవర్గంలో కానిస్టేబుల్ నే నియమించుకోలేరని విపక్షాలు నాడు సెటైర్లు పేల్చాయి. ఇక వైసీపీ హయాంలో ఇద్దరు మహిళలు ఈ శాఖను నిర్వహించారు. తొలి పర్యాయం మేకతోటి సుచరిత చేస్తే రెండవ పర్యాయంలో తానేటి వనిత ఈ శాఖ చూశారు. అయితే ఆనాడు కూడా హోం మంత్రిత్వ శాఖ మీదనే వెల్లువలా విమర్శలు కూటమి పార్టీల నుంచి వచ్చాయి. లా అండ్ ఆర్డర్ ఏదని కూడా ప్రశ్నలు కూడా గట్టిగా వినిపించాయి.

అదే స్ట్రాటజీతోనేనా :

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళకే హోం మంత్రి పదవిని ఇచ్చి అదే స్ట్రాటజీని కూటమి ప్రభుత్వం అమలుచ్ చేసింది. రెండేళ్ళ కూటమి పాలనలో చూస్తే మంత్రులు అందరి విషయం పక్కన పెడితే హోం మంత్రిత్వ శాఖ మీదనే విమర్శలు వస్తున్నాయి. విపక్షాలు అయితే రెడ్ బుక్ రాజ్యాంగం అని అంటున్నాయి. పైగా హోం మంత్రి పనితీరు బాగాలేదని కూడా నిందిస్తున్నారు. వైసీపీ సంగతి పక్కన పెడితే మిత్ర పక్షం కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చేస్తున్న వ్యాఖ్యలు ఇండైరెక్ట్ గా అయినా తగులుతున్నాయని అంటున్నారు. తాజాగా కాకినాడ సభలో ఆయన చేసిన ఒక వ్యాఖ్య అయితే హోం మంత్రి శాఖ పనితీరు మీద ఇండైరెక్ట్ కామెంట్స్ గానే చూస్తున్నారు. నేను హోం మంత్రిని కాను క్రిమినల్స్ కి అది అదృష్టం అని పవన్ అన్నారు. అంటే ఇపుడు హోం మంత్రిత్వ శాఖ పనితీరు సరిగ్గా లేనట్లేనా అన్న కొత్త చర్చను విపక్షాలు లేవనెత్తుతున్నాయి. గతంలో కూడా కాకినాడ నుంచే పవన్ తాను హోం మంత్రిగా ఉంటే ఇలా ఉండదని స్టేట్మెంట్ ఇచ్చారు.

పోటాపోటీ పాలిటిక్స్ :

దేశంలో ఎక్కడా లేని విధంగా పోటా పోటీగా రాజకీయం ఏపీలో సాగుతోంది. అధికార టీడీపీ కూటమి విపక్ష వైసీపీల మధ్య ఢీ అంటే ఢీ అన్న పరిస్థితి ఉంది. దాంతో మధ్యన పోలీసులే నలుగుతున్నారు. దాంతో పాటు రాజకీయ వేధింపులు అని ఎవరి విపక్షంలో ఉన్నా విమర్శలు కామన్ అయిపోతున్నాయి. నాడు రాజారెడ్డి రాజ్యాంగం అని కూటమి నేతలు అంటే ఈనాడు రెడ్ బుక్ రాజ్యాంగం అని వైసీపీ అంటోంది. దాంతో హోం మంత్రిత్వ శాఖ మీద తీవ్ర ఒత్తిడి ఉంటోంది అని అంటున్నారు.

మార్పు ఉంటే కనుక :

ఇక గతంలో కొంతమంది టీడీపీ సీనియర్లు అయితే తాము హోం మంత్రిత్వ శాఖను తీసుకుంటామని ఉత్సాహపడ్డారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన అచ్చెన్నాయుడు అయితే ఓపెన్ గానే స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు. మరి మంత్రి వర్గ విస్తరణ అంటూ జరిగితే హోం మంత్రిత్వ శాఖను కొత్త వారికి ఇస్తారు అని అంటున్నారు. ఆ శాఖను తీసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు అన్నది అయితే చర్చగా ఉంది. ఎందుకంటే ఈ శాఖకు ఎవరు మంత్రిగా ఉన్నా వారి మీద ఉండే టెన్షన్ మామూలుగా కాదని అంటున్నారు.