Begin typing your search above and press return to search.

జీఎస్టీ వసూళ్ళలో ఏపీ టాప్ గేర్

నిజానికి ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులు అయితే ఇపుడు ఉన్నాయి. అయినా సరే మొక్కవోని దీక్షతో ఏపీ ప్రభుత్వం జీఎస్టీ వసూళ్ళలో టాప్ గేర్ లో నిలవడం అన్నది గ్రేట్ అని అంటున్నారు

By:  Satya P   |   3 Jan 2026 8:00 AM IST
జీఎస్టీ వసూళ్ళలో ఏపీ టాప్ గేర్
X

ఏపీలో ఇపుడు ఆర్ధికంగా సుస్థిరత్వం కనిపిస్తోంది. కీలకమైన విభాగాలలో తీసుకుని వచ్చిన సంస్కరణలు అలాగే ఆదాయ మార్గాలను పెంచడం పన్ను చెల్లింపులలో పూర్తిగా కట్టుదిట్టమైన వైఖరిని అనుసరించడం ద్వారా గతానికి కంటే కూడా జీఎస్టీ వసూళ్ళు ఎప్పటికపుడు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తోంది. అది ఆచరణలో కూడా బాగా కనిపిస్తోంది. నిజానికి ఎంతో సంక్లిష్టమైన పరిస్థితులు అయితే ఇపుడు ఉన్నాయి. అయినా సరే మొక్కవోని దీక్షతో ఏపీ ప్రభుత్వం జీఎస్టీ వసూళ్ళలో టాప్ గేర్ లో నిలవడం అన్నది గ్రేట్ అని అంటున్నారు.

జిఎస్‌టి సంస్కరణల నేపధ్యం :

దేశవ్యాప్తంగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి జిఎస్‌టి సంస్కరణలు అమలు చేశారు. దాని వల్ల సూపర్ ఆదా అంటూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి అల్పాదాయ వర్గాలకు ఎంతో మేలు చెశారు. అదే సమయంలో సవరించిన స్లాబ్ ల కారణంగా చాలా రాష్ట్రాలకు ఎంతో ఇబ్బంది కలిగింది. ఆర్ధికంగా కూడా ఆయా రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితి వచ్చింది. అందులో ఏపీ కూడా ఉంది. ఏకంగా ఎనిమిది వేల కోట్ల రూపాయల దాకా ఏపీ ఏటా భారీ కోతను జిఎస్‌టి సంస్కరణలు కారణంగా చవి చూడాల్సి వచ్చింది. ఆ ప్రభావం మరుసటి నెల నవంబర్ మీద ఎంతో కొంత పడినా డిసెంబర్ వచ్చేసరికి మాత్రం ఏపీ బాగానే కోలుకుని తన ఆర్ధిక స్థిరత్వాన్ని నిలబెట్టుకుంది.

ముందు వరసలో :

ఏపీలో చూస్తే కనుక జిఎస్‌టి వసూళ్ళలో ముందు వరసలో ఉంది అని అధికారులు చెబుతున్నారు. అంతే కాదు జిఎస్‌టి దేశంలో అమలు చేసిన 2017 నుంచి ఇప్పటిదాకా చూస్తే ఏ డిసెంబర్ నెలలో రాని విధంగా ఈసారి జిఎస్‌టి వసూళ్ళు ఏపీకి దక్కాయి అని చెప్పాల్సి ఉంది అని అధికారులు వివరించారు. ఇక 2024 డిసెంబర్ నెలలో చూస్తే జిఎస్‌టి వసూళ్ళతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలంగా మారిందని వివరిస్తున్నారు. నిజానికి చూస్తే అనేక సవాళ్ళు కూడా ఏపీకి ఈ సమయంలో ఎదురయ్యాయి. వాటిని కూడా తట్టుకుని ఏపీలో మంచి స్థాయిలో జిఎస్‌టి వసూళ్లు రావడం పట్ల అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ లెక్క :

ఇక చూస్తే ఏపీలో 2025 డిసెంబర్ నెలలో ఏకంగా జిఎస్‌టి వసూళ్ళు నికర ఆదాయం రెండు వేల 652 కోట్ల రూపాయలుగా ఉంది. ఇది టోటల్ గా గత తొమ్మిదేళ్ళ కాలంలో డిసెంబర్ నెలలో వచ్చిన రికార్డు స్థాయి వసూళ్ళు అని చెబుతున్నారు ఇక 2024 డిసెంబర్ నెల జిఎస్‌టి వసూళ్ళతో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 5.78 వృద్ధి ని నమోదు చేయడం కూడా విశేష పరిణామంగా అధికారులు చెబుతున్నారు. అంతే కాదు, ఈ వసూళ్ళ శాతం జాతీయ సగటుతో పోల్చి చూసినపుడు 5.61 శాతం కంటే ఎంతో ఎక్కువగా ఉంది అని విశ్లేషిస్తున్నారు. క్రమబద్ధమైన ఆర్ధిక స్థిరత్వానికి జిఎస్‌టి వసూళ్ళు ఒక సూచికంగా చెబుతున్నారు. ఇదే తీరున కొత్త ఏడాదిలో కూడా వసూళ్ళలో రికార్డు క్రియేట్ చేయడానికి ఏపీ కృషి చేస్తుందని అధికారులు నమ్మకంగా చెబుతున్నారు.