Begin typing your search above and press return to search.

ఏపీలో షెడ్డుకొచ్చిన రోడ్లు...నిర్మాణం పెను భారం!

రోడ్లు దెబ్బ తినడం ఎక్కడైనా కామన్. కానీ వాటికి ఏ రకమైన మరమ్మతులు చేయకపోతే అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయి.

By:  Satya P   |   28 Nov 2025 5:00 AM IST
ఏపీలో షెడ్డుకొచ్చిన రోడ్లు...నిర్మాణం పెను భారం!
X

రోడ్లు దెబ్బ తినడం ఎక్కడైనా కామన్. కానీ వాటికి ఏ రకమైన మరమ్మతులు చేయకపోతే అవి ఎందుకూ పనికి రాకుండా పోతాయి. అలా చూస్తే కనుక ఏపీలో ఏకంగా 15 వేల కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా పనికి రాని పరిస్థితులో ఉన్నాయని కూటమి ప్రభుత్వం అంటోంది. వైసీపీ ఏలుబడిలో రోడ్లను ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి దాపురించింది అని రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏమాత్రం పట్టించుకోలేదని దాని వల్ల ఆర్ధికంగా కూటమి ప్రభుత్వం మీద పెద్ద భారం పడుతోంది అని అన్నారు.

ఇదీ రోడ్ల దుస్థితి :

మంత్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఏపీలో రోడ్ల పరిస్థితి మీద పూర్తి వివరాలు తెలియజేశారు. ఏపీలో సరైన పర్యవేక్షణ రక్షణ లేకపోవడం వల్ల ఏకంగా 30 వేల కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యానని మంత్రి చెప్పుకొచ్చారు అంతే కాదు అందులో సగానికి సగం రోడ్లు దేనికీ పనికి రాని స్థితికి చేరుకున్నాయని చెప్పారు ఈ 15 కిలోమీటర్ల రోడ్ల కోసమే ప్రభుత్వం అదనంగా 20 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి వస్తోంది అని ఆయన అన్నారు. అయిదేళ్ళ వైసీపీ పాలనలో కనీసం మాత్రంగా రోడ్లను పట్టించుకోకపోవడం వల్లనే ఈ విధంగా రోడ్లు తయారు అయ్యాయని ఆయన విమర్శించారు.

గుంతలు పూడ్చే పనికే :

ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత రోడ్ల వద్ద గుంతలు పూడ్చడానికి ఇప్పటిదాకా మూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది అని ఆయన వివరించారు. ఈ క్రమలో 22 వేల కిలోమీటర్ల రోడ్లను గుంతలతో పునరుధరించామని చెప్పారు. రోడ్ల నాణ్యతా ప్రమాణాలు బాగా ఉండాలని ఆలోచనతో కొత్త విధానాన్ని అనుసరిస్తున్నామని చెప్పారు. డ్యానిష్ ఫైబర్ టెక్నాలజీని ఇందుకోసం వినియోగిస్తున్నామని మంత్రి వెల్లడించారు. అదే విధంగా ఏపీలో దాదాపుగా అయిదు వేల రోడ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని చెప్పారు. ఇక కీలక ప్రాంతాలలో ఎక్స్ ప్రెస్ వేలను అమరావతి రింగ్ రోడు వంటి భారీ ప్రాజెక్టులను టేకప్ చేస్తున్నామని మంత్రి తెలిపారు. రానున్న కాలంలో ఏపీ రోడ్లను పూర్తిగా అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ గా ఉందని అన్నారు. రోడ్లు ప్రగతికి కీలకమని వాటి వల్ల ఎతో అభివృద్ధి ఆధారపడి ఉందని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తోంది అని అన్నారు. ఏపీలో అత్యధికాలం మన్నేలా పూర్తి నాణ్యతా ప్రమాణాలతో రోడ్లను నిర్మిస్తామని ఆయన చెప్పారు.