శ్రీకాంత్ పెరోల్ రద్దు.. చంద్రబాబు సర్కారులో అరాచకం తక్కువే
ప్రభుత్వం ఎవరిదైనా కావొచ్చు.. తప్పులు జరగటం సహజనం. అయితే.. జరిగిన తప్పును సకాలంలో సరి చేసుకునేలా ఆదేశాలు జారీ చేయటం అత్యవసరం.
By: Garuda Media | 20 Aug 2025 10:14 AM ISTప్రభుత్వం ఎవరిదైనా కావొచ్చు.. తప్పులు జరగటం సహజనం. అయితే.. జరిగిన తప్పును సకాలంలో సరి చేసుకునేలా ఆదేశాలు జారీ చేయటం అత్యవసరం.ఈ విషయంలో ఏపీలోని కూటమి ప్రభుత్వం తాను ఆ లైన్ లోనే ఉన్నానన్న విషయాన్ని తన చేతలతో స్పష్టం చేసిందని చెప్పాలి. అయితే.. వైసీపీ నేతలు.. కార్యకర్తలు మాత్రం ఈ ఉదంతంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.అయితే.. ఇందులో పస కంటే నసే ఎక్కువగా ఉందన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. అసలేం జరిగిందంటే..
టీడీపీకి చెందిన శ్రీకాంత్ నెల్లూరు జిల్లాకు చెందిన వారు. హత్య కేసులో జీవిత ఖైదీగా జైల్లో ఉన్నాడు. టీడీపీకి చెందిన ఒక క్రీయాశీలక నేతగా ఉన్న ముఖ్యనేతకు నమ్మకస్తుడు. జీవిత ఖైదీగా ఉన్న అతను.. తరచూ పెరోల్ మీద బయటకు రావటం విమర్శలకు దారి తీస్తోంది. తాజాగా అతడికి పెరోల్ మంజూరైంది. ఇలాంటి వేళలోనే.. హత్య కేసులో శిక్ష పడిన వ్యక్తి ఇంత తరచూ పెరోల్ మీద బయటకు రావటం ఏమిటన్నది చర్చగా మారింది.
అదే సమయంలో అతడికి సన్నిహితంగా ఉండే నిడిగుంట అరుణకు చెందిన ఫోటోలు కొన్ని వెలుగు చూడటం.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీనిపై అరుణ తీవ్రంగా స్పందిస్తూ..కొందరు టీడీపీ నేతలు ఆర్య మీద పగబట్టి..ఈ తరహాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నట్లుగా ఆరుణ ఆరోపించారు. తాను మౌనంగా ఉంటే తన ప్రతిష్ట దిగజారిపోతుందని..అందుకే తాను సోషల్ మీడియాలో పోస్టు పెట్టటం ద్వారా అందరికి విషయాన్ని అర్థమయ్యేలా చేయాలన్నది అరుణ భావనగా చెబుతున్నారు.
ఈ ఉదంతంతో కదిలిన పోలీసు యంత్రాంగం పెరోల్ మీద బయటకు వచ్చిన శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకున్నారు. అతడికి మంజూరు చేసిన పెరోల్ ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉదంతంపై టీడీపీ నేతల వాదన.. వైసీపీకి పూర్తి భిన్నంగా ఉండటం గమనార్హం. తమ ప్రభుత్వంలో తప్పులు జరిగిన అంశం వెలుగు చూసినంతనే చర్యల కత్తికి పదును పెడతారన్న వాదనను వినిపిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ వర్గాల వాదన వేరుగా ఉంది. జీవిత ఖైదీగా ఉన్న నేరస్తుడు తరచూ పెరోల్ మీద బయటకురావటం..అతను బయటకు తీసుకొచ్చేందుకు టీడీపీకి చెందిన ఒక మంత్రి.. ముగ్గురు ఎమ్మెల్యేల ఒత్తిడితోనే హోంశాఖ స్పందించి అతడ్ని జైలు నుంచి పెరోల్ విడుదల అయ్యేలా చేసినట్లుగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
అయితే.. విమర్శలు తెర మీదకు వచ్చిన ఐదు రోజుల్లోనే శ్రీకాంత్ పెరోల్ రద్దు కావటం.. తిరిగి జైలుకు వెళ్లేలా ఆదేశాలు జారీ అయిన వైనాన్ని చూసినప్పుడు కూటమి ప్రభుత్వంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని చెప్పకనే చెప్పేసినట్లుగా చేసిందని చెప్పాలి. ఇదే విషయాన్ని ఏపీ హోంమంత్రి చెబుతూ.. శ్రీకాంత్ కు తమ ప్రభుత్వమే పెరోల్ వచ్చిందని.. అయితే అతడి క్రిమినల్ రికార్డు ఉందన్న విషయాన్ని జైలు అధికారులు చెప్పినంతనే పెరోల్ ను రద్దు చేసినట్లుగా వెల్లడించారు.
ఈ అంశంపై సోషల్ మీడియాలో విష ప్రచారం జరుగుతుందన్న హోం మంత్రి అనిత.. టీడీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖకు పెరోల్ మంజూరు చేయాలనే సిఫార్సు మీరే చేశారుగా అన్నప్పుడు మాత్రం దానికి సమాధానం ఆమె ఇవ్వలేదు. కాకుంటే.. విమర్శలు వెల్లువెత్తిన వెంటనే దాన్ని రద్దు చేయటం ఇప్పుడున్న రాజకీయాల్లో అరుదైన అంశంగా చెబుతున్నారు. ఏమైనా డ్యామేజ్ కంట్రోల్ చర్యలు వేగంగా ఉండటం చంద్రబాబు ప్రభుత్వ ఇమేజ్ ను పెంచుతుందని చెప్పక తప్పదు.
